మార్కెట్‌ నుండి విరమించుకున్న హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్

By Anil

భారత దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇండియన్ మార్కెట్లోకి అందించిన తమ స్ల్పెండర్ 100సీసీ ఐస్మార్ట్ కమ్యూటర్ బైకును అమ్మకాల నుండి విరమించుకుంది.

హీరో మోటోకార్ప్ ఈ స్ల్పెండర్ ఐస్మార్ట్ 100సీసీ కమ్యూటర్‌ బైకును 2014 లో పరిచయం చేసింది.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్100 సీసీ బైకులో 97.2సీసీ సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 8.2బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్

ఇందులోని ఇంజన్‌కు 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్

హీరో మొదటి సారిగా ఇందులో ఐ3ఎస్ సాంకేతికతను ప్రవేశపెట్టారు. తద్వారా ఇంజన్ ఆటోమేటిక్‌గా స్టాప్ అండ్ స్టార్ట్ అవుతుంది. తద్వారా ఇది లీటర్‌కు 102 కిమీల మైలేజ్‌ను ఇవ్వగలిగింది.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్

ఇందులో వినియోగించిన సాంకేతికత ద్వారా బైకును ఐడిల్(నడపకుండా స్టార్ట్‌లో ఉంచినపుడు)గా ఉంచినపుడు ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆఫ్ అవుతుంది. అయితే క్లచ్ ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆన్ అవుతుంది.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్

హీరో మోటోకార్ప్ స్ల్పెండర్ ఐస్మార్ట్ 100 సీసీ బైకును 110 సీసీ బైకుతో రీప్లేస్ చేయనుంది.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్

ఇంతకు మునుపు హీరోమోటోకార్ప్ ఈ స్ల్పెండర్ ఐస్మార్ట్110 సీసీ బైకును 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించారు.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్

ప్రముఖ ఆన్‌లైన్ వార్తా సంస్థ కథనం మేరకు ఇండియన్ మార్కెట్లోకి హీరో అతి త్వరలో స్ల్పెండర్ ఐస్మార్ట్ 110సీసీ సామర్థ్యం ఉన్న బైకును విడుదల చేయనుంది ఈ నేపథ్యంలోనే దీనిని అమ్మకాల నుండి విరమించినట్లు తెలిసింది.

.

  • వికారమైన వెర్రికి అర్థం లేని ఆకారంగా మారిన బైకులు
  • .

    • హోండా నుండి మెట్రోపాలిటన్ రెట్రో స్కూటర్

Most Read Articles

English summary
Hero Splendor iSmart 100cc Discontinued
Story first published: Friday, July 8, 2016, 18:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X