భారీ ఫీచర్లతో కొలువుదీరిన యమహా వారి ఎమ్‌టి-09 స్ట్రీట్ బైక్

By Anil

యమహా టూ వీలర్స్ వారు తమ ఎమ్‍‌టి-09 స్ట్రీట్ ఫైటర్ బైకును 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ మరియు బాలీవుడు నటుడు జాన్ అబ్రహాం చేతుల మీదగా ప్రదర్శించారు. యమహా ఎమ్‌టి-09 ధర దాదాపుగా 10.20 లక్షలు ఎక్స్ షో రూమ్ గా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ బైకుకు చెందిన ఫోటోల కోసం క్రింద గల ఫోటోలోని వ్యూవ్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి

యమహా ఎమ్‌టి-09

ఇంజన్ మరియు ఇతర స్పెసిఫికేషన్లు:
  • ఇంజన్ సామర్థ్యం: 847 సీసీ
  • సిలిండర్లు: మూడు సిలిండర్లు
  • కూలింగ్ సిస్టమ్: లిక్విడ్ కూలింగ్
  • పవర్: 113.4 బిహెచ్‌పి @ 10,000ఆర్‌పిఎమ్
  • టార్క్: 87.5 ఎన్ఎమ్ @ 8,500 ఆర్‌పిఎమ్
  • 0 నుండి 100 కిమీ వేగం: 3.4 సెకండ్లలోనే
  • అత్యధిక వేగం: గంటకు 225 కిలోమీటర్లు
  • మైలేజ్: 19.1 కిలోమీటర్లు
  • గేర్ బాక్స్: 6-స్పీడ్ గేర్ బాక్స్
  • ఇంధన ట్యాంక్ సామర్థ్యం: 14-లీటర్లు

Also Read: 39,500 లకే హోండా వారి నవీ క్రాసోవర్ స్కూటర్
సస్పెన్ మరియు బ్రేకులు:

సరికొత్త ఎమ్‌టి-09 స్ట్రీట్ ఫైటర్ బైకులో ముందు వైపున 137 ఎమ్ఎమ్ ట్రావెల్ గల టెలిస్కోపిక్ అప్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుకవైపున 130 ఎమ్ఎమ్ ట్రావెల్ కలిగిన లింక్ టైప్ మోనో షాక్ సస్పెన్షన్ సిస్టమ్ కలదు.

ముందు చక్రాన్ని 298 ఎమ్ఎమ్ గల రెండు హైడ్రాలిక్ డిస్క్ బ్రేకుల ద్వారా ఆపవచ్చు మరియు వెనుక వైపున 245 ఎమ్ఎమ్ఎమ్ గల హైడ్రాలిక్‌ డిస్క్ బ్రేక్‌ను అందించారు. రెండు చక్రాలు కూడా 17-అంగుళాల చుట్టు కొలతను కలిగి ఉన్నాయి.
Also Read: వితారా బ్రిజా ఎస్‌యువిని ప్రదర్శించిన మారుతి సుజుకి : ఫోటోల కోసం
ఎమ్‌టి-09 బైకులోని టాప్ ఫీచర్లు:

  • డైమండ్ టైప్ ఛాసిస్
  • డై-క్యాస్ట్ అల్యూమినియం ఫ్రేమ్
  • అసిమ్‌మెట్రిక్ స్వింగ్ ఆర్మ్
  • మూడు రైడింగ్ మోడ్లు
  • ట్రాక్షన్ కంట్రోల్
  • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
  • లీనియర్ టార్క్ అవుట్ పుట్

Also Read: 1.49 లక్షలు ప్రారంభ ధరతో మూడు మోటార్ సైకిల్స్ విడుదల: వీటి దెబ్బతో ఎన్ఫీల్డ్ ఇంటికే
అందుబాటులోకి మరియు పోటి:

దీనిని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గల యమహా డీలర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు మరియు యమహా దీనిని ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ మరియు కవాసకి జడ్800 రెండు బైకుల మీద పోటిగా తీసుకువచ్చింది.

Most Read Articles

English summary
Yamaha MT-09 Lands In India Looking For A Street Fight With Triumph
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X