ఇండియన్ మార్కెట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 150 సీసీ బైకులు

By Anil

వ్యక్తిగత ప్రయాణానికి టూ వీలర్లను మించిన ప్రయాణ సాధానాలు లేవని ఇండియన్ టూ వీలర్ల మార్కెట్ నిరూపించింది. ప్రతి ఏడాది మరియు ప్రతి నెల కూడా కార్ల కన్నా టూ వీలర్లే ఎక్కువ అమ్మకాలు సాధిస్తున్నాయి.

ఉత్తమ మైలేజ్, ఎంతటి దూరాలనైనా సులభంగా చేరుకోగలగడం మరియు ట్రాఫిక్‌ జామ్‌లను కూడా వీటి ద్వారా సులభంగా ఛేదించవచ్చు. అయితే శక్తివంతమైన 150సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల బైకులు ఏవి మరియు వాటిలో ఉన్న సాంకేతిక వివరాలు, విడుదల చేయు పవర్ అధేవిదంగా ధర వంటి తదితర విషయాలను క్రింది కథనం ద్వారా అందిస్తున్నాము.

10. యమహా ఎఫ్‌జడ్ ఎస్ వెర్షన్ 2.0

10. యమహా ఎఫ్‌జడ్ ఎస్ వెర్షన్ 2.0

యమహా సంస్థ ఇండియన్ మార్కెట్లోకి తమ ఎఫ్‌జడ్ మోడల్ కు కొనసాగింపుగా విడుదల చేసిన ఉత్పత్తి ఎఫ్‌జడ్ ఎస్ వెర్షన్‌ 2.0. దీని ధర సుమారుగా 83,300 ఎక్స్ షోరూమ్‌గా ఉంది.

యమహా ఎఫ్‌జడ్ ఎస్

యమహా ఎఫ్‌జడ్ ఎస్

12 లీటర్ల ఇంధన సామర్థ్యం గల ఇది ఐదు విభిన్న రంగుల్లో లభించును, 1. మ్యాట్ గ్రీన్, 2. అల్లిగేటర్ గ్రీన్, 3. షార్క్ వైట్ 4. వోల్ఫ్ గ్రే, 5.వైపర్ బ్లాక్ వంటి రంగులో

 ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ఇందులో 149సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు.ఇది గరిష్టంగా 13.1 పిఎస్ పవర్ మరియు 12.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును. మైలేజ్: లీటర్‌కు 45 కిలోమీటర్లు ఇవ్వును.

09. హీరో హంక్

09. హీరో హంక్

150సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల బైకులలో హీరోమోటోకార్ప్‌కు చెందిన హంక్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారుగా రూ. 66,987 లుగా ఉంది.

 హీరో హంక్

హీరో హంక్

హీరో మోటోకార్ప్ ఈ బైకు మెరైన్ గ్రీన్, స్పోర్ట్స్ రెడ్, ఫాంథర్ బ్లాక్, ఫోర్స్ సిల్వర్, ఎబొని బ్రౌన్ మరియు బ్లేజింగ్ రెడ్ వంటి రంగుల్లో అందుబాటులో కలదు.

ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ఇందులోని 149.సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 15.6 బిహెచ్‌పి పవర్ మరియు 7000 ఆర్‌‌పిఎమ్ వద్ద 13.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్: ఇందులోని శక్తివంతమైన ఇంజన్ లీటర్‌కు 53 కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

8. హీరో ఇంపల్స్

8. హీరో ఇంపల్స్

ఆఫ్ రోడ్ మరియు లాంగ్ రైడింగ్స్‌కు బాగా సూట్ అయ్యే హీరో వారి ఇంపల్స్ బైకు ఈ జాబితాలో చోటు సాధించింది. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారుగా రూ. 69,461 లుగా ఉంది.

హీరో ఇంపల్స్

హీరో ఇంపల్స్

ఇందులో హీరో మోటోకార్ప్ వారు అత్భుతమైన ఫీచర్లను అందించారు. సెమి డబుల్ క్రాడిల్ ఛాసిస్, డిస్క్ బ్రేకులు, 11 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకు, రెండు వైపులా స్పోక్స్ వీల్స్ మరియు డిజిటల్ స్పీడో మీటర్ వంటివి ఇందులో ఉన్నాయి.

ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ఇంపల్స్‌లోని శక్తివంతమైన 149.2 సామర్థ్యం గల సింగల్ సిలిండర్ 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 13.2 పిఎస్ పవర్ మరియు 13.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

మైలేజ్ లీటర్‌కు: 55 కిమీల మైలేజ్ ఇవ్వగలదు

అత్యధిక వేగం: గంటకు 115 కిలోమీటర్లుగా ఉంది.

