స్కూటర్ల రాజ్యం: దేశీయంగా విడుదల కానున్న స్కూటర్లు

త్వరలో దేశీయ స్కూటర్ల సెగ్మెంట్లోకి విడుదల కానున్న స్కూటర్లు, వాటి ధరలు, ఫీచర్లతో పాటు అంచనాగా విడుదల తేదీలు వంటి పూర్తి వివరాలు గురించి ఇవాళ్టి కథనం ద్వారా తెలుసుకుందాం రండి...

భవిష్యత్ ద్విచక్ర వాహన సెగ్మెంట్ మొత్తం స్కూటర్లదే అనడానికి మరో బలమైన కథనం ఇవాళ్టి అప్ కమింగ్ స్కూటర్స్ స్టోరీ. నిజమే, గత పదేళ్ల నుండి భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో వస్తున్న అసాధారణ పరివర్తనే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు టూ వీలర్ల మార్కెట్లో బైకులదే ఆదిపత్యం. అయితే ఆ ధోరణి ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. టూ వీలర్లకు మొట్టమొదటి పర్యాయపదం స్కూటర్లు అనేంతగా మార్కెట్లో అనేక మార్పులు సంతరించుకున్నాయి.

త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

బైకులయినా , స్కూటర్లయినా అమ్మాకాలే ముఖ్యంగా ప్రాకులాడుతున్న దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమలు ఇప్పుడు స్కూటర్లను ఎంచుకునే కస్టమర్లను తమదైన రీతిలో ఆకర్షించడానికి విభిన్నమైన స్కూటర్లను అభివృద్ది చేస్తున్నాయి. కొన్ని సంస్థలు తమ స్కూటర్లను విడుదలకు సిద్దం చేస్తున్నాయి. వాటి గురించి నేటి ప్రత్యేక స్టోరీ...

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

టీవీఎస్ మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఎన్‌టార్క్ 210 అనే పేరుతో కాన్సెప్ట్ స్కూటర్‌ను ప్రదర్శించింది. ఎప్పుడు సాధారణ డిజైన్‌లో ఉండే ఉత్పత్తులకు కాస్త భిన్నంగా టీవీఎస్ దీనిని డిజైన్ చేసింది.

త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

125సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందించి ఈ కాన్సెప్ట్‌ను ఎన్‌టార్క్ 125 అనే పేరుతో ప్రొడక్షన్ ఉత్పత్తిగా సిద్దం చేయనుంది. ఇది మార్కెట్లోకి విడుదలైతే హోండా ఆక్టివా, సుజుకి యాక్సెస్ వంటి ఉత్పత్తులకు గట్టి పోటీనివ్వనుంది.

త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

  • ఇంజన్: 125సీసీ
  • గేర్‌బాక్స్: సివిటి (కంటిన్యూయస్లి వేరిబుల్ ట్రాన్స్‌మిషన్)
  • ధర అంచనా: రూ. 70,000 నుండి 85,000 లు
  • విడుదల అంచనా: 2017 ప్రారంభం నాటికి
  • వెస్పా జిటిఎస్ 300

    వెస్పా జిటిఎస్ 300

    పియాజియో సంస్థ ఇండియన్ మార్కెట్లో ఉన్న తమ స్కూటర్ల లైనప్‌లోనికి పర్ఫామెన్స్ ఆధారిత స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అత్యుత్తమ పనితీరును కనబరిచే ఉత్పత్తిగా జిటిఎస్ 300 ను దిగుమతి చేసుకుని కంప్లిట్లి బిల్ట్ యూనిట్‌గా రంగ ప్రవేశం చేయించనుంది.

    త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

    స్పోర్ట్స్ బైకుల్లో ఉండే ఫీచర్లను ఇందులో పరిచయం చేయనుంది పియాజియో. అనలాగా ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌సిడి డిస్ల్పే, భద్రత పరంగా ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ముఖ్యంగా ఉన్నాయి.

