టాప్-10 జాబితాలో టీవీఎస్ ఎక్స్‌ఎల్

By Anil

ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమలో ద్విచక్ర వాహనాల సెగ్మెంట్ ఒక ప్రముఖ పాత్ర పోషిస్తోంది అని చెప్పవచ్చు. ఇందుకు నిదర్శనం కేవలం ఒక్క మే 2016 లోనే 15,15,556 యూనిట్ల ద్విచక్రవాహనాలు అమ్ముడుపోయాయి. తద్వారా దేశీయ నిధికి టూ వీలర్లు ఇంధనంగా మారాయి. మొత్తం అమ్మకాలలో కమ్య్మూటర్ బైకుల సంఖ్యే ఎక్కువగా ఉంది.

మే 2016 మాసంలో ఎక్కువగా అమ్ముడుపోయిన టాప్-10 ద్విచక్రవాహనాల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 10. టీవీఎస్ జూపిటర్

10. టీవీఎస్ జూపిటర్

మే 2016 లో స్వదేశీ ద్విచక్రవాహనాల తయారీ సంస్థకు చెందిన టీవీఎస్ జూపిటర్ 43,867 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. అందుకు ముందు ఏడాదితో పోల్చుకుంటే అమ్మకాల పరంగా 37 శాతం వృద్దిని సాధించింది.

 టీవీఎస్ జూపిటర్ గురించి

టీవీఎస్ జూపిటర్ గురించి

  • ఇంజన్: 109 సీసీ
  • పవర్ : 7.80 బిహెచ్‌పి
  • టార్క్ : 8 ఎన్ఎమ్
  • మైలేజ్ : 56 కిమీ/లీ
  • ట్రాన్స్‌మిషన్ : సివిటి
  • ప్రారంభ ధర : రూ. 59,051 లు
  •  09. బజాజ్ పల్సర్

    09. బజాజ్ పల్సర్

    బజాజ్ ఆటో సంస్థకు చెందిన ఉత్తమ కెపాసిటి మోటార్ సైకిల్ బజాజ్ పల్సర్ 46,307 యూనిట్ల వరకు అమ్ముడుపోయింది. అంతకు మునుపు ఇదే కాలంతో పోల్చితే అమ్మకాల పరంగా 13 శాతం వృద్దిని కోల్పోయింది. అయితే రెండు సార్లు కూడా తొమ్మిదవ స్థానంలో నిలిచింది.

     బజాజ్ పల్సర్ గురించి

    బజాజ్ పల్సర్ గురించి

    • ఇంజన్: 150 సీసీ
    • పవర్ : 15 బిహెచ్‌పి
    • టార్క్ : 12 ఎన్ఎమ్
    • మైలేజ్ : 65 కిమీ/లీ
    • ట్రాన్స్‌మిషన్ : 5-స్పీడ్ మ్యాన్యువల్
    • ప్రారంభ ధర : రూ. 82,882 లు
    • 08. బజాజ్ సిటి100

      08. బజాజ్ సిటి100

      బజాజ్ వారి ఎకైక కమ్య్మూటర్ బైకు సిటి100. ఉత్తమ మైలేజ్ ఇవ్వగల సిటి100 గత ఏడాది మే లో 66,263 యూనిట్లు అమ్మకాలు జరిపి ఆరవ స్థానంలో నిలవగా. ఈ సారి మే 2016 లో 51,893 యూనిట్లు అమ్మకాలు జరిపి అమ్మకాల పరంగా 22 శాతం వృద్దిని కోల్పోయి ఎనిమిదవ స్థానంలో నిలిచింది.

       బజాజ్ సిటి100 గురించి

      బజాజ్ సిటి100 గురించి

      • ఇంజన్: 99.27 సీసీ
      • పవర్ : 8.10 బిహెచ్‌పి
      • టార్క్ : 8.05 ఎన్ఎమ్
      • మైలేజ్ : 89 కిమీ/లీ
      • ట్రాన్స్‌మిషన్ : 4-స్పీడ్ మ్యాన్యువల్
      • ప్రారంభ ధర : రూ. 36,897 లు
      •  07. హోండా సిబి షైన్

        07. హోండా సిబి షైన్

        హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన డీసెంట్ మోటార్ సైకిల్ సిబి షైన్ 2015 మే నెలలో 78,183 యూనిట్ల అమ్మకాలు సాధించి ఐదవ స్థానంలో నిలిచింది. అయితే 2016 మే అమ్మకాలకు వచ్చేసరికి 56,818 యూనిట్లు అమ్మకాలు జరిపి అమ్మకాల పరంగా 27 శాతం వృద్దిని కోల్పోయి ఏడవ స్థానంలో నిలిచింది.

