స్లిప్పర్ క్లచ్ అప్‌డేట్స్‌తో కెటిఎమ్ ఆర్‌సి390

By Anil

కెటిఎమ్ ఇండియా తమ అన్ని మోడళ్లను ఒక్కొక్కటిగా అప్‌డేట్ చేయడం ప్రారంభించింది. అందులో దేశీయంగా అందుబాటులో ఉన్న కెటిఎమ్ ఆర్‌సి390 బైకులో సాధారణ క్లచ్ స్థానంలో స్లిప్పర్ క్లచ్‌ను అప్‌డేట్ చేసింది. కెటిఎమ్ ఆర్‌సి390 బైకు ఫోటోల కోసం క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

కెటిఎమ్ ఆర్‌సి390


ఆస్ట్రియన్‌కు చెందన కెటిఎమ్ సంస్థ తమ ఆర్‌సి390 బైకులో చూడదగిన మార్పులు ఏవీ కూడా చేయలేదు. అయితే ఇంజన్ పరికరాలు మరియు వాటి పనితీరుకు చెందిన పరికాలలో మార్పులను కల్పించారు. ఇవి రైడర్‌లకు కావాల్సిన సౌకర్యాలను మరింత ఇముడింపచేశారు.
Also Read: హిమాలయన్‌కు పోటిగా బెనెల్లీ నుండి అడ్వెంచర్ టూరర్ బైకు విడుదల
కెటిఎమ్ ఆర్‌సి390 లో చోటు చేసుకున్న అతి పెద్ద మార్పు స్లిప్పర్ క్లచ్ అప్‌‌డేట్‌తో రావడం. దీని వలన రైడర్ ఈ బైకు రైడింగ్ సమయంలో చక్కటి రైడింగ్ అనుభూతికి లోనవుతాడు ఎందుకంటే గేర్ మార్చాల్సివచ్చినపుడు స్లిప్పర్ గేర్ ఎంతో సహకరిస్తుంది.

ఇందులోని హెడ్ లైట్లు ఎప్పుడు ఆన్‌లోనే ఉంటాయి. ఎందుకంటే దీని కోసం ప్రత్యేకంగా ఆన్ అండ్ ఆఫ్ బటన్‌ను కల్పించలేదు. అయితే అప్పర్ అండ్ డిప్పర్ కోసం బటన్‌ను కల్పించారు. ఎగ్జాస్ట్ సిస్టమ్ మోడిఫికేషన్ మీద కెటిఎమ్ ఎటువంటి దృష్టి పెట్టినట్లు లేదు. 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన దీనికి మరియు 2015 ఎకిమా మోటార్ షోలో ప్రదర్శించిన కెటిఎమ్ ఆర్‌ఎల్390 కి పెద్దగా తేడా లేదు. అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు లేని లీవర్లు మరియు పెద్ద డిస్క్ బ్రేకులు అందని ద్రాక్షే అని చెప్పవచ్చు.
Also Read: దేశీయ మార్కెట్లోకి అబ్బురపరిచే బైకు: ఇండియన్ రోడ్ మాస్టర్
వినియోగాదారులను ఆకట్టుకునేందుకు కెటిఎమ్ తమ ఆర్‌సి390 బైకులో స్మూత్ ఫర్షామెన్స్ ఇవ్వగల ఇంజన్ మరియు స్లిప్పర్ క్లచ్ అనుసంధానం గల గేర్‌బాక్స్‌ను కల్పించారు. డిజైన్ శైలి గురించి మనం ఏ విధంగాను మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కెటిఎమ్ తమ అన్ని బైకులను కూడా ఒకే డిజైన్ ఫ్లాట్‌ఫామ్ మీద తయారు చేశారు. అప్‌డేటెడ్ కెటిఎమ్ ఆర్‌సి390 ధర దాదాపుగా 2.13 లక్షలు ఎక్స్ షో రూమ్ (ఢిల్లీ) గా ఉంది.

Most Read Articles

English summary
KTM Updates The RC390 In India With Slipper Clutch For 2016
Story first published: Monday, February 15, 2016, 13:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X