లైసెన్స్ మరిచిపోయారా ? అయితే యాప్‌లో ఉన్న డిజిటల్ పత్రాలు చూపించండి

By Anil

డ్రైవింగ్ లైసెన్స్ , సీ బుక్, ఇన్సూరెన్స్ వంటి టూ వీలర్లకు చెందిన పత్రాలు ఉండి కూడా వాటిని మరిచిపోయి వెళ్లి పోలీసులకు ఫైన్‌లు కట్టిన చాలా సంధర్బాలు ఉన్నాయి కదా ? పత్రాలు అన్ని ఉండి కూడా ఫైన్‌లు కడితే భలే భాదగా ఉంటుంది కదా. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే ఎందుకు లేదు లక్షణంగా ఉంది అంటోంది తెలంగాణ ప్రభుత్వం.

లైసెన్స్ మరిచిపోయారా ? అయితే యాప్‌లో ఉన్న డిజిటల్ పత్రాలు చూపించండి

కొన్ని సంవత్సరాల పాటు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని ఎర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నూతన పాలనకు తెరలేపుతోంది. అందులో భాగంగా ద్విచక్ర వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొబైల్ ద్వారా తమ లైసెన్స్, సీ బుక్, ఇన్సూరెన్స్ వంటి ఇతరత్రా వాహన పత్రాలను ఎలక్ట్రానిక్ కాగితాల రూపంలో వాహనం యొక్క యాజమానుల పేరుతో భద్ర పరుస్తారు. ఒక వేళ మీరు ఏ ట్రాఫిక్ పోలీసుకైనా పట్టుబడితే పేపర్ల రూపంలో ఉన్న వాహన పత్రాలు లేవని ఫైన్‌లు కట్టాల్సిన అవసరం లేదు.

తెలంగాణ ప్రభుత్వం నేడు విడుదల చేసిన ఎమ్-వ్యాల్లెట్ యాప్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ నుండి లాగిన్ అయ్యి అందులో మీ వివరాలు ఎంటర్ చేస్తే మీ లైసెన్స్ మరియు ఇతరత్రా పత్రాలను పొందగలరు. వాటిని డ్యూటిలో ఉన్న సదరు అధికారులకు చూపించి అక్కడ నుండి తప్పుకోవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ నూతన విధానం ఎంతో బాగుంది కదూ. అయితే ఈ యాప్‌ను తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి అయిన K తారక రామారావు అధికారికంగా విడుదల చేశారు.

ఆర్‌టిఏ అధికారుల సహాకారంతో తయారయిన ఈ యాప్ ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్న 60 లక్షలు వరకు డ్రైవింగ్ లైసెన్స్‌ కలిగిన మరియు 80 లక్షల వరకు ద్విచక్ర వాహన యాజమానులకు ఇది ఎంతో ఉపయోగపడనుందని తెలిపారు. దీనితో పాటు మరొక తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా దీనిని అందుబాటులోకి తీసుకువస్తే తెలుగు రాష్ట్రాల అభివృద్దిలో అర్ధడుగు ముందుకు వేసినట్లు ఉంటుంది.


ఈ వారంలో ఎక్కువ మంది చదివిన కథనం :
యావత్తు ప్రపంచానికి తెలుసు భారత్ ఏయే పొరుగు దేశాలతో ముప్పును కలిగి ఉంది అని. అంతే కాదు ఒక వేళ భారత్ పొరుగు దేశాలతో యుద్ద చేయాల్సి వస్తే ఎటువంటి ఆయుధాలను కలిగి ఉంది అని విశయం కూడా చాలా దేశాలకు తెలుసు. కాని భారత్ అతి రహస్యంగా తయారు చేసిన కాళీ-5000 అనే ఆయుధం గురించి ఎవరికీ తెలియదు. మరి మీలో ఎంత మందికి తెలుసు ? కాళీ రహస్య ఆయుధం గురించి మరిన్ని వివరాలు క్రింది స్లైడర్లలో కలవు.

లేజర్ ఆయుధంగా

లేజర్ ఆయుధంగా

కాళీ-5000 ఆయుధం లేజర్ ఆయుధంగా పనిచేస్తుంది. లేజర్ ఎంత ప్రాణాంతకమో అంతకన్నా ఈ ఆయుధం ప్రాణాంతకం. దీని గురించి మరింత సమాచారం స్లైడ్లను క్లిక్ చేయడం ద్వారా పొందుతారు.

ప్రయోగానికి మూలం

ప్రయోగానికి మూలం

ఈ ఆయుధాన్ని 1985 లో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో డాక్టర్ చిదంబరం ఈ తయారీకి నాంది. లేజర్ పరికరాలను వినియోగించుకునే అన్ని ఆయుధాల కన్నా ఈ కాళీ ప్రాజెక్ట్ ఎంతో శక్తివంతమైనది.

లేజర్ మూలం

లేజర్ మూలం

ఈ ఆయుధానికి ముందు భాగంలో ముక్కు వంటి ప్రోబ్ ఉంటుంది. అధిక సామర్థ్యం ఉన్న ఎలక్ట్రాన్లను ఇందులోని ఎక్స్-రే కిరణాలు ఉత్పత్తి చేస్తాయి. ఇందులో కిలో ఆంపియర్ లీనియర్ ఇంజెక్టర్ వీటిని గ్రహిస్తుంది. దీనినే కాళీ (KALI) అంటారు.

ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది.

ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది.

ముఖ్యంగా ఈ కాళీ ప్రాజెక్ట్‌ను పరిశ్రమల అవసరాల కోసం 1989 లో రూపొందించారు. అయితే రాను రాను కాలానుగమనంలో ఇందులోని శక్తిని అంచనావేసి దీనిని యుద్ద ఆయుధంగా వినియోగంలోకి తీసుకువచ్చారు.

