ప్రేయసి కోసం 50 బైకులు దొంగలించిన 23 ఏళ్ల యువకుడు

Written By:

ప్రేయసి కోసం సుమారుగా 50 మోటార్ సైకిళ్లను దొంగలించిన 23 ఏళ్ల అంతర రాష్ట్ర దొంగని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం మొత్తం సినిమా స్టోరీని తలపిస్తోంది. బెంగళూరులోని గార్మెంట్స్‌లో పనిచేసే ఓ వ్యక్తి తన సహోద్యోగి అయిన అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె ఆరోగ్యం క్షీణించింది.

ప్రేయసి ఆరోగ్యం బాగోలేదని వైద్య ఖర్చుల నిమిత్తం దొంగతనం చేయడ ప్రారంభించాడు. సంపాదించే సొమ్ము చాలకపోవడంతో ఈ మార్గాన్ని ఎంచుకుని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 బైకులను దొంగలించాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు, బెంగళూరులోని హొంగసంద్రలో నాయుడు లేఔట్‌లో నివశించే మనోహర్ అలియాస్ మను‌ను బెంగళూరు పోలీసులు ఏప్రిల్ 22, 2017 న అదుపులోకి తీసుకున్నారు.

తన ప్రేయసి ఆరోగ్యం బాగోలేదని, ఆమెను ఆంధ్రప్రదేశ్ నుండి తీసుకొచ్చి బెంగళూరులో చికిత్స అందిస్తున్నట్లు తెలిపాడు. వైద్య ఖర్చుల నిమిత్తం ఇలా దొంగతనాలకు పాల్పడినట్లు మనోహర్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.

మనోహర్ మరియు అతని ప్రేయసి పెళ్లిచేసుకోవాల్సి ఉండగా ఆమె ఆరోగ్యం బాగలేక ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని సొంతూరికి వెళ్లిపోయింది. అయితే బెంగళూరులో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వైద్యానికి కాల్సిన ఏర్పాట్లు చేస్తే వస్తానని తెలిపిందని పోలీసులు మీడియాతో తెలిపారు.

ఆ అమ్మాయి పచ్చకామెర్లు మరియు హార్మోన్లకు సంభందించిన వ్యాధితో బాధపడుతోంది. అయితే ట్రీట్‌మెంట్ కోసం సుమారుగా రూ. 5 లక్షలు ఖర్చవుతుందని తెలిపాడు, మరియు కొత్త ఇల్లు అద్దెకు, అద్దె ఇంట్లో కావాల్సిన వస్తువుల కొనుగోలుకు డబ్బు కావాల్సి ఉండగా మనోహర్ ఇలా దొంగలా మారాడు.

ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడో... డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో అనే విషయం గురించి ఆ అమ్మాయికి ఏమాత్రం ఐడియా లేదని పోలీసులు తెలిపారు.

మను దగ్గర నుండి సుమారుగా 25 లక్షల విలువైన 50 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. గత ఏడాది నవంబర్ నుండి నగరంలో, ప్రత్యేకించి బొమ్మనహళ్లి ప్రాంతంలో బైకు దొంగతనాలు పెరిగిపోతుండటంతో పోలీసులకు అనేక ఫిర్యాదులు అందాయి.

దొంగను పట్టుకోవడానికి పోలీసులు ఓ పథకం ప్రకారం, ఓ ప్రయివేట్ సంస్థకు సెకండ్ హ్యాండ్ బైకులు కావాలని నకిలీ సంస్థ పేరుతో బొమ్మనహళ్లి ప్రాంతంలో గోడ పత్రికలు అంటించి పోలీసుల్లోని ఓ వ్యక్తి కొనుగోలుదారుడిగా మాట్లాడి, దొంగలించిన బైకులను అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Monday, April 24, 2017, 18:01 [IST]
English summary
Read In Telugu About Bengaluru Man Steals Over 50 Bikes To Fund Lovers Treatment
Please Wait while comments are loading...

Latest Photos