దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

డ్రైవ్‌స్పార్క్ బృందం టీవీఎస్ విగోతో దేశంలో ప్రధాన నగరాలను ప్రత్యేక పండుగల సందర్భంగా సందర్శిస్తోంది.అందులో భాగంగా దీపావళి పర్వదిన సంభరాలను పూనేలో జరుపుకుంది.

By Anil

కలకత్తా నగరంలో దసరా మహోత్సవం సందర్భంగా దుర్గా పూజ వేడుకలను డ్రైవ్‌స్పార్క్ బృందం టీవీఎస్ విగోతో జరుపుకుంది. కలకత్తా లో దుర్గా పూజ వేడుకల్లో మొదటి మరియు రెండవ రోజు పర్యటనలో టీవీఎస్ వీగో రైడ్ మంచి అనుభవాన్ని మిగిల్చింది.

ఛాలెంజ్‌లో భాగంగా డ్రైవ్‌స్పార్క్ బృందం టీవీఎస్ వీగో తో పూనే నగరంలో దీపావళి సంబరాలను జరుపుకుంది. కలకత్తా తరువాత జాబితాలో ఉన్న రెండవ భారతీయ నగరం, మహారాష్ట్ర రాజధాని నగరంలో పూనే. కాబట్టి Here #Wegopune (పూనేలో దీపావళి వేడుకలు జరుపున్నాము).

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

పూనేలో అంగరంగ వైభంగా జరిగే దీపావళి పర్వదినాన టీవీఎస్ విగో రైడ్ కాస్త నా బాల్యాన్ని గుర్తు చేసింది. చిన్న తనంలో దీపావళి అంటే మరో ఆలోచనే లేకుండా రోజంతా టపాసులను పేల్చడమే. ఏ మాత్రం భయం లేకుండా భారీ శబ్దాన్ని ఇచ్చే టపాసులను పేల్చడం, మా నాన్న గారు చేతక్ బైకులో స్వీట్లు, టపాసులు తీసుకు రావడం, అదే చేతక్ మీద బందు మిత్రులకు స్వీట్లు పంచడం వంటి ఎన్నో అనుభూతులని గుర్తుచేసింది.

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

అమ్మ నాన్నలతో, బంధువులతో, స్నేహితులతో ఎంచక్కా సాయం కాలం నుండి బాగా చీకటి పడే వరకు ఆనందంగా టపాసులను కాల్చిన కాలం కల్ల ముందే కదలాడుతూ ఉంది, నేను అలాగే ముందుకు వెళ్లాలనుకున్నా కాని కదల్లేకపోయా. ఎందుకంటే అవి జ్ఞాపకాలు మాత్రమే. అప్పట్లో దీపావళి అంటే మానవ జాతిలో కుల, మత, వర్గ, బేధాలు లేకుండా సంభరాలను అంబరాన్ని తాకించేవాళ్లం. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా...? అయితే క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి.

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

అప్పటి దీపావళితో పోల్చుకుంటే ఇప్పటి దీపావళి సంభరాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. దీపావళి అంటే కేవలం టపాసులను కాల్చడమే అనే ధోరణిలోకి వచ్చేశారు జనాలు. అయితే అప్పట్లో మా నాన్న గారు ఉపయోగించిన స్కూటర్‌తో ఇపుడు మేము వినియోగిస్తున్న టీవీఎస్ విగోతో పోల్చితే చాలా మార్పులు జరిగాయి. అస్సలు ఊహించని రీతిలో స్కూటర్ల అభివృద్ది జరిగింది. మా నాన్న గారు ఇప్పుడు తన పాత స్కూటర్ స్థానంలోకి ఈ అత్యాధునికి టీవీఎస్ విగోని స్వాగతించారు.

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, సీట్ క్రింద స్టోరేజ్, ప్రకాశవంతమైన హెడ్ లైట్, ట్యూబ్ లెస్ టైర్లు, మరియు వాలు తలం మీద భద్రత కోసం పార్కింగ్ బ్రేక్ అసిస్ట్ కలదు. అప్పట్లో వాలు తలంలో స్కూటర్‌ని నిలబెట్టాలంటే సెంటర్ స్టాండ్ వేసేవారు, దాని ద్వారా ముందుకు వెనక్కి స్కూటర్ డ్యాన్సింగ్ చేసేది. అయితే ఇప్పుడు అధునాతన ప్రధాన భాగాలతో పార్కింగ్ బ్రేక్ అసిస్ట్ ఫీచర్‌ను కూడా అందించారు.