7. హీరో ఎక్ట్సీమ్

7. హీరో ఎక్ట్సీమ్

150 సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల బైకులలో హీరో మోటోకార్ప్‌కు చెందిన వరుసగా మూడవ ఉత్పత్తి ఎక్ట్సీమ్ ఈ జాబితాలో స్థానం సంపాదించింది. ఎక్ట్సీమ్ ఎక్స్ షోరూమ్ ధర సుమారుగా రూ. 69,687 లుగా ఉంది.

హీరో ఎక్ట్సీమ్

హీరో ఎక్ట్సీమ్

గంటకు 107 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే ఈ బైకు బాజ్ బ్లూ, మ్యాగ్మా ఆరేంజ్, ఫిర్రి రెడ్, మెర్య్కురిక్ సిల్వర్ మరియు పాంథర్ బ్లాక్ వంటి రంగుల్లో లభించును.

 ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ఇందులోని 149.2సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ సుమారుగా 15.60 బిహెచ్‌పి పవర్ మరియు 13.50 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ముందు మరియు వైనుక రెండు వైపులా డిస్క్ బ్రేక్ వ్యవస్థను కల్పించారు.

మైలేజ్: లీటర్‌‌కు 55 కిలోమీటర్లు

6. సుజుకి జిఎస్ 150 ఆర్

6. సుజుకి జిఎస్ 150 ఆర్

ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉన్న సుజుకి జిఎస్ 150ఆర్ బైకు ప్రత్యేకమైన డబుల్ క్రాడిల్ ఛాసిస్‌ను కలిగి ఉంది. దీని ధర సుమారుగా రూ. 70,815 లు ఎక్స్ షోరూమ్‌గా ఉంది.

సుజుకి జిఎస్ 150 ఆర్

సుజుకి జిఎస్ 150 ఆర్

ఇందులో డిజిటల్ స్పీడో మీటర్, డిజిటల్ ఫ్యూయల్ గేజ్, ఎలక్ట్రిక్ స్టార్ట్, ట్రప్ మీటర్ మరియు అనలాగ్ ట్యాకో మీటర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ఇందులోని శక్తివంతమైన 149.5 సీసీ గల ఇంజన్ 13.8 బిహెచ్‌పి పవర్ మరియు 13.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ కలదు.

మైలేజ్: లీటర్‌కు 56 కిలోమీటర్లు

అత్యధిక వేగం: గంటకు 108 కిలోమీటర్లు

5. హీరో అచీవర్

5. హీరో అచీవర్

ఈ జాబితాలో హీరో వారి వరుసగా నాలుగల ఉత్పత్తి అచీవర్ ఐదవ స్థానంలో నిలిచింది. ముందు మరియు వెనుక వైపున డిస్క్ బ్రేక్ ఆప్షన్ ద్వారా అందుబాటులో ఉన్న దీని ధర సుమారుగా రూ. 58,907 లు ఎక్స్ షోరూమ్ గా ఉంది.

హీరో అచీవర్

హీరో అచీవర్

గంటకు 101 కిలోమీటర్ల అత్యధిక వేగంతో పరుగులు పెట్టో ఈ బైకులు నాలుగు విభిన్న రంగుల్లో అందుబాటులో కలదు, అవి 1. ఫాంథర్ బ్లాక్, 2. ఫోర్స్ సిల్వర్, 3. మెటాలిక్ మ్యాట్ గ్రే, 4. క్యాండీ బ్లేజింగ్.

 ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ఇందులోని శక్తివంతమైన 149.2సీసీ కెపాసిటి గల ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ సుమారుగా 13.4 బిహెచ్‌పి పవర్ మరియు 12.80ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

మైలేజ్: లీటర్‌కు 58 కిలోమీటర్లు ఇవ్వగలదు.

 4. హోండా సిబి హార్నెట్ 160 ఆర్

4. హోండా సిబి హార్నెట్ 160 ఆర్

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా వారు తాజాగా ఇండియన్ మార్కెట్లోని 150 సీసీ సెగ్మెంట్లోకి ఈ హార్నెట్ బైకును విడుదల చేశారు. ఇందులోని స్టాండర్డ్ వేరియంట్ ధర 79,900 లు మరియు సిబిఎల్ వేరియంట్ ధర రూ. 84,400 లు ఎక్స్ షోరూమ్‌గా ఉన్నాయి.

 హోండా సిబి హార్నెట్ 160 ఆర్

హోండా సిబి హార్నెట్ 160 ఆర్

గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టో హార్నెట్ ఐదు విభిన్న రంగుల్లో లభించును. అవి, 1. పియర్ల్ నైట్ స్టార్ బ్లాక్, 2. పియర్ల్ సిరెన్ బ్లూ, 3.స్పోర్ట్స్ రెడ్, 4. పియర్ల్ అమేజింగ్ వైట్, 5. నియో ఆరేంజ్ మెటాలిక్ వంటి రంగులు.

