54,000 యాక్సెస్ 125 స్కూటర్లను వెనక్కి పిలిచిన సుజుకి

By Anil

జపాన్ ఆధారిత ప్రముఖ స్కూటర్ల తయారీ సంస్థ సుజుకి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన తమ యాక్సెస్ 125 స్కూటర్లలో సుమారుగా 54,000 యూనిట్లను రీకాల్ చేసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంభందించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

సుజుకి యాక్సెస్ 125 రీకాల్

సుజుకి విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మార్చి 8, 2016 నుండి జూన్ 22, 2016 మధ్యలో ఉత్పత్తి అయిన 54,000 యాక్సెస్ 125 లను రీకాల్ చేసినట్లు తెలిపారు.

సుజుకి యాక్సెస్ 125 రీకాల్

రీకాల్‌కు గల సమస్య గురించి ఆరాతీస్తే రీకాల్‌కు గురైన స్కూటర్లలోని రియర్ యాక్సిల్‌లో లోపం ఉన్నట్లు తెలిసింది.

సుజుకి యాక్సెస్ 125 రీకాల్

రీకాల్‌కు గురైన స్కూటర్లలోని లోపాన్ని ముందు జాగ్రత్తగా గుర్తించేందుకు జూన్ 12 నుండి సుజుకి సంస్థ ఆ స్కూటర్లును కొనుగోలుచేసిన వారిని స్వయంగా సంప్రదించనుంది.

సుజుకి యాక్సెస్ 125 రీకాల్

యాక్సెస్ 125 లలోని రియర్ యాక్సిల్ షాఫ్ట్‌ను సంభందిత డీలర్ల వద్ద ఉచితంగా మార్చబడును. అంతే కాకుండా రియర్ యాక్సిల్ షాప్ట్‌కు సంభందించిన అన్ని సమస్యలను కూడా డీలర్ల వద్ద సర్వీసింగ్ కల్పిస్తోంది సుజుకి.

సుజుకి యాక్సెస్ 125 రీకాల్

సుజుకి సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సరికొత్త యాక్సెస్ 125 స్కూటర్‌ లను రీకాల్ చేసినట్లు తెలిపాడు.

సుజుకి యాక్సెస్ 125 రీకాల్

జపాన్‌ ఆధారిత ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సుజుకి ఉత్పత్తుల శ్రేణిలో అత్యధిక అమ్మకాలు సాధించే ఉత్పత్తి ఇది.

సుజుకి యాక్సెస్ 125 రీకాల్

ఇందులో 124సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 8.5బిహెచ్‌పి పవర్ మరియు 9.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

సుజుకి యాక్సెస్ 125 రీకాల్

సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ లీటర్‌కు 53 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు మరియు దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 61,664 లుగా ఉంది.

సుజుకి యాక్సెస్ 125 రీకాల్

ఈ ఐదు బైకులు భారత దేశపు మైలేజ్ ఛాంపియన్లు

ప్రపంచ స్థాయి సదుపాయాలతో పట్టాలెక్కనున్న తేజాస్ రైలు

Most Read Articles

English summary
Suzuki Recalls Over 54,000 Units Of The Access 125 Scooter
Story first published: Wednesday, July 13, 2016, 10:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X