రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్‌గా మార్పు చెందిన బజాజ్ పల్సర్

Written By:

భారత దేశపు అత్యంత సరసమైన, ఏకైక అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. రాయల్ ఎన్ఫీల్డ్ తమ అడ్వెంచర్ మోటార్ సైకిల్ హిమాలయన్‌ను సరిగ్గా ఏడాది క్రితం మార్కెట్లోకి విడుదల చేసింది. అనతి కాలంలో అడ్వెంచర్ ప్రియుల మదిని దోచుకుని భారీ సక్సెస్ సాధించింది. ఇండియాలోనే కాకుండా అనేక అంతర్జాతీయ మార్కెట్లో కూడా దీని విడుదల జరిగింది.

అయితే మన దగ్గర పాత బజాజ్ పల్సర్ మాత్రమే ఉంది. దీనితో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్‌ను నడిపిన అనుభవం రావాలంటే ఏం చేయాలి ? పల్సర్‌ను హిమాలయన్‌గా మార్చేస్తే వీలవుతుంది. నిజంగా ఓ పల్సర్ హిమాలయన్‌ అయిపోతుందా అనే అనుమానం వచ్చే ప్రతి ఒక్కరూ ఈ కథనం చదవాల్సిందే.

హిమాలయన్‌ను జిరాక్స్ తీస్తే వచ్చిన కాపీలా ఉంటుంది ఈ మోడిఫైడ్ బజాజ్ పల్సర్. అచ్చం హిమాలయన్ శైలిలో ఉండేందుకు బజాజ్ పల్సర్ 150 లోని యుజి2 మోడల్‌ను కొన్ని ఇతర విడి పరికరాలను సేకరించి మోడిఫై చేశారు.

హిమాలయన్ బైకును పోలి ఉండేందుకు బజాజ్ పల్సర్ బైకు యొక్క ఇంధన ట్యాంకుని పూర్తి వైట్ కలర్‌లో తీర్చిదిద్దారు. ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క హిమాలయన్ హెడ్ ల్యాంప్‌ను పల్సర్ హెడ్ ల్యాంప్‌ స్థానంలో అందివ్వడం జరిగింది.

ఇంధన ట్యాంకు ప్రొటెక్టర్, జెర్రీ క్యాన్లను తీసుకెళ్లే పెట్టెలు సీటుకు ఇరువైపులా ఉన్నాయి, ముందు వైపున పల్సర్ మడ్ గార్డ్ స్థానంలో రాయల్ ఎన్ఫీల్డ్ నుండి సేకరించిన దానిని అందివ్వడం జరిగింది. దీంతో బైకు మొత్తం ఓ రూపానికి వచ్చింది.

ఇక మిగిలిన సీటు కవరును అప్‌డేట్ చేసి ముందు మరియు వెనుక ఇరు వైపులా స్పోక్ట్ వీల్స్ అందించింది, ఫ్రంట్ వీల్‌కు డిస్క్ బ్రేక్ జోడించడం జరిగింది. ఒక్క ఇంజన్ అప్‌డేట్ మినహాయిస్తే, భౌతికంగా రాయల్ ఎన్ఫీల్డ్‌తో గట్టిగానే పోటీపడుతుంది.

ముందు వైపున లాంగ్ ట్రావెల్ ఉన్న ఫ్రంట్ ఫోర్క్స్, లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎక్కువ లగేజీతో వెళ్లే వారికోసం ఐరన్ ర్యాక్ కలదు, ఇరు వైపులా స్యాడిల్ బ్యాగులు రియర్ డిజైన్‌ను విస్మరించకుండా టెయిల్ ల్యాంప్ సెక్షన్‌ను కూడా మోడిఫై చేశారు.

మోడిఫికేషన్ ఎందుకు ?

రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో హిమాలయన్ అందుబాటులో ఉండగా, బజాజ్ పల్సర్‌ను శ్రమతో మోడిఫై చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. ప్రధాన కారణం డబ్బును ఆదా చేయడం. నిజానికి హిమాలయన్ మోడిఫైడ్ పల్సర్‌తో పోల్చుకుంటే చాలా ఎక్కువ.

పాత పల్సర్ బైకులు నిజానికి ఆశించిన మేర పనితీరును కనబరచవు. కాబట్టి హిమాలయన్ రైడింగ్ అనుభూతిని కోరుకునే వారు, వినియోగంలోని మరియు రోజు వారి అవసరాలకు పనికిరాని మోటార్ సైకిల్‌ను హిమాలయన్‌గా మోడిఫై చేసుకుంటే నలుగురిలో విభిన్నంగా ఉంటుంది.

మార్కెట్లో అందుబాటులో ఉన్న విభిన్న మోడిఫికేషన్ కిట్‌లను సేకరించి మీకు నచ్చిన బైకును విభిన్నంగా మోడిఫై చేసుకోవచ్చు. నిజానికి హిమాలయన్ బైకు ధర రూ. 1.6 లక్షల వరకు ఉంటే ఈ మోడిఫై బజాజ్ పల్సర్ ధర రూ. 80,000 ల లోపే ఉంది.

సాంకేతికంగా ఆఫ్ రోడింగ్ బజాజ్ పల్సర్ 150 యుజి2 మోడల్‌లో ని 150సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 13బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. అదే హిమాలయన్ విషయానికి వస్తే 24.5బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

ఇతరులు ఎక్కువగా చదువుతున్నవి

హోండా డబ్ల్యూఆర్-వి కి చెందిన 50 కి పైగా ఫోటోలను వీక్షించండి....

  

English summary
Also Read In Telugu: Bajaj Pulsar To Royal Enfield Himalayan Conversion
Please Wait while comments are loading...

Latest Photos