పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాల క్షణాలు ! మీరు చూడటానికి సాధ్యపడనివి

డ్రైవ్‌స్పార్క్ టీవీఎస్ విగోతో దేశంలో ప్రధాన నగరాలను సందర్శిస్తోంది. అందులో కలకత్తాలో దుర్గా పూజ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటోంది.

By Anil

మా మొదటి వ్యాసం ప్రకారం, కలకత్తా నగర విశేషాలు, దుర్గా పూజ వేడుకలను మరియు అక్కడ సాంస్కృతిక సాంప్రదాయాలతో పాటు డ్రైవ్‌స్పార్క్‌తో పాటుగా వెళ్లిన టీవీఎస్ విగో గురించి అనేక విషయాలను తెలుసుకున్నాం.

దుర్గా పూజ వేడుకల్లో మేము గమనించాల్సింది, సందర్శించాల్సిన అనేక ప్రధాన ప్రతిమలు మరియు విద్యుత్‌దీపాలంకరణలో ఉన్న వీధులను చూడలేదని మా మొదటి వ్యాసం చదివిన తరువాత అక్కడ స్థానికులు తెలిపారు. వారి సూచనల మేరకు డ్రైవ్‌స్పార్క్ బృందం వేగవంతమైన టీవీఎస్ విగోతో చేసిన మరో ప్రయాణం...

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

మనం జీవితంలో ఏ స్థానంలో ఉన్నా, మనకు రెండవ అవకాశం దొరికింది అంటే అది మరుసటి రోజు అని చెప్పవచ్చు. మాకు కూడా కలకత్తా దుర్గా పూజ వేడుకల్లో రెండవ రోజు సందర్శించే అవకాశం దొరికింది.

మరిన్ని ప్రతిమల సందర్శన, విగో మీద మా సుఖవంతమైన రైడింగ్ మరియు కలకత్తా అనుభవాలన్నింటి గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఈ కథనంలో అందిస్తోంది.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

విభిన్నరంగుల్లో కాంతులీనుతున్న వీధుల్లో మా ప్రయాణం ప్రారంభం అయ్యింది. అయితే బెంగాలీలు చిన్న పాటి రహదారుల్ని మొత్తం నీటితో తడి చేశారు. అయితే విగోకు ఉన్న అత్యంత పటిష్టమైన చక్రాల ద్వారా ఏ మాత్రం ప్రమాదానికి గురికాకుండా ఎంతో సంతోషంగా రెండవ రోజు రాత్రిని కలకత్తా వీధుల్లో కలియతిరుగుతూ గడిపేసాము.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

చిన్న చిన్న వీధుల్లో ప్రయాణ ప్రారభించాక, ముందు మేము సందర్శించని రామ్ మందిరం వద్ద ఉన్న ఛొరెభాగన్ సర్బోజినిన్, దుర్గా మాత ప్రతిమను దర్శించుకున్నాము. విగోతో పాటు అక్కడ ఉన్న రంగులన్నీ తమంతటతాముగా మాట్లాడుకుంటున్నాయి.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

సుమారుగా 30 నిమిషాల పాటు చిత్రాలు తీసుకున్న తరువాత మా ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాము. అత్యంత రద్దీతో కూడిన ట్రాఫిక్‌లో ఇరుకైన వీధుల వెంబడి రంగురంగుల కాంతుల నీడలో మా ప్రయాణం కొనసాగింది.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

కలకత్తాలో ఎంతటి ఇరుకైన వీధులున్నప్పటకీ, వారికి ఎంతో ప్రత్యేకమైన దుర్గా మాత ప్రతిమలను కొలువుదీర్చడంలో ఏ మాత్రం విఫలం కాలేదు బెంగాలీలు. ప్రతి వీధికి తగిన రీతిలో దుర్గా మాత అలంకరణలు జరిగాయి. అందులో మాతో పాటు వచ్చిన టీవీఎస్ విగో ఎంత బాగా ఇమిడిపోయిందో చూడండి.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

ప్రతి ఒక్కరి జీవితంలో బాగా కలిసొచ్చే రంగు ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అందుకే కాబోలు సప్తవర్ణాలంకారణంలో దుర్గా పూజ ప్రతిమలు కొలువు దీర్చి వాటికి విద్యుత్‌దీపాలంకరణ చేస్తారు.

మనందరికీ తెలిసిందే ఒక్కరికి ఒక్కో రంగు విపరీతమైన ఇష్టం ఉంటుంది, అందుకోసం కార్లు, బైకులు, స్కూటర్లు వినియోగదారులను ఆకట్టుకోవడానికి రకరకాల రంగుల్లో రూపొందిస్తుంటారు. టీవీఎస్ విగో అత్యంత ఆకర్షణీయమైన రంగుల్లో ఉంది. ఇక్కడ ఉన్న విగో రంగు వొల్కానొ రెడ్.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

డాజ్లింగ్ బ్లూ అనే రంగులో కూడా విగో అందుబాటులో ఉంది. మా గురించి చెప్పాలంటే అత్యంత నీలాకాశంలో ఉన్న రంగు అంటే మాకు ఎంతో ఇష్టం అనాలి. ఎందుకంటే ఎలాంటి వెలుతురులోనైనా ఈ నీలి రంగు విగో అత్యంత ఆకర్షణీయంగా వెలిగిపోతుంటుంది.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