మరి డ్రైవ్‌స్పార్క్ బృందం ఛాలెంజ్‌లో పూనే నగరమే ఎందుకు...? ప్రత్యేకించి దీపావళికి ఎందుకు ?

మరి డ్రైవ్‌స్పార్క్ బృందం ఛాలెంజ్‌లో పూనే నగరమే ఎందుకు...? ప్రత్యేకించి దీపావళికి ఎందుకు ?

మేము ఎంచుకున్న భారతీయ నగరాలలో పూనే మొదటి స్థానంలో ఉంది. సువిశాలమైన పూనే నగరం ఎంతో చరిత్రను కలిగి ఉంది. మరియు ఎన్నో ఏళ్ల క్రితం నగరంగా ఏర్పడింది ఈ పూనే.

పెత్ అనే ప్రాంతం ఐదవ శతాబ్దంలో నిర్మించబడింది, మీరు ఖచ్చితంగా నమ్మితీరాల్సిందే. సంస్కృతం యొక్క పున్య నగరి అనే పేరు మీద ఈ నగరానికి పూనే అనే పేరు వచ్చింది. దీనిని సుగుణాల నగరం అని కూడా అంటారు. పూనే నగర వీధుల్లో సుగుణాల టీవీఎస్ విగో సంభరాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుకు పదండి...

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

దక్షిణ భారత దేశంలో అత్యంత చల్లటి వాతావరణాన్ని కలిగి ఉన్న బెంగళూరు తరహాలోనే పూనే వాతావరణం ఉంది. ప్రశాంతమైన వాతావరణం గల నగరంలో ఏ మూల చూసిన దీపావళి సందర్భంగా అమ్మకాలకు సిద్దంగా ఉన్న లక్ష్మీ దేవి ప్రతిమలు కనువిందు చేశాయి. భారత దేశం సాంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని చాటేలా పూనేలోని ప్రతి వీధిలోని అమ్మవారి ప్రతిమలు దర్శనిమిచ్చాయి.

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

దీపావళి పండుగలో దీపాలంకరణ ఎందుకు చేస్తారో తెలుసా ? పురాణాల ప్రకారం సీతమ్మ మరియు రాముల వారు అరణ్య వాసం పూర్తి చేసుకుని అయోధ్యను చేరుకున్నందుకు ప్రతీకగా దీపాలంకరణ చేస్తారు. ఇది మేము నమ్మినది కాదు, ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 800 మిలియన్ల ప్రజలు నమ్మకంగా ఈ దీపాలంకరణ చేస్తున్నారు.

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

టీవీఎస్ వీగో మీద దీపావళి సంబరాలకు సిద్దమైన మేము ఒక పోటో తీసుకోవడానికి ప్రయత్నించాం. అయితే సూర్యుడు గుర్రుగా ఉండటంతో మా ప్రయత్నం ఫలించలేదు. అయితే పూనేలోని పాత పెత్ నగరంలో ఉన్న ప్రఖ్యాత కస్పా గణపతి దేవాలయం యొక్క గోపురం ముందు ఇలా కానిచ్చేశాం. ఈ ప్రాంతాన్ని పూనే నగరం యొక్క గుండె అని చెప్పవచ్చు.

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

కస్పా గణపతి ఆలయంలో పూజ అనతరం మా టీవీఎస్ విగో పూనే రైడింగ్ ప్రారంభించాం. హైదరాబాద్‌లో కోఠి షాపింగ్‌కు ఎంత క్రేజ్ ఉందో, పూనేలో కూడా షాపింగ్‌కు అంతే క్రేజ్ ఉంది. సరదాగా రిటైల్ దుకాణాల వద్ద షాపింగ్ చేస్తే మీ యాంత్రిక జీవనంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి #Wego మీద వెళ్లినపుడు షాపింగ్ కూడా చేసాం.

