దేశీయ మార్కెట్లోకి మహీంద్రా వారి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

By Anil

మహీంద్రా అండ్ మహీంద్రా వారు తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన జెన్జీ ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని కోసం 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో ను వేదిక చేసుకుంటోంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్


ఈ స్కూటర్ లో మనం ఊహించినంతగా ఏవిధమైన ఫీచర్లు లేవు. కాని స్పోర్ట్స్ ఫీచర్లు, రేంజ్ ఎస్టిమేషన్, రిమోట్ డయాగ్నస్టిక్ వంటివి ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇది తక్కువ దూర ప్రాంత ప్రయాణాలకు ఎంతో అనువుగా ఉంటుంది.
Also Read: పది మోడల్స్‌ను ప్రదర్శించనున్న హోండా టూ వీలర్స్

మహీంద్రా అండ్ మహీంద్రా వారు ఈ జెన్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో తొలగించడానికి వీలుగా ఉండే లిథియమ్ అయాన్ బ్యాటరిలను కల్పించారు. ఎటువంటి కెపాసిటి వద్ద అయిన ఈ బ్యాటరీలను ఛార్జింగ్ చేసుకోవచ్చు.
Also Read: బాలెనొ దెబ్బకు కుదేలైన హ్యుందాయ్ వారి బెస్ట్ సెల్లింగ్ కారు

మహీంద్రా అండ్ మహీంద్రా వారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పూర్తిగా అల్యూమినియం శరీరంతో తయారు చేశారు మరియు ఇందులో ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ను కల్పించారు. ఉత్తమ రైడింగ్ సౌలభ్యం కోసం ముందు వైపున పెద్ద టైర్లను అందించారు.

Most Read Articles

English summary
Mahindra To Debut Its All-Electric Scooter At 2016 Delhi Auto Expo
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X