యమహా కొత్త స్కూటర్: ఎన్‌విఎక్స్ 150

By Anil

చూడటానికి ఎంతో అడ్వాన్స్‌డ్ డిజైన్‌లో ఉన్న ఈ స్కూటర్ పేరు ఎన్‌విఎక్స్ 150. దీనిని యమహా సంస్థ అభివృద్ది చేసింది. ప్రస్తుతం ఇండోనేషియాలో దీనికి పరీక్షలను నిర్వహిస్తోంది యమహా. ఇండోనేషియాలో ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

యమహా ఎన్‌విఎక్స్ 150

యమహా మోటార్ సైకిల్ లైనప్‌లో ఉన్న ఉత్పత్తుల కలబోత ఆధారంగా దీనిని డిజైన్ చేసారు. దీనికి ముందు వైపున రెండు హెడ్ లైట్లు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఎల్ఇడి బ్రేక్ లైట్లు మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

యమహా ఎన్‌విఎక్స్ 150

యమహా ఎన్‌విఎక్స్ స్కూటర్‌ ముందు భాగంలో పెటల్ డిస్క్ బ్రేక్ కలదు. స్టాండర్డ్ మోడల్‌గా అందుబాటులో ఎన్‌విఎక్స్‌లో కూడా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు అల్లాయ్ వీల్స్ కలవు.

యమహా ఎన్‌విఎక్స్ 150

ఫీచర్ల పరంగా స్మార్ట్ కీ ఎంట్రీ సిస్టమ్, ఫూయల్ లాక్ ఒపెన్ కోసం బటన్ టైప్ అన్‌లాక్ సిస్టమ్ కలదు.

యమహా ఎన్‌విఎక్స్ 150

5.8-అంగుళాల పరిమాణంగల ఎల్‌సిడి డ్యాష్‌బోర్డ్, 25లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్ ట్యాంక్ మరియు 14-అంగుళాల టైర్లను కూడా అందించారు.

యమహా ఎన్‌విఎక్స్ 150

బైకు తరహాలో ఉన్న ఈ స్కూటర్‌లో అన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ దీని మొత్తం బరువు కేవలం 125 కిలోలుగా ఉంది.

యమహా ఎన్‌విఎక్స్ 150

యమహా మోటార్స్ ఈ స్కూటర్‌ను 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద ఎన్‌మ్యాక్స్ అనే పేరుతో ప్రదర్శించింది. యమహా ఇందులో 150సీసీ సామర్థ్యం గల ఇంజన్‌తో దేశీయ మార్కెట్లో అందించే అవకాశం ఉంది.

యమహా ఎన్‌విఎక్స్ 150

ప్రస్తుతం దేశీయ స్కూటర్ల విపణిలో ప్రీమియమ్ స్కూటర్ సెగ్మెంట్లో అప్రిలియా ఎస్ఆర్ 150 మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది.

యమహా ఎన్‌విఎక్స్ 150

  • ISIS తీవ్రవాదుల అంతానికి ప్రత్యేక యుద్ద వాహనాలతో బయలుదేరిన ఫ్రాన్స్
  • ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యన్ మిస్సైల్స్ ఇప్పడు భారత్ వద్ద
  • పాకిస్తాన్‌ను బూడిద చేయడానికి వీటికి క్షణం చాలు...!!

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Read In Telugu: Yamaha NVX 150 Scooter Spotted Testing
Story first published: Saturday, October 15, 2016, 14:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X