"క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ" కొచ్చిలో క్రిస్మస్ సంభరాలు

Written By:

డ్రైవ్‌స్పార్క్ బృందం కొచ్చి నగరంలో క్రిస్మస్ వేడుకలును టీవీఎస్ వీగో సహాయంతో జరుపుకుంది. మొదటి రోజు కొచ్చి గురించిన వివరాలు మొదటి కథనంలో తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు కొచ్చిలోని రెండో రోజు పర్యటన వివరాలను తెలుసుకుందాం.

శాంతి , ప్రేమ, మరియు ఆనందంతో నిండి ఉండే క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీస్ గా పిలువబడే కొచ్చిలోని క్రిస్మస్ మరియు కొచ్చి నగర విశేషాలను తెలుసుకుందాం రండి.

కొచ్చి నగరంలో ముందుగా తెలుసుకోవాల్సినది సెయింట్ జార్జ్ సైరో మలబార్ క్యాథలిక్ ఫోరన్ చర్చ్. భారత దేశపు అతి పురాతణమైన చర్చిల్లో ఇది ఒకటి. దీనిని క్రీ.శ 594 సంవత్సరంలో నిర్మించారు.

బృందంలోని సభ్యులు కొచ్చి-ముజిరిస్ బియన్నెల్ ఎగ్జిబిషన్ మీదుగా చర్చిని చేరుకున్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇక్కడ సమకాళీన కళల ప్రదర్శను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి చర్చికి కాస్త దూరం ఉన్నప్పటికీ వీగో లోని శక్తివంతమైన సింగల్ సిలిండర్ ఇంజన్ యొక్క అద్వితీయ పనితీరు ద్వారా చాలా వేగంగా చేరుకున్నాం.

కొచ్చి లోని ప్రముఖ సెయింట్ జార్జ్ సైరో మలబార్ క్యాథలిక్ ఫోరన్ చర్చ్ అనంతరం సెయింట్ ఫ్రాన్స్ చర్చ్‌ని చేరుకోవడం జరిగింది. ఈ చర్చికి కూడా ఒక చరిత్ర ఉంది. వాస్కోడగామా అత్యక్రియలను 1539 లో ఇక్కడే చేసారు.

కేరళలో చర్చిల తరువాత అతి ముఖ్యమైన అంశం, సముద్ర ఆహారం. దేశ వ్యాప్తంగా దొరికే చేపల కన్నా కేరళలో దొరికే చేపలకు కొంత ప్రత్యేకత ఉంది. కేరళీయులకు చేపలు ప్రధాన ఆహారం. విభిన్న రకాల చేపలను ఇక్కడ గమనించవచ్చు. ప్రత్యేకించి ప్రతి ఏడాది కార్నివాల్ జరుగుంది. ఇక్కడ విభిన్న చేపలను తినవచ్చు.

పోర్చుగీస్ దేశీయుల ఆధీనంలో ఉన్న సమయంలోనే ఈ కొచ్చి కార్నివాల్ ప్రారంభమైంది. అప్పటి నుండి ఆనవాయితీగా ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. కొచ్చి నగరంలోని పెద్దలు, పిల్లలు అందరూ తెల్లని దుస్తులు ధరించి ఈ కార్నివాల్‌లో భాగంగా పాల్గొని ఆట పాటలతో సరదాగా గడుపుతారు.

కొచ్చి కార్నివాల్ కు నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేళ మంచి ఆదరణ ఉంటుంది. సంగీత వాయిద్దాలతో ఎనుగు ఊరేగింపుతో కొచ్చి వీధుల్లో కార్నివాల్ సంభరాలు అంగరంగవైభవంగా ఉంటాయి.

కొచ్చి నగర విశేషాలను తెలుసుకోవడానికి మా బృందం టీవీఎస్ వీగో స్కూటర్‌ను వినియోగించింది. రైడింగ్ సమయంలో బ్యాడీ బ్యాలెన్సింగ్, సింక్ బ్రేక్ సిస్టమ్, వంటి అంశాల పనితీరు అద్బుతమని గుర్తించారు.