    త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

    • ఇంజన్: 278సీసీ
    • ట్రాన్స్‌మిషన్: సివిటి గేర్‌బాక్స్
    • ధర అంచనా: సుమారుగా 4 లక్షల వరకు
    • విడుదల అంచనా: 2016 చివరికి లేదా 2017 ప్రారంభం నాటికి
    • హీరో జడ్ఐఆర్

      హీరో జడ్ఐఆర్

      హీరో మోటోకార్ప్ జడ్ఐఆర్ అనే స్కూటర్ ద్వారా దేశీయ ప్రీమియమ్ స్కూటర్ల సెగ్మెంట్లోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. హీరో దీనిని ప్లాట్ ఫోర్ బోర్డ్ మరియు యూరోపియన్ స్టైల్ స్టెప్ త్రూ అనే రెండు వేరియంట్లలో విడుదల చేయనుంది.

      త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

      హీరో ఈ జడ్ఐఆర్ స్కూటర్ లో 13.8బిహెచ్‌పి పవర్ మరియు 12.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల సింగల్ సిలిండర్ ఇంజన్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఫీచర్ల పరంగా ఇందులో డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డే టైం రన్నింగ్ ల్యాంప్స్, ప్రకాశవంతమైన ఎల్ఇడి బ్లింకర్స్, టెయిల్ లైట్లతో పాటు రానుంది.

      త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

      • ఇంజన్: 150సీసీ
      • ట్రాన్స్‌మిషన్: సివిటి గేర్‌బాక్స్
      • ధర అంచనా: రూ. 80,000 నుండి 90,000 రుపాయల వరకు
      • విడుదల అంచనా: 2017 మధ్య భాగానికి
      • టీవీఎస్ జూపిటర్

        టీవీఎస్ జూపిటర్

        పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అంచెలంచెలుగా ఎదుగుతున్న దేశీయ రెండవ అతి పెద్ద ద్విచక్ర వాహనా తయారీ సంస్థ టీవీఎస్ తమ స్కూటర్ల లైనప్‌లో అత్యంత అమ్మకాలు సాధిస్తున్న జూపిటర్‌ను ఎఫ్ఐ వేరియంట్‌లో విడుదల చేయనుంది. పేరులోనే కాదు సాంకేతికంగా కూడా ఇందులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

        త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

        ఫ్యూయల్ ఇంజెక్టెడ్ వర్షన్ గల కార్బోరేటర్‌ను ఇందులో అందిస్తున్నారు, దీంతో పాటు ఇందులోని ఇంజన్‌ను తాజా యూరో 6 ఉద్గార నియమాలను పాటించే విధంగా అభివృద్ది చేస్తోంది టీవీఎస్.

        త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

        • ఇంజన్: 110సీసీ
        • ట్రాన్స్‌మిషన్: సివిటి గేర్‌బాక్స్
        • ధర అంచనా: రూ. 55,000 నుండి 65,000 రుపాయల మధ్య ఉండవచ్చు
        • విడుదల అంచనా: 2017 ప్రారంభానికి
        • హీరో డేర్

          హీరో డేర్

          స్కూటర్ల మార్కెట్ మరింత బలపడుతున్న నేపథ్యంలో హీరో మరో స్కూటర్‌ను అభివృద్ది చేస్తోంది. యువతను టార్గెట్ చేస్తున్న ఇది మార్కెట్లోని హోండా డియో కు గట్టి పోటీనివ్వనుంది.