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

దీపావళి షాపింగ్‌ కోసం మేము ముందుగా అనుకున్న లక్ష్మీ రోడ్డు మరియు తలసి బాగ్‌కు బయల్దేరాము. అయితే మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రద్దీ ఉంది. చాలా వరకు ఫ్యామిలీలు దీపావళి పండుగకు కావాల్సిన పూజ సామాగ్రిని కొనుగోలు చేయడం కోసం వచ్చారు, దీంతో రెండు వీధులు జన సందోహంతో కిక్కిరిసిపోయాయి.

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

పూనే నగరానికి యువ బలం ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. టీవీఎస్ వీగో కూడా యువత మీదే దృష్టి పెట్టింది. చాలా మంది యువత ఇప్పుడు టీవీఎస్ విగోని ఎంచుకుంటున్నారు. పూనే నగరంలోని ఈ వీధి పేరు హాంగ్ కాంగ్ స్ట్రీట్. ఇక్కడ దుకాణదారులంతా యువతే. అంతర్జాతీయ ఆహార పదార్థాలు మరియు దిగుమతి చేసుకునే వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

పగులంతా టీవీఎస్ విగో మీద చక్కర్లు కొట్టొచ్చిన మాకు కయానీ బేకరి అనే బిస్కెట్ల కొట్టు కాస్త ప్రాణం పోసింది. ఇక్కడ సువాసనభరితమైన బిస్కెట్లు నోరూరిస్తాయి. బిస్కెట్లకు ఎందుకు అంత చేస్తున్నారనుకుంటున్నారా..? ఒక్క సారి తిన్న మేము ఇంతగా చెప్పుకోవడానికి కారణం సుమారుగా 1950 నుండి పూనే వాసులు వీటిని తెగ ఆదరిస్తున్నారు. పూనే నగరమంతా ఈ బిస్కెట్లకే ఓటేసింది. వీటికోసం క్యూలో కూడా నిలబడాల్సి వచ్చిందంటే నమ్మండి.

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

రద్దీతో కూడుకున్న ఆ బేకరి ప్రదేశం నుండి కాస్త ఆలస్యంగానే బయటపడ్డాం. అయితే అత్యంత రుచికరమైన, మృదువైన బిస్కెట్లను కొన్నింటిని మాతో పాటు ఉదాహరణగా తీసుకురావడం జరిగింది. ఈ బిస్కెట్లకు అంతటి ఖ్యాతి రావడం నిజమే అని తినేంత వరకు తెలియలేదు. ఈ సారి మీరు పూనేకు వెళితే వీటిని ట్రై చేయండి. ఇక పూనే టీ లో ఈ బిస్కెట్లు టేస్ట్ అమోఘం అని చెప్పాలి.

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

సాయంత్రానికి పూనేకి సమీపంలో ఉన్న పార్వతి టెంపుల్ ఉన్న కొండను చేరుకున్నాం. దీపావళి నాడు సూర్యుడు పూనే నగరాన్ని ప్రత్యేకంగా దీవిస్తున్నట్లుంది కదూ. ఈ కొండపై నుండి పూనే నగరం మొత్తాన్ని ఒక్క ఫోటోలో బంధించవచ్చు.

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

దేదీప్యమానంగా కాంతులీనుతున్న ఈ పూనే నగరం చూడండి, ఒక వైపు విద్యుత్ కాంతులతో మరో వైపు టపాసుల కాంతులతో విదేశీ నగరాన్ని తలపిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా పార్వతి కొండ మీద నుండి తీయడం జరిగింది.

దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

దీపావళి సందర్భంగా పూనే నగరం మొత్తాన్ని చూసేశాం అనుకుంటా. మేము అసలైన దీపావళిని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాం కాబట్టి పూనే గురించి తెలుసుకోవడం ఇంకా ఉందనే భావన కలుగుతోంది.... టీవీఎస్ విగో దీపావళిపూనే రైడింగ్ యొక్క మరిన్ని విశేషాలు త్వరలో....

Most Read Articles

English summary
Here #WeGo Exploring A Lit Up Pune During The Festival Of Lights
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X