ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్‌తో విడుదలైన యమహా వైజడ్ఎఫ్-ఆర్15

యమహా ఇండియా దేశీయ మార్కెట్లోకి తమ వైజడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 వేరియంట్‌ను "ఆటో హెడ్ ల్యాంప్ ఆన్" ఫీచర్‌తో విడుదల చేసింది.

By Anil

యమహా ఇండియా తమ యమహా వైజడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 మోడల్‌లో అతి ముఖ్యమైన "ఆటో హెడ్‌ల్యాంప్ ఆన్" (AHO) ఫీచర్ గల వేరియంట్‌ను నిశ్శబ్దంగా విడుదల చేసింది. ఆర్15 2.0 వెర్షన్ మరియు ఆర్15 ఎస్ వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఈ AHO ఫీచర్‌ను అందిస్తున్నట్లు యమహా ప్రకటించింది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15

తొలుత ఇండియన్ టూ వీలర్ సెగ్మెంట్లోకి ఈ "ఆటో హెడ్ ల్యాంప్ ఆన్" ఫీచర్‌ను కెటిఎమ్ తమ డ్యూక్ మరియు ఆర్‌సి రేంజ్ ఉత్పత్తుల్లో పరిచయం చేసింది. తరువాతు హీరో మోటోకార్ప్ తమ స్ల్పెండర్ ఐస్మార్ట్ 110 లో ఇప్పుడు యమహా కూడా ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15

ఆటో హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ యొక్క పనితీరు చాలా సింపుల్‌గా ఉంటుంది. బైకు ఇంజన్ ఆన్ అవ్వగానే లైట్ ఆన్ అవుతుంది మరియు ఇంజన్ ఆఫ్ అవగానే హెడ్ లైట్ ఆఫ్ అవుతుంది. ప్రత్యేకించి హెడ్ లైట్ ఆఫ్ అండ్ బటన్ ఇందులో ఇవ్వలేదు.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15

యమహా వైజడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 ధర రూ. 1.18 లక్షలు మరియు ఆర్15 ఎస్ వేరియంట్ ధర రూ. 1.15 లక్షలు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15

ప్రమాదాలను నివారించడానికి మరియు ప్రభుత్వం సూచనల మేరకు యమహా తమ వైజడ్ఎఫ్-ఆర్15 శ్రేణిలో ఆటో హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా హెడ్ లైట్లు ఎల్లప్పుడూ ఆన్ లో ఉండటం వలన జాతీయ రహదారుల మీద ఎదురుగా వచ్చే వాహన చోదకులను అప్రమత్తం చేస్తాయి. తద్వారా ప్రమాదాల రేటు చాలా వరకు తగ్గుతుంది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15

యమహా వైజడ్ఎఫ్ శ్రేణిలో 150సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 16.70బిహెచ్‌పి పవర్ మరియు 15ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15

  • ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ మ్యాన్యువల్
  • మైలేజ్: 42 కిమీ/లీ
  • గరిష్ట వేగం: 130 కిమీ/గంటకు
  • మొత్తం బరువు: 136 కిలోలు
  • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 12 లీటర్లు
  • యమహా వైజడ్ఎఫ్-ఆర్15

    • ఫోర్డ్ నుండి కుగా కాంపాక్ట్ SUV
    • రెనో ఇండియా డిసెంబర్ ఆఫర్లు: లక్ష రుపాయల వరకు ప్రయోజనాలు
    • మేడిన్ ఇండియా మంత్రాన్ని జపించే మోడీగారికి విదేశీ కారెందుకు?

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha YZF-R15 With 'Auto Headlamp On' Launched In India
Story first published: Saturday, December 3, 2016, 18:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X