దీపావళి విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

డ్రైవ్‌స్పార్క్ టీవీఎస్ విగోతో దేశంలో ప్రధాన నగరాలను సందర్శిస్తోంది.అందులో భాగంగా దీపావళి పర్వదిన సంభరాలను పూనేలో జరుపుకుంది.

By Anil

గత దీపావళి వీగో పూనే రైడ్ పార్ట్-1 లో మా బృందం పూనేలోని పార్వతి హిల్‌ వరకు వచ్చిన రైడ్ గురించి తెలుసుకున్నాం. ఆ రోజు సాయంత్రానికి మా డ్రైవ్‌స్పార్క్ బృందం కొండ మీద నుండి విగో స్కూటర్లతో పూనే నగరాన్ని చేరుకున్నాం. సాయంత్రం కావడంతో పూనే నగర వాసులు దీప దూప కాంతులతో లక్ష్మీ దేవిని స్వాగతిస్తున్న కార్యక్రమాన్ని తలపించింది.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

రెండు రోజుల పాటు పూనే నగరవాసులతో మిలితైపోయామని చెప్పవచ్చు. అయితే మేము నివశించిన ప్రాంతానికి దగ్గర్లో మెహర్ ఆశ్రమం ఉంది. ఆ రోజు మా బృందం ఆ ఆశ్రమ వాసులతోనే దీపావళి వేడుకలను జరుపుకుంది. మెహర్ ఆశ్రమం నిరాశ్రులయిన మహిళలు, పిల్లలకు ఆశ్రయాన్ని కల్పిస్తోంది. పెద్ద సమాజంలో చిన్న #Wgo మూమెంట్.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

మెహర్ ఆశ్రమం గురించి: సిస్టర్ లక్కీ కురియన్ నిరాశ్రయుల కోసం వారిని సంరక్షించే భావనతో 1997 లో మెహర్ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆశ్రమాన్ని ప్రారంభించిన కొత్తలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అనేక పల్లెలకు, గ్రామాలకు, పట్టణాలకు తిరిగి తమ గుర్తింపును చాటుకుంది. ఈ ఆశ్రమానికి ఆ తరువాత కాలంలో నిరాశ్రయుల తాకిడి బాగా పెరిగింది.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

మెహర్ ఆశ్రమానికి విగో మీద రైడింగ్ వెళ్లే సమయంలో రెండు చోట్ల ఆగాము. రెండు కూడా పూనేలో మంచి పేరున్న ప్రాంతాలు. మొదట 1950 లో ప్రారంభించబడిన "చిటాలే బంధు మిఠాయివాలా". ఇక్కడ మహారాష్ట్ర యొక్క స్పైసీ కాండిమెంట్స్ లభిస్తాయి.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

రెండవ స్టాప్, ఎల్డెర్లీ పాల్ వల్లా (పండ్ల వ్యాపారి) మేము తీసుకెళ్లిన టీవీఎస్ వీగో స్కూటర్లకు ముందు భాగంలో ఉన్న ప్రదేశం పూర్తిగా నిపేలా పండ్లను కొనుగోలు చేశాం.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

ఆశ్రమంలోని పిల్లలకు పండ్లు మరియు తినుబండరాలను కొన్న తరువాత మెహర్ ఆశ్రమానికి చేరుకున్నాం. అయితే ఆ రెండు స్టాపుల నుండి లగేజితో ఆశ్రమానికి చేరుకునే సమయంలోని రైడింగ్ మంచి అనుభవాన్ని మిగిల్చింది. భారీ లగేజితో కూడా బాడీ మొత్తం మంచి బ్యాలెన్స్‌నిచ్చింది.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

మేము ఈ ఆశ్రమంలో ఎందుకు ఉన్నాము, మేమేవరు అనే ఆలోచన అస్సలు లేకుండా ఎంతో ఆనందంగా ఆశ్రమంలో ఉన్న పిల్లలు మాతో కలిసిపోయారు. మేము వారిని విజిట్ చేసిన సందర్భంలో మేమెవరో వారికి తెలియకపోయినా, మమ్మల్ని చూడటానికి ఎవరో వచ్చారు అనే సంతోషం వారు మోముల్లో కనిపించింది.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

మెహర్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న పిల్లలు చాలా తెలివైన వాళ్లు. మీరు ఒకే రంగులో వచ్చారు, అయితే వేరు వేరు రంగుల స్కూటర్లో వచ్చారెందుకు అంటూ మా మీదే 20 కి పైగా ప్రశ్నలు వేశారు. అయితే అమ్మాయిలను రెడ్ కలర్‌గా అబ్బాయిలను బ్లూ కలర్‌గా విభజించి మేము ఆడిన ఆటలో చివరికి అమ్మాయిలే గెలిచారు.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