రోజు మొత్తం నగరంలో చక్కర్లు కొట్టిన అనంతరం ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే టీవీఎస్ వీగో లోని ఛార్జింగ్ పోర్ట్ ద్వారా ఛార్జ్ చేసుకున్నారు. తరువాత యధావిధిగా మొబైల్ ద్వారా ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు. కాబట్టి వీగో స్కూటర్ మీ చెంత ఉంటే ఫోన్ ఛార్జింగ్ సమస్య అస్సలు రాదు.

రెండవ రోజు తొలి సగం బాగా తిరిగిన అనంతరం మధ్యాహ్న భోజానికి సీసైడ్ హోటల్ సీగల్ రెస్టారెంట్ ‌ను ఎంచుకున్నారు. తమ చరిత్రను, ప్రత్యేకతను తెలిపే విధంగా కొచ్చిలో రెస్టారెంట్లు దర్శనమిస్తాయి.

అరేబియా సముద్రం కనబడే విధంగా ఈ సీగల్ రెస్టారెంట్ ఉంటుంది. స్కూటర్ల ప్రపంచంలో ఒగ యుగం గడిపోయిందనే విషయాన్ని తెలిపే విధంగా రెస్టారెంట్ ఎంట్రన్స్‌ లో పాత కాలం నాటి స్కూటర్‌ను గమనించవచ్చు. పాత స్కూటర్ ను గమనించిన తరువాత, స్కూటర్ల ప్రపంచంలో చోటు చేసుకున్న మార్పులను స్పష్టంగా గుర్తించవచ్చు.

టీవీఎస్ వీగో లో సస్పెన్షన్ పరంగా ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స కలవు. ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కంట్రోల్, అండర్ సీట్ స్టోరేజ్, సులభంగా ఉపయోగించగలిగే ఎలక్ట్రిక్ స్టార్ట్ ఆప్షన్ వంటి ఫీచర్లు కలవు. మరియు అన్నింటి కంటే వెంటనే అత్యధిక పవర్ ఉత్పత్తి చేయగలదు ఈ స్కూటర్.

డిజైన్ పరంగా అందరూ దీని వైపు తలతప్పి చూసే విధంగా తీర్చిదిద్దబడింది. ఆకర్షణీయమైన కలర్స్, అన్ని రకాల ఎత్తున్న వాళ్లకు సరిగ్గా సరిపోయే విధంగా దీనిని నిర్మించారు.

డ్రైవ్‌స్పార్క్ బృందం కొచ్చిలోని రెండవ రోజు పర్యటన పూర్తయ్యింది. మది నిండా కొచ్చి అనుభూతుల్ని నింపుకునే ఫోటోలను చాలా వరకు తీసుకోగలిగారు. రెండు రోజులు కూడా చాలా మంచి అనుభూతుల్ని మిగిల్చాయి. మా ఈ ప్రయాణంలో టీవీఎస్ వీగో ఎంతగానో సహకరించింది. #WegoCochin రెండు రోజుల ఎపిసోడ్ విజయవంతంగా ముగిసిపోయింది.

దీని తర్వాత మరేంటి...? దీనికి అంతం ఉందా...? భారత దేశంలో ప్రముఖ పండుగలను టీవీఎస్ వీగో ద్వారా వివిధ నగరాల్లో జరుపుకనే ఛాలెంజ్ కొనసాగుతూనే ఉంటుంది. త్వరలో ఆంగ్ల సంవత్సరపు దినోత్సవాన్ని మరో నగరంలో డ్రైవ్‌స్పార్క్ బృందం టీవీఎస్ వీగో ద్వారా జరుపుకోనుంది. వాటి వివరాల కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు.

టీవీఎస్ వీగో ద్వారా కొచ్చిలో రెండు రోజుల క్రిస్మస్ పర్యటన వివరాలను వీడియో ద్వారా తెలుసుకోగలరు...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Thursday, December 29, 2016, 13:21 [IST]
English summary
Tvs Wego Cochin Christmas Ride Part Two
Please Wait while comments are loading...

Latest Photos