 ఇంజన్ మరియు సాంకేతిక వివరాలు

ఇంజన్ మరియు సాంకేతిక వివరాలు

ఇందులోని శక్తివంతమైన 162.71 సీసీ గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ దాదాపుగా 15.6 బిహెచ్‌పి పవర్ మరియు 14.76 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

మైలేజ్: లీటర్‌కు 58.9 కిలోమీటర్లు

3. బజాజ్ డిస్కవర్ 150 ఎఫ్

3. బజాజ్ డిస్కవర్ 150 ఎఫ్

150 సీసీ సెగ్మెంట్లో నాలుగు వాల్వ్‌లను కలిగి ఉన్న ఏకైక బైకు బజా‌జ్ వారి డిస్కవర్ 150 ఎఫ్. దీని ధర సుమారుగా రూ. 59,211 లు ఎక్స్‌ షోరూమ్‌గా ఉంది.

బజాజ్ డిస్కవర్ 150 ఎఫ్

బజాజ్ డిస్కవర్ 150 ఎఫ్

బజాజ్ డిస్కవర్ 150 ఎఫ్ బైకు ఐదు విభిన్న రంగుల్లో లభించును అవి.

  • బ్లాక్ గోల్డ్
  • డార్క్ బ్లూ
  • డార్క్ బాటిల్ గ్రీన్
  • ఎబోని బ్లాక్
  • వైన్ రెడ్
  • ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

    ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

    ఇందులోని శక్తివంతమైన 150సీసీ కెపాసిటి గల 4-వాల్వ్, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ సుమారుగా 14.30 బిహెచ్‌పి పవర్ మరియు 12.70 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును.

    మైలేజ్: లీటర్‌కు 60 కిలోమీటర్లు ఇవ్వగలదు.

     2. బజాజ్ అవెంజర్ 150 స్ట్రీట్

    2. బజాజ్ అవెంజర్ 150 స్ట్రీట్

    గత ఏడాది బజాజ్ ఆటో మార్కెట్లోకి విడుదల చేసిన అవెంజర్ 150 స్ట్రీట్ మరియు 220 స్ట్రీట్‌లను ఒకే సారి విడుదల చేసింది. ఈ టాప్-10 జాబితాలో చోటు సాధించిన అవెంజర్ 150 స్ట్రీట్ ధర సుమారుగా రూ. 72,901 లు ఎక్స్ షోరూమ్ గా ఉన్నాయి.

     బజాజ్ అవెంజర్ 150 స్ట్రీట్

    బజాజ్ అవెంజర్ 150 స్ట్రీట్

    ఇందులోని శక్తివంతమైన 150 సీసీ కెపసిటి గల ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ సుమారుగా 14.30 బిహెచ్‌పి పవర్ మరియు 12.50 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

    మైలేజ్ మరియు ఫీచర్లు

    మైలేజ్ మరియు ఫీచర్లు

    మైలేజ్ : లీటర్‌కు 65 కిలోమీటర్లుగా ఉంది.

    ఫీచర్లు :

    • డిజిటల్ స్పీడో మీటర్
    • వెడల్పాటి వెనుక చక్రం
    • పొడవైన వీల్ బేస్
    • సరికొత్త డిటిఎస్-ఐ ఇంజన్
    • అల్లాయ్ వీల్స్
    • సులభంగా నియంత్రించగలిగే హ్యాండిల్ బార్
    •  1. బజాజ్ పల్సర్ 150 డిటిఎస్-ఐ

      1. బజాజ్ పల్సర్ 150 డిటిఎస్-ఐ

      టాప్-10 జాబితాలో వరుసగా బజాజ్ వారి మూడవ ఉత్పత్తి పల్సర్ 150 డిటిఎస్-ఐ మొదటి స్థానంలో నిలిచింది. బజాజ్ పల్సర్ 150 డిటిఎస్-ఐ ధర సుమారుగా రూ. 73,382 లు ఎక్స్‌ షోరూమ్‌గా ఉంది.

       బజాజ్ పల్సర్ 150 డిటిఎస్-ఐ

      బజాజ్ పల్సర్ 150 డిటిఎస్-ఐ

      గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే పల్సర్ బైకు నాలుగు డిఫరెంట్ రంగుల్లో లభించును. అవి, 1. ఎబోని బ్లాక్, 2. పియర్ల్ మెటాలిక్ వైట్, 3. సఫైర్ బ్లూ, 4. కాక్‌టైల్ వైన్ రెడ్ వంటి రంగులు

       ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

      ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

      ఇందులోని 149 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ దాదాపుగా 15 బిహెచ్‌పి పవర్ మరియు 12 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

      మైలేజ్: లీటర్‌కు 65 కిలోమీటర్లు.

      మీకు తెలుసా ? గత పదేళ్ల నుండి బజాజ్ టూ వీలర్ల సంస్థలో ఎక్కువగా అమ్ముడుపోతున్న ఏకైక ఉత్పత్తి బజాజ్ పల్సర్ 150 డిటిఎస్-ఐ

Most Read Articles

English summary
Top 10 Best Mileage Bike in India 150cc Segment 2016
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X