టీవీఎస్ విగో రైడింగ్ ద్వారా కలకత్తా లోని దుర్గా పూజ వేడుకలు, మరియు నగర ఆసక్తికర విశేషాలు

By Anil

జీవితంలో ప్రతి ఒక్క సవాలు ఎదుర్కోవాలి, సవాలు లేని జీవితం ఎప్పటికీ మారదు - అందుకే డ్రైవ్‌స్పార్క్ బృందం ఒక స్కూటర్ ద్వారా భారత దేశపు ప్రఖ్యాత నగరాలను చుట్టేస్తూ, వాటి విశేషాలను పాఠకులతో పంచుకునే చాలెంజ్‌ను ఎంచుకుంది.

2016 కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో టీవీఎస్ విగో

భారతీయ నగరాలలో స్కూటర్ మీద ప్రయాణం అనేది కత్తి మీద సాము లాంటిది. చీమలు దూరని చిట్టడవి కాకులు దూరని కారడవి అనే సామెతకు భారతీయ నగరాలు మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు. అలాంటి నగరాల్లోని భయంకరమైన ట్రాఫిక్‌లో స్కూటర్ ప్రయాణం ఎంతో విసుగుతో కూడుకున్నది. ఆఫీస్ వర్క్, స్నేహితులను కలవడం వంటివి ఫీట్లతో కూడుకున్న పనులు అనవచ్చు.

అందుకోసం అనేక ఫీచర్లతో స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో టీవీఎస్ విగో ఒకటి. టీవీఎస్ విగో ద్వారా భారత మహా నగరాలను పర్యటించి పండుగ సీజన్ మరియు విగో పనితనం గురించి వివరించబోతోంది డ్రైవ్‌స్పార్క్ బృందం.

2016 కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో టీవీఎస్ విగో

టీవీఎస్ విగో స్కూటర్‌ను పూర్తిగా యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఆఫీస్‌లకు వెళ్లే యువ ఉద్యోగులకు ఇది ఎంతో అచ్చంగా సరిపోతుంది. విభిన్న రంగుల్లో నూతన డిజైన్ శైలిలో ఉన్న బాడీ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. - యువత కోసం ఇండియాలో ఉన్న ఏకైక స్కూటర్ అని చెప్పవచ్చు.

కలకత్తాలోని దుర్గా పూజ వేడుకల్లో పాల్గొన్న టీవీఎస్ విగో విశేషాలు

విజయ దశమి సందర్భంగా డ్రైవ్‌స్పార్క్ బృందం కలకత్తాలో జరగే దుర్గా పూజ వేడుకలను తిలకించడానికి టీవీఎస్ విగోను ఎంచుకుంది. కలకత్తా విశేషాలను, దుర్గా పూజ వేడుకలను ప్రత్యేకంగా సందర్శించేందుకు విగోను ఎంచుకున్నారు.

2016 పండుగ సంబరాలకు కలకత్తానే ఎందుకు

2016 పండుగ సంబరాలకు కలకత్తానే ఎందుకు

కలకత్తా, కాలికోట్ లేదా కోలకత్తా ఎలా పిలిచినా ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రాజధాని నగరం.కాలికోట్ అనేది బెంగాలీ పదం, బ్రిటీష్ వారి మొదటి సారిగా ఇండియాకు వచ్చినపుడు వీరి ప్రవేశించిన మూడు గ్రామాలలో మొదటిది కాలికోట్. అప్పటి నుండి ఆ ప్రదేశం అభివృద్ది చెందుతూ కలకత్తాగా రూపాంతరం చెందింది. మిగిలిన రెండు గ్రామాలు సుతానుటి మరియు గోవిందపూర్.

అందమైన కాలనీలతో నిండి ఉన్న కలకత్తా నగరాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అభివృద్ది చేసారు. భారత దేశానికి నూతన రాజధాని "ఢిల్లీ" నగరాన్ని ఎంచుకునే వరకు "కలకత్తా" భారతదేశ రాజధానిగా ఉండేది.

2016 కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో టీవీఎస్ విగో

అన్నింటికంటే ముందుగా కలకత్తా అంటే భారత దేశపు "సాంస్కృతిక రాజధాని" అని పేరు, "అద్బుతమైన భవన నిర్మాణం" గల నగరానికి ప్రతీక మరియు అత్యంత సంతోషంగా పండుగ వేడుకలు జరుపుకునే నగరంగా చెప్పుకోవచ్చు. ఇలా ఈ కలకత్తా ఎంతో చరిత్రను కలిగి ఉంది.

