మార్కెట్ నుండి సిబి యూనికార్న్ 160 ను తొలగించే ఆలోచనలో హోండా

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ తమ సిబి యూనికార్న్ 160 మోడల్‌ను మార్కెట్ నుండి తొలగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

By Anil

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ తమ లైనప్‌లో సిబి యూనికార్న్ 160 మరియు 150 అనే మోడళ్లను అందుబాటులో ఉంచింది. అయితే యూనికార్న్ 160 తమ లైనప్‌లో ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేదనే నెపంతో మార్కెట్ నుండి తొలగించాలని భావిస్తోందని హోండా టూ వీలర్స్ అధికారులు తెలిపారు.

హోండా సిబి యూనికార్న్ 160

గత అక్టోబర్ 2016 లో దేశ వ్యాప్తంగా కేవలం 26 యూనిట్ల సిబి యూనికార్న్ 160 మోడళ్లు అమ్ముడుపోయాయి. హోండా లైనప్‌లో అతి దారుణమైన అమ్మకాలు జరుపుతోన్న మోడల్ ఇదే కావడం వలన మార్కెట్ నుండి తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

హోండా సిబి యూనికార్న్ 160

హోండా సిబి యూనికార్న్ 160 ప్రారంభ ధర రూ. 75,184 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. అయితే తర్వాత కాలంలో సిబి యూనికార్న్ ను రూ. 69,476 ల ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ధరతో మార్కెట్లోకి రీలాంచ్ చేశాక భారీ అమ్మకాలు నమోదయ్యాయి.

హోండా సిబి యూనికార్న్ 160

ఒకానొక దశలో సిబి యూనికార్న్ అమ్మకాలు సిబి యూనికార్న్ 160 ను దాటేశాయి. ఈ కారణం చేత దీనిని మార్కెట్ నుండి తొలగించి నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టాలనిహోండా దృష్టి సారిస్తోంది.

హోండా సిబి యూనికార్న్ 160

  • హోండా నుండి మళ్లీ వస్తోన్న మంకీ 125 బైక్
  • ఇండియన్ మార్కెట్ కోసం హోండా నుండి మెట్రోపాలిటన్ రెట్రో స్కూటర్

Most Read Articles

Read more on: #హోండా #hyundai
English summary
Honda CB Unicorn 160 Could Be Discontinued, Owing To Sales
Story first published: Friday, December 2, 2016, 18:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X