          త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

          పనితీరు కనబరిచే స్కూటర్ల విభాగంలో కాలు మోపడానికి హీరో డేర్ స్కూటర్ ను 125సీసీ ఇంజన్ తో 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన మీద ప్రదర్శించింది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో ఉన్న డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

          త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

          • ఇంజన్: 125సీసీ
          • ట్రాన్స్‌మిషన్: సివిటి గేర్‌బాక్స్
          • ధర అంచనా: రూ. 60,000 నుండి 65,000 మధ్య ప్రారంభం
          • విడుదల అంచనా: 2017 ప్రారంభం నాటికి
          • పోటీ: ఆక్టివా 125 మరియు సుజుకి యాక్సెస్ 125 స్కూటర్లకు
          • అథర్ ఎనర్జీ ఎస్340

            అథర్ ఎనర్జీ ఎస్340

            అథర్ ఎనర్జీ వినడానికి కొత్తగా ఉన్నా, ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞాన ఆధారిత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. ఈ ఏడాదితో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. కేవలం విద్యుత్ శక్తిని స్టోర్ చేసుకుని నడిచే స్కూటర్ల మీద ఈ సంస్థ దృష్టిసారిస్తోంది.

            త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

            భవిష్యత్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డిజైన్‌ను ప్రతిబింబించే తీరులో ఉన్న ఈ ఎస్340 స్కూటర్ కేవలం ఒక గంట సమయంలో 80 శాతం ఛార్జింగ్ అవుతుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లుగా ఉంది.

            త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

            మిగిలి ఉన్న ఛార్జింగ్ ద్వారా ఎన్ని కిలోమీటర్లు వెళ్లవచ్చు, చార్జింగ్ శాతం, న్యావిగేషన్ మరియు ఇతర వివరాలు పొందడానికి ఇందులో తాకే తెర గల డ్యాష్ బోర్డ్ కలదు. అంతే కాకుండా వీటిని బుక్ చేసుకునే వారికి డోర్ డెలివరీ మరియు ఇంటివద్దనే సర్వీసింగ్ నిర్వహించడం వీరి ప్రత్యేకత.

            • ప్రయాణ పరిధి: 60 కిలోమీటర్లు
            • ధర అంచనా: రూ. 1 లక్ష వరకు
            • విడుదల అంచనా: 2017 మధ్య భాగానికి
            • యమహా ఎన్‌మ్యాక్స్ 155

              యమహా ఎన్‌మ్యాక్స్ 155

              యమహా శ్రేణిలో ఉన్న మ్యాక్సి స్కూటర్ సెగ్మెంట్ ఆధారంగా ఎన్‍‌మ్యాక్స్ స్కూటర్ వస్తోంది. కండలు తిరిగిన దేహంతో, స్టెప్ సీటుతో పాటు అనేక ఇతర యూరోపియన్ స్టైలింగ్ లక్షణాలతో దేశీయ విడుదలకు తపిస్తోంది.

              త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

              సాంకేతికంగా యమహా ఎన్‌మ్యాక్స్ లో 150సీసీ సామర్థ్యం గల ఇంజన్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి. ఇది హీరో మోటోకార్ప్ వారి అప్ కమింగ్ పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ స్కూటక్ జడ్ఐఆర్ కు పోటీగా నిలవనుంది.

              త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

              • ఇంజన్: 150సీసీ
              • ట్రాన్స్‌మిషన్: సివిటి గేర్‌బాక్స్
              • ధర అంచనా: రూ. 85,000 నుండి 95,000 వరకు
              • విడుదల అంచనా: 2017 మలి సగానికి
              • త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

                ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టూ వీలర్ల తయారీ సంస్థలు కేవలం కమ్యూటింగ్ మీద మాత్రమే కాకుండా పర్ఫామెన్స్ (గరిష్ట సీసీ/ పనితీరు) గల ఉత్పత్తులను రూపొందించడం మీద అధిక ఆసక్తి చూపుతున్నాయి.

                త్వరలో విడుదల కానున్న స్కూటర్లు

                • బజాజ్ నుండి మరో సంచలనాత్మక మోడల్: డొమైనర్ 400
                • అలర్ట్: 2017 నాటికి విడుదల కానున్న గ్రాండ్ ఐ10
                • టాటా మోటార్స్ లో నెం.1 కారు టియాగోకు భారీ డిమాండ్

Most Read Articles

English summary
Upcoming Scooters In India — Exciting Lineup Ahead
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X