ఆటో ఎక్స్ పో వేదిక మీద స్పోర్ట్స్ తరహా శైలిలో కనువిందు చేసిన హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్

By Anil

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో కేవలం కార్లకు మాత్రమే కాదు, టూ వీలర్లకు కూడా నిలయమని హీరోమోటోకార్ప్ తమ ఎక్స్‌ట్రీమ్ బైకును ప్రదర్శించి చెప్పింది. ఎక్స్‌ట్రీమ్ ఏంటి అనుకుంటున్నారు. డిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పో వేదిక మీద హీరో టూ వీలర్ల సంస్థ ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ బైకును ప్రదర్శించింది.

చూడాటానికి స్పోర్ట్స్ తరహా శైలిలో ఉన్న ఈ బైకు ప్రత్యేకతలు, వేటితో పోటీ పడనుంది మరియు దీని సాంకేతిక వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

హీరో మోటోకార్ప్ వారు ఈ ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ టూ వీలర్‌లో 200సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు.

విడుదల చేయు పవర్

విడుదల చేయు పవర్

ఇందులో ఉన్న ఇంజన్ దాదాపుగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.5 బిహెచ్‌పి పవర్ మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 17.2 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును.

విడుదల చేయు టార్క్

విడుదల చేయు టార్క్

ఈ సరికొత్త ఇంజన్ ఉత్తమ పవర్ మరియు గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేయడానికి 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్ దీని ఇంజన్‌కు అనుసంధానమై ఉంటుంది.

ఫీచర్లు

ఫీచర్లు

ఇప్పుడు వినియోగదారులు సస్పెన్షన్‌ అనే విషయాన్ని ముఖ్యంగా పరిగణిస్తున్నారు. ఇందు కోసం హీరో మోటో కార్ప్ వారు ఈ 200 సీసీ కెపాసిటి గల బైకు ముందు వైపున టెలిస్కోపిక్ అప్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుకవైపున మోనో షాక్ అబ్జార్వర్‌ కలదు.

బ్రేకులు

బ్రేకులు

హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ బైకులో భద్రత పరంగా ముందు మరియు వెనుకవైపున డిస్క్ బ్రేకులను అందించారు.

ఇతర ఫీచర్లు

ఇతర ఫీచర్లు

ఈ ఎక్ట్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బైకులో సరికొత్తగా డిజైన్ చేయబడిన ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్, సీట్ మరియు బైకు బాడీ మీద డ్యూయల్ టోన్ గ్రాఫిక్స్ ను డిజైన్ చేశారు.

అందుబాటులోకి

అందుబాటులోకి

హీరో మోటోకార్ప్ దీనిని ఈ ఏడాది మలిసగంలో మార్కెట్లోకి అమ్మకాలకు సిద్దం చేయనున్నట్లు దీని ప్రదర్శన సమయంలో తెలిపారు.

పోటి

పోటి

ఎక్స్‌ట్రీమ్ 20 ఎస్ బైకు మార్కెట్లోకి విడుదల అయితే టివీఎస్ క్రొత్తగా విడుదల చేసిన ఆపాచే 200 4వి, బజాజ్ లోని వివిధ రకాల 200సీసీ వేరియంట్లకు మరియు కెటిఎమ్ డ్యూక్ 200 బైకులకు పోటిగా నిలవనుంది.

స్పోర్ట్స్ తరహా శైలిలో హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ ఆవిష్కరణ
  • యమహా వారు ఎక్స్ పో వేదిక మీద సరికొత్త ఎమ్‌టి-09 బైకును ప్రదర్శించారు.
  • బెనెల్లీ టొరాండో టి-135 ప్రదర్శన
  • 39,500 లకే హోండా నవీ క్రాసోవర్ స్కూటర్

Most Read Articles

English summary
Hero Xtreme 200 S Makes Surprise Debut At Auto Expo 2016
Story first published: Tuesday, February 9, 2016, 10:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X