125సీసీ రేంజ్‌లో ఉన్న బెస్ట్ బైక్స్

దేశీయంగా 125సీసీ సామర్థ్యం ఉన్న బైకులకు డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. మరి 125సీసీ ఇంజన్ కెపాసిటీ ఉన్న బైకుల్లో బెస్ట్ మోడల్ కోసం వెతుకుతున్నారా...? మీ కోసం ఆరు అత్యుత్తమ బైకులు ఇవాళ్టి కథనంలో..

By Anil

100సీసీ బైకులను వదిలేసి ఇప్పుడు 125సీసీ మీద ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు ఇండియన్స్. అందుకు నిదర్శనం 125సీసీ సెగ్మంట్లో భారీగా పెరుగుతున్న విక్రయాలు. అయితే దేశీయంగా 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ బైకు కోరుకునే వారి కోసం ప్రత్యేక కథనం.

6. టీవీఎస్ ఫీనిక్స్

6. టీవీఎస్ ఫీనిక్స్

టీవీఎస్ మోటార్స్ ప్రారంభం నుండి తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న టూ వీలర్ల మీదే దృష్టిసారించింది. అయితే 125సీసీ సెగ్మెంట్లోకి కాస్త ఆలస్యంగా ఫీనిక్స్ పేరుతో ఓ ఉత్పత్తిని విడుదల చేసింది. అయితే పోటీదారుల దెబ్బకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు అత్యుత్తమ బైకులు

టీవీఎస్ టూ వీలర్స్ ఫీనిక్స్ బైకులో 124.53సీసీ సామర్థ్యంతో డిజిటల్ ఇగ్నిషన్ గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 10.90బిహెచ్‌పి పవర్ మరియు 10.80ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు అత్యుత్తమ బైకులు

  • లభించు వేరియంట్లు: డ్రమ్ మరియు డిస్క్,
  • మైలేజ్: 77కిమీలు
  • బరువు: 114కిలోలు
  • గరిష్ట వేగం: 96కిమీలు
  • ప్రారంభ వేరియంట్ ధర: రూ. 53,688 లు
  • 5. హీరో సూపర్ స్ల్పెండర్

    5. హీరో సూపర్ స్ల్పెండర్

    దేశీయ అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థకు మంచి విక్రయాలు సాధించిపెడుతున్న మోడల్ 99సీసీ సామర్థ్యం ఉన్న స్ల్పెండర్. దీనికి కొనసాగింపుగా 125సీసీ సెగ్మెంట్లోకి స్ల్పెండర్‌ను ప్రవేశపెట్టింది హీరో. ఈ 125సీసీ మోటార్ సైకిల్‌కు సూపర్ స్ల్పెండర్ అనే పేరును పెట్టింది.

    125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు అత్యుత్తమ బైకులు

    హీరో మోటోకార్ప్ ఈ సూపర్ స్ల్పెండర్‌లో 124.70సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ అందించింది, హీరో తమ గ్లామర్‌లో కూడా ఇదే ఇంజన్ అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 9బిహెచ్‌పి పవర్ మరియు 10.35ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

    125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు అత్యుత్తమ బైకులు

    స్ల్పెండర్ తరహా విజయాన్ని అశించి ఈ సూపర్ స్ల్పెండర్ అందుబాటులోకి తెచ్చింది హీరో, అయితే ఆశించిన మేర ఫలితాలనివ్వలేదు. దేశవ్యాప్తంగా మంచి డీలర్ షిప్ నెట్‌వర్క్ కలిగి ఉండటంతో ఎంచుకోవచ్చు.

    • మైలేజ్: 75కిమీలు
    • బరువు: 121కిలోలు
    • ప్రారంభ వేరియంట్ ధర: రూ. 56,355 లు
    • 4. బజాజ్ డిస్కవర్ 125

      4. బజాజ్ డిస్కవర్ 125

      పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో టూ వీలర్లను ఉత్పత్తి చేస్తున్న బజాజ్ తమ ఇండియా లైనప్‌లో ఖరీదైన స్పోర్టివ్ బైకుల నుండి తక్కువ సామర్థ్యం ఉన్న కమ్యూటర్ బైకుల వరకు అందుబాటులో ఉంచింది. అందులో 125సీసీ సెగ్మెంట్లోకి డిస్కవర్ బ్రాండ్ పేరుతో 125సీసీ బైకును అందుబాటులో ఉంచింది.

      125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు అత్యుత్తమ బైకులు

      సాంకేతికంగా బజాజ్ ఈ డిస్కవర్ 125 మోటార్ సైకిల్‌లో 124.6సీసీ సామర్థ్యం గల 2-వాల్వ్ డిటిఎస్-ఐ సింగల్ సిలిండర్ ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 11పిఎస్ పవర్ మరియు 10.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

      125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు అత్యుత్తమ బైకులు

      బజాజ్ డిస్కవర్ మనం చెల్లించే డబ్బుకు తగ్గ విలువైన ఉత్పత్తి అని చెప్పవచ్చు. రూరల్ ఏరియాల్లో ఇది ఘన విజయం సాధించింది.