        హోండా సిబి షైన్ గురించి

        హోండా సిబి షైన్ గురించి

        • ఇంజన్: 125 సీసీ
        • పవర్ : 10 బిహెచ్‌పి
        • టార్క్ : 11 ఎన్ఎమ్
        • మైలేజ్ : 65 కిమీ/లీ
        • ట్రాన్స్‌మిషన్ : 4-స్పీడ్ మ్యాన్యువల్
        • ప్రారంభ ధర : రూ. 64,983 లు
        •  06. హీరో గ్లామర్

          06. హీరో గ్లామర్

          హీరో మోటోకార్ప్ మైలేజ్ మరియు కెపాసిటి పరంగా అందుబాటులోకి తెచ్చిన గ్లామర్ నెల నెలా మంచి ఆదరణ పొందుతోంది. గత ఏడాది ఇదే నెలలో 58,434 యూనిట్ల అమ్మకాలు జరిపి ఎనిమిదవ స్థానంలో ఉండగా ఆ యేడు మే నెలలో 74,590 యూనిట్లు అమ్మకాలు జరిపి ఆరవ స్థానంలో నిలిచింది. అమ్మకాల వృద్ది పరంగా 28 శాతం ఆధిక్యంలో ఉంది.

           హీరో గ్లామర్ గురించి

          హీరో గ్లామర్ గురించి

          • ఇంజన్: 125 సీసీ
          • పవర్ : 8 బిహెచ్‌పి
          • టార్క్ : 10 ఎన్ఎమ్
          • మైలేజ్ : 55 కిమీ/లీ
          • ట్రాన్స్‌మిషన్ : 4-స్పీడ్ మ్యాన్యువల్
          • ప్రారంభ ధర : రూ. 64,851 లు
          •  05. టీవీఎస్ ఎక్స్‌ఎల్

            05. టీవీఎస్ ఎక్స్‌ఎల్

            టీవీఎక్స్ సంచార వ్యాపార మరియు పల్లె ప్రాంతాలకు ఎంతగానో సరిపోయే ద్విచక్ర వాహనం టీవీఎస్ ఎక్స్ఎల్. దేశీయంగా ఎలాంటి పోటీ లేకపోవడం మరియు ఉత్తమ మైలేజ్ ఇవ్వడం దీని అమ్మకాలకు బాగా కలిసొచ్చిన అంశాలు. గత ఏడాది మే నెలలో 63,555 యూనిట్లు అమ్ముడుపోగా, 2016 మే నెలలో ఏకంగా 75,406 యూనిట్లు అమ్మకాలు జరిపి 19 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

            టీవీఎస్ ఎక్స్‌ఎల్ గురించి

            టీవీఎస్ ఎక్స్‌ఎల్ గురించి

            • ఇంజన్: 69.90 సీసీ
            • పవర్ : 3.50 బిహెచ్‌పి
            • టార్క్ : 5 ఎన్ఎమ్
            • మైలేజ్ : 66 కిమీ/లీ
            • ట్రాన్స్‌మిషన్ : సివిటి
            • ప్రారంభ ధర : రూ. 33,364 లు
            • 04. హీరో ప్యాసన్

              04. హీరో ప్యాసన్

              హీరో మోటోకార్ప్ వారి రెండవ ఉత్పత్తి హీరో ప్యాసన్ టాప్-10 జాబితాలో చోటు దక్కించుకుంది. గత ఏడాది మే మాసంలో 1,04,054 యూనిట్ల ప్యాసన్ బైకులు అమ్ముడుపోగా ఈ ఏడాది మే నెలలో 97,882 యూనిట్లు అమ్ముడుపోయి శాతం వృద్దిని కోల్పోయింది.

