గణాంకాలు నిగ్గుతేల్చిన నిజం: రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లే డామినర్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు!

రాయల్ ఎన్ఫీల్డ్ వినియోగించిన వారే ఇప్పుడు అత్యధికంగా బజాజ్ డామినర్ 400 బైకును ఎంచుకుంటున్నట్లు బజాజ్ తెలిపింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తులకు ప్రధానమైన ప్రత్యామ్నాయంగా డామినర్ నిలిచింది.

Written By:

దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ డామినర్ 400 క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను సరిగ్గా మూడు నెలల క్రితం డిసెంబర్ చివర్లో విపణిలోకి విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు భారీ విక్రయాలు సాధిస్తోంది. దీని సక్సెస్ ఎలా ఉందంటే క్లాసిక్ మోటార్ సైకిళ్ల మార్కెట్లో రారాజుగా ఉన్న రాయల్ ఎన్పీల్డ్ ఉత్పత్తులకు గుదిబండగా మారింది.

ధరకు తగ్గ విలువలతో మార్కెట్లోకి అందించిన డామినర్ 400 గురించి బజాజ్ ఆటో ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. బిజినెస్ స్టాండర్డ్స్ పత్రికతో బజాజ్ ఆటో ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ మాట్లాడుతూ, ప్రస్తుతం డామినర్ 400 ఎంచుకుంటున్న వారిలో 20 శాతం మంది ఒకప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లే అని తెలిపాడు.

ఒక్కో నెలకు సగటున 3,000 యూనిట్ల డామినర్ 400 మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది బజాజ్. అందులో ప్రతి పది మందిలో ఇద్దరు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ కొనుగోలు చేసినవారని చెప్పుకొచ్చాడు.

ఎరిక్ వాస్ మాట్లాడుతూ, సెగ్మెంట్ ప్రకారం తీసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్‌ను ఎప్పుడో అధిగమించినట్లు తెలిపాడు. రాయల్ ఎన్ఫీల్డ్ సగటున 5,000 యూనిట్ల వరకు విక్రయిస్తోంది. అయితే కొత్తగా బైకు ఎంచుకునే వారు మరియు ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తులను వినియోగించిన కస్టమర్లకు ఎక్కువ విక్రయించినట్లు చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం బజాజ్ ఆటో దేశవ్యాప్తంగా 32 నగరాల్లో డామినర్ 400 బైకును అందుబాటులో ఉంచాము, మార్చి 2017 చివరికి ఈ సంఖ్యను 100 కు, అదే విధంగా ఏప్రిల్ 2017 చివరి నాటికి 200 కు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు.

డామినర్ 400 మోటార్ సైకిళ్ల యొక్క ఉత్పత్తిని పెంచితే విక్రయాలు కూడా జోరందుకుంటాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం నెలకు 6,000 యూనిట్లను వచ్చే ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 2017 నాటి నుండి నెలకు 10,000 యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు బజాజ్ పేర్కొంది.

సాంకేతికంగా బజాజ్ డామినర్ 400 క్రూయిజర్ బైకులో 373.3సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 35బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఈ సెగ్మెంట్లో బజాజ్ డామినర్ 400 సక్సెస్‌కు ప్రధానమైన కారణాలను పరిశీలించినట్లయితే - డిజైన్, స్లిప్పర్ క్లచ్, డ్యూయల్ ఛానల్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లున్నాయి.

క్లాసిక్ క్రూయిజ్ బైకుల సెగ్మెంట్లో కంచుకోట లాంటి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న రాయల్ ఎన్ఫీల్డ్‌కు ఇప్పుడు బజాజ్ డామినర్ రాక భారీ పోటీని సృష్టించింది. 350సీసీ సెగ్మెంట్లో ఉన్న క్లాసిక్ మరియు బుల్లెట్ బైకులకు డామినర్ బలమైన పోటీనిస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్‌ మోటార్ సైకిల్‌లో 346సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 19.80బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బజాజ్ డామినర్ 400 ధరలు

  • హైదరాబాద్‌లో ధర రూ. 1,56,153 లు 
  • విశాఖపట్టణంలో ధర రూ. 1,56,534 లు 
  • విజయవాడలో ధర రూ. 1,56,534 లు

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ధరలు

  • హైదరాబాద్‌లో ధర రూ. 1,56,058 లు
  • విశాఖపట్టణంలో ధర రూ. 1,51,013 లు
  • విజయవాడలో ధర రూ. 1,51,013 లు 
గమనిక: అన్ని ధరలు స్టాండర్డ్ వేరియంట్లకు చెందినవి మరియు ఆన్ రోడ్ ధరలుగా ఇవ్వడం జరిగింది. 

 

WHAT OTHERS ARE READING

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Thursday, March 23, 2017, 12:40 [IST]
English summary
Also Read In Telugu: Bajaj Dominar 400 Garners Royal Enfield Customers
Please Wait while comments are loading...

Latest Photos

LIKE US ON FACEBOOK