మహా ట్రాఫిక్‌తో నిండి ఉండే ఈ వీధుల వెంబడి టీవీఎస్ విగో స్కూటర్ ద్వారా దుర్గా పూజ సంబరాలను మరియు నగర విశేషాలను తెలుసుకోవడానికి సిద్దం అయ్యారు మా బృందంలోని ఇద్దరు వ్యక్తులు. వీరి ఆలోచన ఫలిచిందా ? లేదా ? ఎలాంటి అనుభవం మిగిలింది అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం ...

2016 కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో టీవీఎస్ విగో

ఆసియాలో యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోషియేషన్ (YMCA) వారి అత్యంత పురాతణమైన భవనం ఇది. దీనిని 1857 లో నిర్మించారు. ఇది మాత్రమే కాదు 1800 సంవత్సరం కాలంలో నిర్మితమైన అనేక భవనాలు కలకత్తా వీధుల్లో దర్శనమిస్తాయి. సుమారుగా 100 సంవత్సరాల వయస్సున్న భవనాలకు కొదవేలేదు అని చెప్పవచ్చు.

2016 కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో టీవీఎస్ విగో

ఆరోగ్యవంతమైన జీవనానికి వ్యాయామం ఎంతో అవసరం. ప్రదేశం మారినా అలవాట్లు మార్చుకోలేరు కదా అందుకే మా బృందంలోని ఒక సభ్యుడు ఉదయాన్నే విగో రైడింగ్‌కు వెళ్లే ముందు ఇలా వ్యాయామాన్ని పూర్తి చేసాడు. యంగ్ మెన్స్ క్రిస్టియన్ ఆసోయేషన్ వారి ఆధ్వర్యంలో వేగంగా టిఫన్ చేసి ప్రయాణాన్ని ప్రారభించారు.

2016 కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో టీవీఎస్ విగో

భారతీ సాంస్కృతికకు నిదర్శనంగా చెప్పుకునే కలకత్తా నగరంలో ఇలాంటి రోడ్లకు కొదవేలేదు. కలకత్తా సందర్శనకు వచ్చే ముందు ఇలాంటి రహదారుల గురించి అస్సలు ఊహించలేదు. గుంతలమయమైన రోడ్లలో, నీటితో నిండిన గుంటలతో మొదట్లో కాస్త భయపడ్డాము. అయితే మేము ఎంచుకునే టీవీఎస్ విగోలోని ఎలక్ట్రిక్ స్టార్ట్, వేగంగా వినియోగించగలిగే కిక్ స్టార్ట్ రెండు ఎంతో ఉపయోగపడ్డాయి.

2016 కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో టీవీఎస్ విగో

తొలి 20 నిమిషాల తరువాత ఎక్కువగా స్కూటర్‌ను అపవలసి వచ్చింది. ప్రతి సారి గూగుల్ మ్యాప్స్ చెక్ చేయడం మరియు అక్కడ ప్రాంతీయ ప్రజల చేత దారులు వెతుక్కుని ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ప్రఖ్యాత దుర్గా మాత ప్రతిమలను సందర్శించడం జరిగింది.

దక్షిణ కలకత్తాలోని ప్రతిమలు

  1. ఎక్డాలియా ఎవర్ గ్రీన్ - గరియహత్
  2. సింఘి పార్క్ - గరియహత్
  3. బల్లీగంగి కల్చరల్ అసోసియేషన్ - లేక్ రోడ్
  4. మ్యాడోక్స్ స్క్వయర్ - రిట్చీ రోడ్
  5. సురుచి సంఘా - అలిపూర్
  6. చెట్లా అగ్రగామి - చెట్లా
  7. దేశప్రియ పార్క్ - రాష్‌బెహారి అవెన్యూ
  8. బెహల నాటన్ డాల్ - బెహల
  9. ష్రిస్తి - బెహల
  10. సహజాత్రి - బెహల
మధ్య కలకత్తా లోని ప్రతిమలు

