కరిజ్మాను మళ్లీ మనముందుకు తీసుకురానున్న హీరో మోటోకార్ప్

By Anil

హీరో మోటోకార్ప్‌లో 2-స్ట్రోక్ ఇంజన్‌లు కలిగిన టూ వీవర్ల కాలం చెల్లిపోయిన అనంతరం అందుబాటులోకి వచ్చిన ఫర్ఫామెన్స్ బైకు కరిజ్మా. కరిజ్మా బైకు హీరో హోండా (ఇప్పట్లో హీరో)కు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. గతంలో బజాజ్ పల్సర్ 220 కి కరిజ్మాకు మధ్య పెద్ద యుద్దమే జరిగింది.

హీరో మోటోకార్ప్ నుండి మళ్లీ వస్తున్న కరిజ్మా

2014 లో ఇబిఆర్ ప్రేరణతో రూపొందించబడిన కరిజ్మాలోని ఆర్ మరియు జడ్‌ఎమ్‌ఆర్ రెండు ఉత్పత్తులు కూడా 2016 లోని ఏప్రిల్ నుండి ఆగష్టు మధ్య కాలంలో కేవలం 242 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

హీరో మోటోకార్ప్ నుండి మళ్లీ వస్తున్న కరిజ్మా

ఇక 2015 మొత్తం ఏడాది గమనిస్తే 2,328 యూనిట్ల కరిజ్మా బైకులు మాత్రమే అమ్ముడుపోయాయి. ఒక విుధంగా చెప్పాలంటే పల్సర్ 220 మోడల్‌తో విపరీతమైన పోటీని ఎదుర్కుంది అని చెప్పాలి.

హీరో మోటోకార్ప్ నుండి మళ్లీ వస్తున్న కరిజ్మా

అయితే అమ్మకాల్లో మెరుగైన ఫలితాలను సాధించలేదనే కారణంతో హీరో తమ లైనప్ నుండి తొలగించిందని అనేక అర్థం లేని కథనాలను కూడా చాలా వెబ్‌సైట్లు ప్రచురించాయి.

హీరో మోటోకార్ప్ నుండి మళ్లీ వస్తున్న కరిజ్మా

ఈ నేపథ్యంలో హీరో మోటోకార్ప్‌కు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టిన కరిజ్మాను వదిలే ప్రసక్తే లేదు, మళ్లీ మార్కెట్లోకి కొత్త రూపంలో అందుబాటులోకి తీసుకువస్తామని హీరో మోటోకార్ప్‌లో ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఒక ఇంటర్వూలో తెలిపాడు.

హీరో మోటోకార్ప్ నుండి మళ్లీ వస్తున్న కరిజ్మా

ఇతను మాట్లాడుతూ, హీరో మోటోకార్ప్ ప్రస్తుతం మంచి అమ్మకాలతో దూసుకెళుతోంది అయితే కరిజ్మా మధ్య స్థాయి సెగ్మెంట్ బైక్ కావడంతో అమ్మకాల్లో కాస్త తడబాటు చోటు చేసుకుంది, ఈ కారణం చేత ఈ మోడల్‌ను పూర్తిగా చంపేయలేం. అందుకోసం కరిజ్మా బైకును ప్రేమించే వారి కోసం మళ్లీ మార్కెట్లోకి విడుదల చేయనున్నాం అని చెప్పుకొచ్చాడు.

హీరో మోటోకార్ప్ నుండి మళ్లీ వస్తున్న కరిజ్మా

బైక్‌డివైస్.కామ్ అనే వెబ్‌‍‌సైట్ తెలిపిన నివేదిక ప్రకారం హీరో ప్రస్తుతం కరిజ్మాకు రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ కేంద్రంలో అభివృద్ది చేస్తున్నారు.

హీరో మోటోకార్ప్ నుండి మళ్లీ వస్తున్న కరిజ్మా

హీరో మోటోకార్ప్ ఇది వరకు అందుబాటులో ఉంచిన కరిజ్మాలో 223సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 4-స్ట్రోక్ ఇంజన్‌ను అందించారు.

హీరో మోటోకార్ప్ నుండి మళ్లీ వస్తున్న కరిజ్మా

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 19.20బిహెచ్‌పి పవర్ మరియు 19.30ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

హీరో మోటోకార్ప్ నుండి మళ్లీ వస్తున్న కరిజ్మా

హీరో ఇందులో అడ్వాన్స్‌డ్ మైక్రోప్రాసెస్ ఇగ్నిషన్ సాంకేతికతను పరిచయం చేసింది. ఇక ఇందులోని ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రానికి అందుతుంది.

హీరో మోటోకార్ప్ నుండి మళ్లీ వస్తున్న కరిజ్మా

2014 లో అందుబాటులోకి వచ్చిన హీరో కరిజ్మా పవర్ బ్లాక్, ఎబొని గ్రే, స్పోర్ట్స్ రెడ్ మరియు స్పాట్‌లైట్ వైట్ అనే నాలుగు రంగుల్లో లభించును. అయితే నూతనంగా రానున్న కరిజ్మాలో మరిన్ని విభిన్నమైన రంగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

హీరో మోటోకార్ప్ నుండి మళ్లీ వస్తున్న కరిజ్మా

  • విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ అంతరంగం ఏమిటి ?
  • ఇక్కడ విమానం దింపాలంటే ఆ ఎనిమిది మంది మాత్రమే అర్హులు
  • శకుంతల రైల్వేస్ ఇప్పటికీ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

Most Read Articles

English summary
Read In Telugu: Hero Will Revamp The Karizma Brand
Story first published: Saturday, October 1, 2016, 19:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X