అప్రిలియా నుండి ఎస్ఐఆర్ 150 రేస్ ఎడిషన్ స్కూటర్

Written By:

ఇటాలియన్ కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అప్రిలియా ఇండియన్ మార్కెట్లోకి ఎస్ఆర్150 రేస్ ఎడిషన్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సిద్దమైంది. గత ఏడాది నమ్మశక్యం కాని ధరతో (రూ. 65,000 లు) విపణిలోకి విడుదల చేసింది. విక్రయాల్లో మంచి విజయం సాధిచండంతో దీనిని రేస్ ఎడిషన్ స్కూటర్‌గా విడుదలకు సిద్దం చేస్తోంది. అంటే బైకులతోనే కాదు ఇక మీదట స్కూటర్లతో కూడా రేస్‌లు మొదలెట్టవచ్చన్నమాట.

తాజాగ అందుతున్న సమాచారం మేరకు అప్రిలియా తమ ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్ స్కూటర్‌ను ఫిబ్రవరి 9, 2017 (నేడు) మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్ స్కూటర్ ను ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తున్నపుడు టీమ్ బిహెచ్‌పి బృందం ఫోటోలను క్లిక్‌మనిపించింది. తాజా వెర్షన్ స్కూటర్ యొక్క మూడు ఫోటోలను తమ వెబ్‌సైట్ ద్వారా పంచుకుంది.

ఈ చిత్రాలను గమనిస్తే, ఎక్ట్సీరియర్ బాడీ మీద న్యూ డీకాల్ బాడీ పెయింటింగ్ కలదు, సాధారణ ఎస్ఆర్ 150 స్కూటర్‌ను పోలి ఉన్నప్పటికీ కాస్మొటిక్ పరంగా కాస్త భిన్నంగా కనిపిస్తుంది.

రేస్ ఎడిషన్ స్కూటర్ మీద మోటోజిపి ప్రేరిత రేసింగ్ డీకాల్స్, కలర్ స్కీమ్, బంగారపు వర్ణంలో ఉన్న ముందు వైపు బ్రేక్ కాలిపర్, ఇరు వైపులా ఎర్రటి రంగులో అల్లాయ్ వీల్స్, ఎర్రటి రంగులో ఉన్న వెనుక వైపు షాక్ అబ్జార్వర్ స్ప్రింగ్ వంటివి ఇందులో ఆకర్షణీయంగా ఉన్నాయి.

సాంకేతికంగా ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్ స్కూటర్‌లో అదే మునుపటి 154.4సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 10.4బిహెచ్‌పి పవర్ మరియు 11.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఈ స్కూటర్ గత రెండు మాసాల్లో జరిగిన సుమారుగా ఐదు వేడుకల్లో స్కూటర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌కు క్లెయిమ్ చేసుకుంది.

ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్ స్కూటర్ ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున సింగల్ సైడ్ కాయిల్ స్ప్రింగ్ షాక్ అబ్జార్వర్ అందివ్వడం జరిగింది. రెండు అల్లాయ్ చక్రాలకు కూడా 120/70 కొలతలు గల టైర్ల మీద పరుగులు పెడుతుంది.

ముందు చక్రానికి 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 140ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేకుతో లభించనుంది.

అప్రిలియా సంస్థ గత ఏడాది తమ మొదటి ఎస్ఆర్ 150 ప్రీమియమ్ స్కూటర్‌ను నమ్మశక్యం కాని ధర రూ. 65,000 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా విడుదల చేసింది. అయితే దీని కంటే కాస్త ఎక్కువ ధరతో రేస్ ఎడిషన్ ఎస్ఆర్ 150 విడుదలయ్యే అవకాశం ఉంది.

మహరాష్ట్రలోని బరామతి లో ఉన్న పియాజియో ప్రొడక్షన్ ప్లాంటులో ఎస్ఆర్ 150 మరియు వెస్పా శ్రేణి స్కూటర్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ రేస్ ఎడిషన్ ఎస్ఆర్ 150 కూడా ఇక్కడే ఉత్పత్తి కానుంది

మరిన్ని అప్రిలియా ఎస్ఆర్ 150 ఫోటోలను వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Thursday, February 9, 2017, 12:53 [IST]
English summary
Spotted: Aprilia SR 150 Race Edition; Launch On February 9
Please Wait while comments are loading...

Latest Photos