2016 సంవత్సరానికి ఎనిమిది విభిన్న రంగుల్లో అందుబాటులోకి రానున్న రాయల్ ఎన్ఫీల్డ్

By Anil

యువత ప్రతి సంవత్సరం కొత్తదనం కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ వారు 2016 సంవత్సరానికి యువతను దృష్టిలో పెట్టుకుని తమ ఎన్పీల్డ్ మోటార్ సైకిల్స్‌ను దాదాపుగా ఎనిమిది విభిన్న రంగుల్లో అందివ్వనుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండే వినియోగదారులకు వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ అందుబాటులో రంగులు మరియు ఇతర వివరాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

నాలుగు మోడల్స్‌లో

నాలుగు మోడల్స్‌లో

రాయల్ ఎన్ఫీల్జ్ వారి కొత్త పెయింట్ స్కీమ్‌ను దాదాపుగా నాలుగు మోడళ్లలో అందివ్వనున్నారు. అందులో

  • క్లాసిక్ 350
  • ఎలక్ట్రా 350
  • క్లాసిక్ 500
  • బుల్లెట్ 500
  • కొన్ని మార్పులతో

    కొన్ని మార్పులతో

    రాయల్ ఎన్ఫీల్డ్ వారు ఈ మోడల్స్‌‌ను కొత్త రంగుల్లో అందించడంతో పాటుగా కొన్ని మార్పులు, చేర్పులు చేసి మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

    అదనపు హంగులు

    అదనపు హంగులు

    కొత్త పెయింట్‌తో పాటుగా ఈ మోటార్ సైకిల్స్ కొన్ని కొత్త స్టిక్కర్లు, క్రోమ్ లోగోలు, హెడ్ లైట్ కేస్, ఫోర్క్ కవర్ మరియు కొత్త సీటు కవర్లను ఇందులో అందిస్తున్నారు.

     మోడల్ పరంగా లభించు రంగులు

    మోడల్ పరంగా లభించు రంగులు

    • రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా 350: మెరేడియన్ బ్లూ మరియు మార్షల్ రెడ్
    • రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350: ఫంకీ మింట్ మరియు చెస్ట్ నట్
    • రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500: మార్ష్ గ్రే
    • రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500: స్వ్కాడ్రన్ బ్లూ, క్రోమ్ గ్రాఫైట్ మరియు క్రోమ్ గ్రీన్ వంటి రంగుల్లో లభించనున్నాయి.
    • ఉత్పత్తి

      ఉత్పత్తి

      రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుతం వీటిని తమిళనాడులోని చెన్నై ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. అయితే ఈ మోటార్ సైకిళ్లను జనవరి చివరికల్లా మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

      ధరలో వ్యత్యాసం

      ధరలో వ్యత్యాసం

      కొత్త రంగుల్లో అందుబాటులోకి రానున్న రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల ధరలు ప్రస్తుతం ఉన్నవాటి కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

      హోండా సిబి హార్నెట్ 160 ఆర్

      మార్కెట్లోకి హోండా టూ వీలర్స్ వారు సరికొత్త హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బైక్‌ను విడుదల చేశారు. ధర, ఇంజన్ మరియు ఫీచర్ల పరంగా ఇది ఎంతో ఉత్తమమైన బైక్ అని మా అభిప్రాయం. దీనిని కేవలం 5,000 రుపాయలతో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీనిని గురించి మరింత తెలుసుకోండి.

Most Read Articles

English summary
Royal Enfield To Offer 8 New Colour Options As 2016 Update
Story first published: Thursday, January 7, 2016, 15:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X