  1. ఎమ్‌డి. అలి పార్క్ - సెంట్రల్ పార్క్
  2. కాలేజ్ స్వయర్ - కాలేజ్ స్ట్రీట్
  3. లెబుటోలా పార్క్ - సంతోష్ మిత్రా స్క్వయర్
  4. పార్క్ సర్కస్ మైదాన్ - పార్క్ సర్కస్ 7 పాయింట్ క్రాసింగ్
  5. చాల్తబగన్ - మనిక్తలా లోహపట్టి
ఉత్తర కలకత్తా లోని ప్రతిమలు

  1. కుమార్తిలు పార్క్ - కుమార్తులి
  2. కాశి బోస్ లేన్ - కాశి బోస్ లేన్
  3. అదిబాషి బ్రిందా - లేక్ టౌన్
  4. శ్రీభూమి - లేక్ టౌన్
  5. తరుణ్ సంఘా - డమ్ డమ్ పార్క్
  6. బాఘ్ పజార్ సర్బజోనిన్ - బాఘ్ బజార్ పార్క్
తూర్పు కలకత్తా

  1. ఎఫ్‌డి బ్లాక్ - సాల్ట్ లేక్

2016 కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో టీవీఎస్ విగో

పైన తెలిపిన అన్ని ప్రదేశాలకు వెళ్లి వచ్చేంత వరకు మీ స్మార్ట్‌ ఫోన్‌లో చార్జింగ్ ఉంటుందా ? నిరంతరం వీడియోలు మరియు ఫోటోలు తీసుకుంటూ, మధ్య మధ్యలో ఫోన్ మాట్లాడటం వలన మా స్మార్ట్‌ ఫోన్‌లలో చార్జింగ్ అయిపోయింది. ఈ మద్యనే నేను ఎంచుకున్న జియో సిమ్ ద్వారా ఉచిత 4జి డాటాను ఉపయోగించడంతో మరింత వేగంగా చార్జింగ్ అయిపోయింది. అప్పుడు టీవీఎస్ విగోలోని వేగవంతమైన చార్జింగ్ పోర్ట్ ద్వారా నా మొబైల్ చార్జ్ చేసుకున్నాను.

2016 కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో టీవీఎస్ విగో

విగో కలకత్తా పర్యటన మేము ముందుగా ఊహించిన దానికన్నా ఎంతో కష్టంతో కూడుకున్నది. వన్ వే రోడ్లు, విపరీతమైన ట్రాఫిక్, సరైన రోడ్ మ్యాప్ వివరాలు లేక విలవిల్లాడిపోయాం. అలా మొదటి సగం రోజు గడిచింది. అయితే మలి సగం రోజు అనేక ప్రాంతాల మీదుగా దుర్గా దేవి ప్రతిమలను టీవీఎస్ విగో ద్వారా సందర్శించాము. ఎంతో మంది పాదచారుల నడుమ అద్బుమైన పికప్ మరియు సౌకర్యవంతమైన రైడింగ్ ఫీచర్‌తో విగో మా జర్నీని ఎంతో సులభతరం చేసింది.

2016 కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో టీవీఎస్ విగో

మొదటి రోజు పర్యనటలో మాకు బాగా తెలిసిన విషయం ఏమిటంటే. దుర్గా పూజ కారణంగా నెమ్మదిగా వెళ్లే పసుపు రంగు ట్యాక్సీలు, విపరీతమైన రద్దీతో ఉండే సిటి బస్సుల కన్నా మేము ఎంచుకున్న టీవీఎస్ విగో ప్రయాణం ఎంతో ఉపయోగపడింది. శక్తివంతమైన విగో ద్వారా కలకత్తా నగరవ్యాప్తంగా ఉన్న దుర్గా మాత ప్రతిమలను సందర్శించగలిగాం.

2016 కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో టీవీఎస్ విగో

అత్యంత శక్తివంతమైన బెంగాలీ ప్రజలకు ఇలాంటి ప్రయాణాలు బాగా అలవాటైపోయినట్లుంది. కలకత్తా నగరంలో అంగరంగ వైభవంగా జరిగే దుర్గా పూజ వేడుకలు జరుపుకోవడానికి కలకత్తా ప్రజలు ఇలాంటి ప్రయాణం ఖచ్చింతంగా చేయాల్సిందేనా అని నా వంతు ఆశ్చర్యపోయా. అయితే మా వద్ద టీవీఎస్ విగో ఉండటం వలన మా మొదటి రోజు పర్యటన ఎంతో సులభంగా, సుఖంగా మరియు సౌకర్యవంతంగా ముగిసిపోయింది.

