దేశీయ విపణిలోకి టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

By Anil

దేశీయంగా మరియు అంతర్జాతీయంగా చాలా వరకు వాహన తయారీ సంస్థలు ప్రజారవాణాలో మార్పులు తీసుకురావడానికి తీవ్ర ప్రయాత్నాలు చేస్తున్నాయి. అందులో ఎక్కువగా ఇప్పుడున్న పెట్రోల్ మరియు డీజల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలను అభివృద్ది చేస్తున్నాయి.

భవిష్యత్తు ప్రయాణ సాధనాలు అన్ని కూడా ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ పరిజ్ఞానంతో ముడిపడి ఉన్నాయని మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుత ప్రజానీకానికి టీవీఎస్ మోటార్స్ ఐక్యూబ్ అనే మొదటి హైబ్రిడ్ స్కూటర్‌ను అభివృద్ది చేసింది. దీని సంగతులేంటో చూద్దామా మరి.

 టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ద్వి మరియు త్రి చక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ తమ మొదటి హైబ్రిడ్ స్కూటర్‌‌ను ఐక్యూబ్ పేరుతో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

 టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

టీవీఎస్ మోటార్స్ ఈ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్‌ను 2016 ఏడాది చివరికల్లా ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

 టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

టీవీఎస్ మోటార్స్ ఇప్పటికే ఐక్యూబ్ పేరు మరియు ఐక్యూబ్ అన్ని హైబ్రిడ్ నమూనాల భద్రత కోసం ట్రేడ్‌మార్క్‌కు ధరకఖాస్తు చేసుకుంది.

 టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

క్యూబ్ కాన్సెప్ట్ పేరుతో ఈ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్‌ను 2012 లో జరిగిన ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు. దీనిని ఇప్పుడు మరింత అభివృద్ది చేసి ఐక్యూబ్ హైబ్రిడ్ పేరుతో విడుదల చేయనున్నారు.

 టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్‌లో 100సీసీ సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్‌‌లో ఎకానమీ మరియు పవర్ అనే రెండు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది.

 టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

ఎకానమీ మోడ్‌లో రైడింగ్ ఎక్కువ మైలేజ్‌ను ఇవ్వగలదు మరియు పవర్‌ మోడ్‌లో పెట్రోల్ ఇంజన్ అలాగే ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కూడా పనిచేస్తాయి. తద్వారా ఎక్కువ పనితీరును కనబరుస్తుంది.

టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోతున్న ప్రయాణ సాధనాలలో స్కూటర్ల వాటా ఎక్కువగా ఉంది. అందులో హైబ్రిడ్ స్కూటర్‌లు రంగప్రవేశం చేశాయంటే ఖచ్చింతంగా ఇవి ఒక కొత్త విప్లవాన్ని మార్కెట్లో సృష్టిస్తాయి.

టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

బజాజ్ పల్సర్ సిఎస్400 గురించి 9 ముఖ్యమైన విషయాలు

అసలైన ఇండియన్స్ యొక్క సిసలైన బైకు - టీవీఎస్ విక్టర్

Most Read Articles

English summary
TVS IQube To Launch In India As The First Hybrid Scooter
Story first published: Saturday, May 28, 2016, 10:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X