కాళీ ఆయుధ కుటుంబం

కాళీ ఆయుధ కుటుంబం

కాళీ శ్రేణిలో కాళీ 80, కాళీ 200, కాళీ 1000, కాళీ 10000 మరియు కాళీ 5000 వంటి ప్రాజెక్టులతో ఆయుధాలు కలవు. కాళీ కుటుంబంలోని అన్ని ఆయుధాలలో కూడా ఎలక్ట్రాన్‌లు ఎంతో ముఖ్యమైనవి. ఇవి టార్గెట్ మీద దాడి చేయడానికి ఎంతో శక్తివంతమైనవిగా పని చేస్తాయి.

శక్తివంతమైన లేజర్ కిరణాలు

శక్తివంతమైన లేజర్ కిరణాలు

ఇందులో అత్యంత శక్తివంతమైన లేజర్ కిరణాలను వినియోగించారు, తద్వారా శత్రువులు ఉన్న ఎయిర్ క్రాఫ్ట్‌లను లేదా వారు ప్రయోగించిన మిస్సైల్లను నాశనం చేస్తాయి. ముఖ్యంగా ఇలాంటి సందర్బాలలో కాళీ సాఫ్ట్ శత్రువులను సమూలంగా నాశనం చేస్తుంది.

సాఫ్ట్ కిల్లర్

సాఫ్ట్ కిల్లర్

దీనిని సాఫ్ట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే మరే ఇతర వాటితో పోల్చినప్పటికీ ఇది ఎంతో ఖచ్చితంగా శత్రువులను అంతం చేస్తుంది. గాలిలో ఉన్న శత్రువుల విమానాలను మరియు మిసైల్స్‌ను అతి తక్కువ కాలంలో ఊహించని వేగంతో వాటిని నేలపాలు చేస్తుంది.

శక్తి

శక్తి

ఈ కాళీ ఆయుధానికి శక్తి ఎలా వస్తుంది అనుకుంటున్నారా. ఇందులో ఉన్న కెపాసిటర్లలోని సెల్స్‌ నిండా నీటితో నింపాలి ఇదే దీని ఇంధనం.

మైక్రోవేవ్ గన్

మైక్రోవేవ్ గన్

ఈ కాళీ ఆయుధం మీద ఒక మైక్రో వేవ్ గన్ ఉంటుంది. ఇందులోని పాయింటర్ శత్రుల మీద ఫోకస్ చేసి తరువాత కంప్యూటర్ నుండి వాటిని అంతం చేయడానికి కావాల్సి సంకేతాలను ఇస్తే ఎక్స్-రేస్ వాటిని గుర్తించి శత్రువులను క్షణిక కాలంలో అంతం చేసేస్తుంది.

 తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ పరీక్షలు

తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ పరీక్షలు

తేజాస్ ఫైటర్ జెట్‌ను ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఇది ఎంత వరకు రేడియేషన్‌ తట్టుకుంటుంది అని పరీక్షించి చూశారు. అయితే ఈ కాళీ సాఫ్ట్ వేర్‌ను తేజాస్‌లో వినియోగించడానికి డిఆర్‌డిఓ ప్రయోగాలు జరుపుతోంది.

ప్రయోగ విషయాలు

ప్రయోగ విషయాలు

ఏ సందర్బంలోనైనా దీనిని ప్రయోగిస్తే ఈ ఆయుధాన్ని ఉపయోగించిన మరిన్ని వాటిని ప్రభావితం చేయవచ్చ. అంతే కాకుండా ఆయుధం యొక్క బరువు కూడా ఇందులో ఎంతో ముఖ్యమైన అంశం. కాబట్టి మరింత శక్తిని ప్రదర్శించడానికి ఆయుధం యొక్క బరువును బట్టి ఇంధనాన్ని నింపాల్సి ఉంటుంది.

 కాళీ ప్రాజెక్ట్ విమానాలలో

కాళీ ప్రాజెక్ట్ విమానాలలో

భారతదేశపు గగనత వాయు నిఘా విభాగం వారు ఈ కాళీ సాప్ట్‌వేర్‌ను ఐఎల్-76 ఎయిర్ క్రాఫ్ట్‌లో వినియోగించనున్నారు. మరి కొన్ని సంవత్సరాలలో కాళీలోని ఉన్న మైక్రో వేవ్ గన్ వంటి కాళీ కు సంభందించి ఇతర ఆయుధాలను ఇందులో వినియోగించనున్నారు.

చైనాతో ముప్పు

చైనాతో ముప్పు

అత్యంత ముప్పును ఎదుర్కుంటున్న పొరుగు దేశమైన చైనాను అదుపు చేయడానికి ఈ కాళీ ప్రాజెక్ట్‌ ఎంతగానో అవసరం అవుతుందని, ఇండియన్ డిఫెన్స్ తెలిపింది.

ఘోరమైన ఆయుధం

ఘోరమైన ఆయుధం

ఈ ఆయుధం గురించి చెప్పలంటే అత్యంత ఘోరమైన ఆయుధం అని చెప్పవచ్చు. కాబట్టి భారతీయ వాయురంగం దీని పరంగా మరింత శక్తివంతమైనదిగా తయారయ్యిందని చెప్పవచ్చు.

భారతదేశపు రహస్య ఆయుధం కాళీ గురించి ఆసక్తికరమైన విషయాలు
  • జలాంతర్గామిని కోల్పోయిన నార్త్ కొరియా: అమెరికాపై ఆనుమాణాలు...
  • ఇండియన్ IRNSS పరిజ్ఞానానికి అమెరికా కుదేలు కావాల్సిందే...!!

Most Read Articles

English summary
Telangana Launches The 'M-Wallet' App To Help Motorists
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X