మేము ఇంత వరకూ ఈ విగో మీద ఎన్నో నగరాల్లో ఎన్నో రైడింగ్స్ చేసాము. అయితే ఏనాడు విగో వేగం మీద దృష్టి పెట్టలేదు. అయితే ఆశ్రమంలోని చిన్నారులు మాకంటే ఎంతో వేగవంతమైన వారు. కేవలం కొన్ని నిమాషాల వ్యవధిలో వీగో స్కూటర్ మీద కూర్చుని తమ ప్రపంచంలో టెస్ట్ డ్రైవ్ కూడా చేసారు.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

ఒక్క ఫోటో చాలు 100 అర్థాలు వెతుక్కోవచ్చు. ఇక్కడున్న రేపటి పౌరున్ని చూడండి, భద్రత మీద దృష్టి పెట్టండి అంటున్నట్లు ఉన్నాడు కదా... నిజమే మీరు మీ విగోతో ప్రయాణిస్తున్నపుడు హెల్మెట్ తప్పకుండా ధరించండి. విగో మాత్రమే కాదు స్కూటర్ అండ్ బైక్ ఏదయినా సరే శిరస్త్రాణం మరువకండి.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

ఆ రోజంతా మెహర్ ఆశ్రమ చిన్నారులతో సరదాగా గడిపాము. చివరికి మా ఆటలకు బ్రేక్ వేస్తూ సూర్యుడు పడమరకు వాలిపోయి, మమ్మల్ని ఇక బయల్దేరమన్నాడు. అయితే సూర్యాస్తమయంలో పూనేలో జరిగే దీపోత్సవం గురించి విన్నాం.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

మానవ జీవితం గురించి ఆలోచించడానికి మెహ్రన్ ఆశ్రమం మాకు ఎన్నో ఇచ్చింది. నిద్రపోవాల్సిన సమయానికి తిన్నది నేమరేసుకున్నట్లు పిల్లలతో జరిగిన సందడి మరో మారు కళ్ల ముందు కదలాడింది. అప్పటికే శరీరం నిద్రకు ఉపక్రమిస్తోంది. అయితే పూనేలో బ్యాలెన్స్ ఉన్న సందర్శనలను గురించి ఆరా తీస్తే సరస్ బాగ్ దీపోత్సవం... అంతే విగో మీద ఆ ప్రదేశానికి పయణమయ్యాం.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

రకరకాల కాంతులతో చీకటిని చీల్చుకుంటూ నింగికేగుతున్న స్కై లాంతర్లు మాకు స్వాగతం పలికాయి.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

మేము అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికి పూనే నగరంలోని పండుగ వాతావరణాన్ని విశ్వానికి చాటిచెప్పడానికన్నట్లు స్కై లాంతర్లు ఒకదాన్ని మించి ఒకటి గగనాన్ని చేరిపోయాయి. పూనే నగరంలో జరిగిన రెండు రోజుల పండుగ ఒక ఎత్తయితే, చివరి రోజు జరిగిన దీపోత్సవం మరో ఎత్తు. అన్ని సందడులు బ్యాలెన్సింగ్‌గానే ఉన్నాయనిపించింది. దానిని మేము విగోలో గుర్తించాము.

విద్యుద్దీప కాంతుల్లో టీవీఎస్ వీగో పూనే రైడ్

ఇవాళ్టి స్టోరీతో దీపావళి పూనే టీవీఎస్ విగో అడ్వెంచర్ రైడింగ్ చివరి దశకు చేరుకుంది. మా జాబితాలోని #WegoKolkata మరియు #WegoPune అడ్వెంచర్ రైడింగ్ అనంతరం డ్రైవ్‌స్పార్క్ పాఠకులకు క్రిస్‌మస్ పండుగ ద్వారా టీవీఎస్ వీగో కొచ్చిన నగర రైడింగ్ విశేషాలను కథనం రూపంలో ప్రచురించనుంది. #WegoCochin కోసం మాతో కలిసి ఉండండి.

టీవీఎస్ వీగో గత కథనాలు

టీవీఎస్ వీగో గత కథనాలు

  • దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్
  • పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు: మీరు చూడనివి..!
  • దుర్గా పూజ, కలకత్తా నగర విశేషాలను వివరించే టీవీఎస్ విగో రైడ్

Most Read Articles

English summary
Lights And Unbridled Joy As #WeGo Light Up A Few Lives This Diwali In Pune
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X