పల్సర్ శ్రేణి మీద ధరలు పెంచిన బజాజ్

Written By:

బజాజ్ పల్సర్ బ్రాండు పేరుతో వివిధ సామర్థ్యంతో అందుబాటులో ఉంచిన బైకుల మీద ధరలు పెంచింది. ఈ పెంపు ప్రారంభ పల్సర్ మోటార్ సైకిల్‌ మీద కనీసం రూ. 1,001 లుగా ఉంది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

ధరల పెంపుకు గురైన తరువాత పల్సర్ శ్రేణిలోని బైకుల ప్రస్తుతం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 (నాన్ ఏబిఎస్) రూ. 1,22,881 లు
  • బజాజ్ పల్సర్ ఆప్ఎస్ (ఏబిఎస్) ధర రూ. 1,34,882 లు
  • బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ధర రూ. 97,452 లు
  • బజాజ్ పల్సర్ 200 ధర రూ. 92,200 లు

  • బజాజ్ పల్సర్ 180 ధర రూ. 80,546 లు
  • బజాజ్ పల్సర్ 150 ధర రూ. 75,604 లు
  • బజాజ్ పల్సర్ 135ఎల్ఎస్ ధర రూ. 61,177 లు
గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

బజాజ్‌ మిగతా మోడళ్లయిన అవెంజర్, వి-సిరీస్ మరియు సిటి 100 ల మీద ఎలాంటి ధరల పెంపు జరగలేదు. అయితే రానున్న కాలంలో వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

బజాజ్ ఆటో గత విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, దేశీయ విక్రయాల్లో తగ్గుదల కనిపించింది. మరియు ఎగుతుల్లో కూడా అదే తరహా వ్యతిరేక వృద్ది నమోదైంది.

Read more on: #బజాజ్ #bajaj
English summary
Read In Telugu To Know About Bajaj Pulsar Range Price Hiked
Please Wait while comments are loading...

Latest Photos