              హీరో ప్యాసన్ గురించి

              హీరో ప్యాసన్ గురించి

              • ఇంజన్: 97.20 సీసీ
              • పవర్ : 8.20 బిహెచ్‌పి
              • టార్క్ : 8.05 ఎన్ఎమ్
              • మైలేజ్ : 84 కిమీ/లీ
              • ట్రాన్స్‌మిషన్ : 4-స్పీడ్ మ్యాన్యువల్
              • ప్రారంభ ధర : రూ. 56,517 లు
              •  03. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

                03. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

                హీరో మోటోకార్ప్ వారి మరొక ఉత్పత్తి హెచ్‌ఎఫ్ డీలక్స్ మూడవ స్థానంలో నిలించింది. గత ఏడాది మే మాసంలో 93,944 యూనిట్లు అమ్ముడు కాగా ఈ ఏడాది మే నెలలో 1,12,273 యూనిట్లు అమ్ముడుపోయి 20 శాతం వృద్దిని నమోదు చేసుకుని మూడవ స్థానంలో నిలిచింది .

                 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ గురించి

                హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ గురించి

                • ఇంజన్: 97.2 సీసీ
                • పవర్ : 8.24 బిహెచ్‌పి
                • టార్క్ : 8.05 ఎన్ఎమ్
                • మైలేజ్ : 82.9 కిమీ/లీ
                • ట్రాన్స్‌మిషన్ : 4-స్పీడ్ మ్యాన్యువల్
                • ప్రారంభ ధర : రూ. 48,449 లు
                • 02. హీరో స్ల్పెండర్

                  02. హీరో స్ల్పెండర్

                  హీరో మోటోకార్ప్ వారి నాలుగవ ఉత్పత్తి స్ల్పెండర్ టాప్-10 జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. గత ఏడాది మే నెలలో 2,41,249 యూనిట్ల అమ్మకాలు జరిపి మొదటి స్థానంలో నిలవగా ఈ ఏడాది 2,07,010 యూనిట్లు అమ్మకాలు జరిపి 14 శాతం అమ్మకాల వృద్దిని కోల్పోయి రెండవ స్థానంలో నిలిచింది

                   హీరో స్ల్పెండర్ గురించి

                  హీరో స్ల్పెండర్ గురించి

                  • ఇంజన్: 97.2 సీసీ
                  • పవర్ : 8.24 బిహెచ్‌పి
                  • టార్క్ : 8.05 ఎన్ఎమ్
                  • మైలేజ్ : 80.6 కిమీ/లీ
                  • ట్రాన్స్‌మిషన్ : 4-స్పీడ్ మ్యాన్యువల్
                  • ప్రారంభ ధర : రూ. 52,740 లు
                  • 01. హోండా ఆక్టివా

                    01. హోండా ఆక్టివా

                    హోండా మోటార్ సైకిల్స్‌ అండ్ స్కూటర్స్ ఇండియాను దేశీయ మార్కెట్లో గుర్తించడం వెనుకున్న ఏకైక కారణం ఆక్టివా. సుమారుగా 2,37,317 యూనిట్ల అమ్మకాలు జరిపి దేశ వ్యాప్తంగా అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న టూ వీలర్‌గా టాప్-10 జాబితాలో నిలిచింది.

                    హోండా ఆక్టివా గురించి

                    హోండా ఆక్టివా గురించి

                    • ఇంజన్: 124.9 సీసీ
                    • పవర్ : 8.6 బిహెచ్‌పి
                    • టార్క్ : 10.12 ఎన్ఎమ్
                    • మైలేజ్ : 60 కిమీ/లీ
                    • ట్రాన్స్‌మిషన్ : సివిటి
                    • ప్రారంభ ధర : రూ. 66,394 లు
                    • 2016 మే లో అత్యధికంగా అమ్మడుపోయిన టాప్-10 టూ వీలర్లు

                      ఇండియన్ మార్కెట్లో రెండు లక్షలలోపున్న ఏడు సూపర్ బైకులు

                      కాలేజ్ యువత ఎక్కువగా ఇష్టపడుతున్న టూ వీలర్లు

Most Read Articles

English summary
Top 10 Best Selling Two Wheelers In May 2016
Story first published: Monday, June 27, 2016, 18:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X