      • లభించు వేరియంట్లు: డ్రమ్ మరియు డిస్క్,
      • మైలేజ్: 82కిమీలు
      • బరువు: 121కిలోలు
      • గరిష్ట వేగం: 100కిమీలు
      • ప్రారంభ వేరియంట్ ధర: రూ. 51,530 లు
      • 3. హీరో గ్లామర్

        3. హీరో గ్లామర్

        125సీసీ సెగ్మెంట్లో హీరో మోటోకార్ప్‌కు మంచి విక్రయాలు సాధించిపెడుతున్న మోడల్ హీరో గ్లామర్. రూరల్ ఏరియాలలో గ్లామర్ మోటార్ సైకిల్‌కు మంచి విలువ ఉంది. మైలేజ్, ఇంజన్ పనితీరు మరియు ధరకు తగ్గ విలువలను కలిగి ఉండటంతో పాటు బెస్ట్ బాడీ డిజైన్ గ్లామర్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

        125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు అత్యుత్తమ బైకులు

        హీరో మోటోకార్ప్ ఈ గ్లామర్ బైకులో 124.70సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ అందించింది. ఇది గరిష్టంగా 8.90బిహెచ్‌పి పవర్ మరియు 10.35ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. గ్లామర్ ఎస్ మరియు ఎఫ్ఐ అనే మరో రెండు వేరియంట్లతో కూడా అందుబాటులో ఉంది.

        125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు అత్యుత్తమ బైకులు

        • లభించు వేరియంట్లు: డ్రమ్ మరియు డిస్క్,
        • మైలేజ్: 55కిమీలు
        • బరువు: 129కిలోలు
        • గరిష్ట వేగం: 95కిమీలు
        • ప్రారంభ వేరియంట్ ధర: రూ. 57,003 లు
        • 2. యమహా సెల్యూటో

          2. యమహా సెల్యూటో

          జపాన్‌కు చెందిన దిగ్గజ టూ వీలర్ల తయారీ దిగ్గజం యమహా శక్తివంతమైన ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకులకు ప్రసిద్ది. అయితే 125సీసీ సెగ్మెంట్లో సెల్యూటో బైకును అందుబాటులో ఉంచింది. డిజైన్, ఇంజన్, మైలేజ్ మరియు రైడింగ్‌ వంటి అనేక అంశాల పరంగా అత్యంత నాణ్యమైన ఉత్పత్తి ఇది. అయితే ఈ సెగ్మెంట్లో సెల్యూటో ఆశించే మేర విక్రయాలు సాధించడం లేదు.

          125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు అత్యుత్తమ బైకులు

          యమహా సెల్యూటో మోటార్ సైకిల్‌లో 125సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న ఇది గరిష్టంగా 8.20బిహెచ్‌పి పవర్ మరియు 10.10ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

          125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు అత్యుత్తమ బైకులు

          • లభించు వేరియంట్లు: డ్రమ్, డిస్క్, డ్రమ్ స్పెషల్ ఎడిషన్, డిస్క్ స్పెషల్ ఎడిషన్,
          • మైలేజ్: 78కిమీలు
          • బరువు: 112కిలోలు
          • ప్రారంభ వేరియంట్ ధర: రూ. 57,705 లు
          •  1. హోండా సిబి షైన్

            1. హోండా సిబి షైన్

            స్కూటర్ల సెగ్మెంట్లో ఆక్టివా మరియు 125సీసీ బైకుల సెగ్మెంట్లో హోండా షైన్ ద్వారా మంచి విజయాన్ని సాధించింది జపాన్‌కు చెందిన టూ వీలర్ల తయారీ దిగ్గజం హోండా టూ వీలర్స్. హోండా సిబి షైన్ విజయానికి కొనసాగింపుగా సిబి షైన్ ఎస్‌పి మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇది కూడా మంచి ఫలితాలను సాధిస్తోంది.

            125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు అత్యుత్తమ బైకులు

            హోండా షైన్ మరియు షైన్ ఎస్‌పి మోటార్ సైకిళ్లలో 125సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ హోండా ఎకో టెక్నాలజీ గల ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 10బిహెచ్‌పి పవర్ మరియు 11ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

            125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు అత్యుత్తమ బైకులు

            ప్రపంచ మరియు ఇండియన్ బెస్ట్ సెల్లింగ్ 125సీసీ మోటార్ సైకిల్‌గా హోండా సిబి షైన్ రికార్డ్ సాధించింది మరియు గత ఏప్రిల్ 2017 ఒక్క నెలలోనే లక్షకు పైగా విక్రయాలు సాధించింది.

            • లభించు వేరియంట్లు: డ్రమ్, డిస్క్ మరియు సిబిఎస్,
            • మైలేజ్: 65కిమీలు
            • బరువు: 120కిలోలు
            • గరిష్ట వేగం: 100కిమీలు
            • ప్రారంభ వేరియంట్ ధర: రూ. 58,264 లు
            • తీర్పు...

              తీర్పు...

              125సీసీ సెగ్మెంట్లో బైకు కొనుగోలు చేయాలనుకునే వారికి హోండా సిబి షైన్ డీసెంట్ ఎంపిక అని చెప్పవచ్చు. హోండా ఎకో టెక్నాలజీ ద్వారా ఇది తక్కువ శబ్దాన్నిస్తుంది. మరియు రూరల్ ఏరియాల్లో మంచి విలువ ఉన్న బైకు, అదే విధంగా మంచి రీసేల్ వాల్యూ కూడా ఉంది. అయితే ధర విషయంలో కాస్త ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది.

Most Read Articles

English summary
Read In Telugu Best 125cc Bikes In India
Story first published: Saturday, May 27, 2017, 17:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X