2016 కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో టీవీఎస్ విగో

ఈ కాలంలో ప్రయాణం సమయం మరియు ప్రయాణ ఖర్చు ఎంతో ముఖ్యమైన అంశం. కలకత్తా నగరంలోని ప్రతి దుర్గా మాత ప్రతిమను తిలకించడానికి సుమారుగా 20 కిలోమీటర్ల మేర టీవీఎస్ విగో మీద ప్రయాణించాం. ట్యాక్సీలో ప్రయాణించి ఉంటే 800 రుపాయలు ఖర్చయ్యేది. అయితే కేవలం 25 రుపాయల విలువైన పెట్రోల్‌తో విగో మీద దుర్గా మాత ప్రతిమల సందర్శన పూర్తి చేశాం. సమయం కూడా ఆదా అయ్యింది.

2016 కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో టీవీఎస్ విగో

కలకత్తా గురించి పెద్దగా తెలియకపోవడం వలన కలకత్తా పర్యటన పూర్తిగా తారుమారయ్యింది. అయితే టీవీఎస్ విగో ద్వారా మేము అనుకున్న దానికన్నా ఎక్కువే ప్రయాణించాం, అనేక విషయాలు తెలుసుకున్నాం, అందమైన ఫోటోలు తీసుకున్నాం. విగో మీద రైడింగ్‌లో ఉన్నపుడే అనేక అద్బుతమైన వీడియోలు మరియు ఫోటోలు చిత్రీకరించాం.

విగో యొక్క అద్బుతమైన పనితనం యొక్క శైలి మరియు తేజస్సు మా ప్రయాణాన్ని రంగులమయం చేస్తూ మా జర్నీని సంతోషంగా పూర్తి చేయడంలో మాకు ఎంతగానో సహకరించింది. ఇలా కలకత్తా మొదటి రోజు పర్యటన పూర్తి చేశాం.

కలకత్తాలోని దుర్గా పూజ వేడుకల్లో పాల్గొన్న టీవీఎస్ విగో విశేషాలు

దుర్గా పూజ సందర్బంగా పిల్లలు నిశ్శబ్దంగా దుర్గా మాత ప్రార్థనలో ఉన్నపుడు విగో మీదుగా తీసిన చిత్రం. భారతీ సాంస్కృతిని ప్రతిబించే ఈ చిత్రం ప్రపంచ దేశాలు ఇండయా యొక్క సాంప్రదాయం గురించి ఆలోచింపజేసేలా ఉంది.

కలకత్తాలోని దుర్గా పూజ వేడుకల్లో పాల్గొన్న టీవీఎస్ విగో విశేషాలు

కలకత్తాలోని షింఘీ పార్క్ వద్ద కొలుదీరిన దుర్గా మాత

కలకత్తాలోని దుర్గా పూజ వేడుకల్లో పాల్గొన్న టీవీఎస్ విగో విశేషాలు

కలకత్తాలోని బల్లిగంగీలో దుర్గా మాత రాక్షసుడి వధ చేస్తున్న ఎక్డాలియా ప్రతిమ.

కలకత్తాలోని దుర్గా పూజ వేడుకల్లో పాల్గొన్న టీవీఎస్ విగో విశేషాలు

నీలిరంగు కాంతిలో దుర్గామాత ప్రతిమ

కలకత్తాలోని దుర్గా పూజ వేడుకల్లో పాల్గొన్న టీవీఎస్ విగో విశేషాలు

విజయం దశమి సందర్బంగా డ్రైవ్‌స్పార్క్ బృందం టీవీఎస్ విగో ద్వారా కలకత్తా పర్యటన చేసింది. ఇంత వరకు పార్ట్ - 1 విశేషాలు తెలుసుకున్నారు. రాత్రి వేళ దుర్గా పూజ సంబరాల విశేషాలను తెలిపే మరో ప్రత్యేక కథనం, పార్ట్ - 2 కోసం మాతో కలిసి ఉండండి.

Most Read Articles

English summary
Read In Telugu: Here #WeGo Exploring The Charms And Delights Of Kolkata On #Durga Puja — Part 1
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X