కలకత్తా వీధులన్నింటిని జల్లెడ పట్టి మరీ దుర్గా పూజ సంబరాలు జరుపుకున్న మాకు చివరికి అర్థ రాత్రి మాత్రమే మిగిలింది. మా బృందం మినహా కలకత్తా మొత్తం నిద్రపోయింది. అందుకు ఒక ఉదాహరణ ఈ చిత్రం.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

బెంగాలీలు పరిపూర్ణ భక్తితో దుర్గా మాత సంబరాలను జరుపుకున్నారు. ఈ సంభరాల్లో మనకు మనమే ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది. నిజమే, ఎందుకంటే కులమాతలకు అతీతంగా అన్ని భాషలు వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు మరియు అన్ని అన్ని ప్రాంతాల వారు సామరస్యంగా అమ్మవారి సంభరాలను జరుపుకున్నారు.

కలకత్తాలో జరిగిన దుర్గా పూజ వేడుకలు కార్నివాల్‌కు ఏ మాత్రం తీసిపోవు.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

కలక్తతాలోని ఓ ప్రముఖ దుర్గా ప్రతిమ: దుర్గా మాత మహిషాసురుని అంతం చేసే ఘట్టం.

ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత, బెంగాలీలు మరియు యావత్ హిందువులు దీని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే కలకత్తాలోని పర్తక్ మందిరాన్ని సందర్శించాల్సిందే.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

కలకత్తా నగరాన్ని చుట్టేసిన తరువాత అలసిన మా బృందం ఓ పానీ పూరి బండి వద్ద, పానీ పూరీల మీద తమకు ఎంత మక్కువ ఉందో ఇలా ప్రదర్శించారు. కాస్త పులుపు, కారం రుచులతో ఉన్న పానీ పూరీని అదే చివరి భోజనంగా లాగించేశారు.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

ప్రతి చికటి రాత్రి తరువాత, ప్రకాశవంతమైన రోజు ఉంటుందనే ఎంత సత్యమో... ప్రతి కష్టం వెనుక విజయం ఉంటుందనేది కూడా అంతే సత్యం. కలకత్తాలోని దుర్గా పూజ వేడుకలు రాత్రి పగలూ తేడా లేకుండా జరుగుతూనే ఉన్నాయి. ఉదయాన్నే ఓ మండపం వద్ద నెలకొన్న సందడి గుర్తించవచ్చు.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

మరుసటి రోజు సందర్శన కూడా చాలా యాధృచ్చికంగా జరిగిపోయింది. ముందుగా ఏ విధమైన ప్రణాళికలు లేకుండా మేము ప్రారంభించిన ప్రయాణం మాకు గొప్ప అనుభవాన్ని మిగిల్చింది. ఎన్ని ప్రతి కూల సంఘటనలు చోటు చేసుకున్నా మిగతా అన్నింటిని కేవలం స్కూటర్ మీద మాత్రమే ఆనందించడానికి వీలుటుంది.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

రద్దీ వీధుల్లో తక్కువ ఖర్చుతో రైడింగ్ చేసే అవకాశం టీవీఎస్ విగో ద్వారా మాకు దక్కింది. 5-లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకు ఇందులో కలదు. ట్యాంకును పూర్తిగా నింపితే సుమారుగా 250 కిలోమీటర్లుకు పైగా ప్రయాణించవచ్చు.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

నమ్మకమైన టీవీఎస్ విగోకు ధన్యవాదాలు, దుర్గా పూజ సంభరాలను ఫోటోల్లో బంధించడానికి విగో ఎంతగానో సహకరించింది.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

గగనం నుండి ప్రతిమలకు రంగులద్దుతున్న చందంగా ఉన్న మండపం

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

నదిలో దుర్గా మాత విగ్రహం నిమజ్జానికి ముందు భక్తులు చేస్తున్న నాట్యం.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

భక్తులు దుర్గా మాతను నీటిలో నిమజ్జం చేస్తున్న దృశ్యం.

పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాలు

నిర్మలమైన మనస్సుతో శాంతి యుతంగా దర్శనం ఇస్తున్న దుర్గా మాత.

కలకత్తా దుర్గా పూజ వేడుకలను సందర్శించాలనుకునే ప్రయాణికులకు గమనిక

కలకత్తా దుర్గా పూజ వేడుకలను సందర్శించాలనుకునే ప్రయాణికులకు గమనిక

కలకత్తాలోని అన్ని వీధులు అత్యంత రద్దీతో ఉంటాయి, దుర్గా మాత ప్రతిమలు కొన్ని కిలోమీటర్ల మేర ఉంటాయి. ఇక అందులో మీరు నడుచుకుంటూ వెళ్లడానికి ఇష్టపడితే దుర్గా పూజ సంబరాలను మరియు కలకత్తా నగర విశేషాలను మాతో పంచుకోండి.

త్వరలో టీవీఎస్ విగో దీపావళి వేడుకలను పూనే మహానగరంలో జరుపుకోనుంది. మరిన్ని కథనాలకు మాతో కలిసి ఉండండి.

కలకత్తా దుర్గా పూజ వేడుకలను టీవీఎస్ విగోతో సెలబ్రేట్ చేసుకున్న డ్రైవ్‌స్పార్క్‌ బృందం - వీడియో ద్వారా దుర్గా పూజ విశేషాలు...

Most Read Articles

English summary
Day-Night Transition With TVS #Wego On #DurgaPuja In Kolkata — Part 2
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X