డిసి డిజైన్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్: ధర రూ. 2.5 లక్షలు

రాయల్ ఎన్పీల్డ్ బైకులు మోడిఫికేషన్‌కు అత్యంత అనువైనవని చెప్పవచ్చు. డిసి డిజైన్ రాయల్ ఎన్పీల్డ్ శ్రేణి నుండి సేకరించిన క్లాసిక్ ను అత్యంత అరుదైన రూపంలో డిజైన్ చేసింది.

Written By:

దేశీయంగా మోడిఫికేషన్‍‌ను బిజినెస్‌గా మార్చిన ఏకైక సంస్థ డిసి డిజైన్. తయారీదారులు అందించే కార్ల పై చర్మాన్ని మరియు రూపాన్ని మార్చేసి డిసి తయారు చేసిన అనేక కార్లు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా భారీ సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. కేవలం ఫోర్ వీలర్స్ మాత్రమే కాదు టూ వీలర్లను కూడా మోడిఫై చేస్తుంది డిసి.

రాయల్ ఎన్పీల్డ్ బైకులు మోడిఫికేషన్‌కు అత్యంత అనువైనవని చెప్పవచ్చు. డిసి డిజైన్ రాయల్ ఎన్పీల్డ్ శ్రేణి నుండి సేకరించిన క్లాసిక్ ను అత్యంత అరుదైన రూపంలో డిజైన్ చేసింది.

డిసి డిజైన్ మోఢిఫై చేసిన ఈ క్లాసిక్ మోటార్ సైకిల్‌ను ధరను 2.5 లక్షలుగా నిర్ణయించింది. అంటే సాధారణ క్లాసిక్ కన్నా రూ . 76,000 ల ఎక్కువ ధరతో అందిస్తోంది.

డిసి డిజైన్ క్లాసిక్ మోటార్ సైకిల్ మోడిఫై చేసిన అనంతరం దీనికి సంభందించిన కొన్ని ఫోటోలను విడుదల చేసింది. కస్టమ్ బిల్ట్ మోడల్ కు కార్బన్ షాట్ డిసి2 అనే పేరును కూడా ఖరారు చేసింది.

పాత మరియు భవిష్యత్ కాల డిజైన్ లక్షణాలతో మోడిఫై చేసిన ఇందులో పొడవాటి ఇంధన ట్యాంకు, అద్బుతంగా మలచబడిన రియర్ డిజైన్, గుండ్రటి ఆకారంలో ఉన్న బ్యాటరీ కవర్ సైడ్ ప్యానల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. శరీరం మీద అందించిన అన్ని భాగాలు కూడా కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడ్డాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇందులో అందించిన హెడ్ ల్యాంప్ స్థానంలో రెట్రో స్టైల్లో ఎల్ఇడి లైట్ల ఇముడింపుతో గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్ కలదు. వెనుక వైపున ఉన్న టెయిల్ ల్యాంపును తొలగించి సింగల్ సీటు క్రింది భాగంలో అందివ్వడం జరిగింది.

సస్పెన్షన్, ఫ్రేమ్, హ్యాండిల్ బార్, చక్రాలు, టైర్లు, ఇంస్ట్రుమెంటేషన్, బ్రేకులు మరియు ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులకు గురవ్వలేదు.

డిసి డిజైన్ మోడిఫి చేసిన కార్బన్ షాట్ తరహాలో మీ క్లాసిక్ బైకును కూడా మోడిఫై చేయించుకోవాలంటే రూ. 76,000 లు చెల్లించాల్సి ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లోని క్లాసిక్ బైకులో 346సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 19.80బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల ఇది లీటర్‌కు 37 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. దీని గరిష్ట వేగం గంటకు 130కిలోమీటర్లుగా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ శ్రేణిలోకి రెడ్డిచ్ అనే పేరుతో మరో  మోడల్ ను విడుదల చేసింది. దీని గురించి పూర్తి వివరాలు మీకోసం....

 

కెటిఎమ్ అందించే వివిధ బైకుల ఫోటో గ్యాలరీ. వీక్షించడానికి క్రింద గల ఫోటోల మీద క్లిక్ చేయండి.....

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
DC Design Royal Enfield Classic Revealed With Retro-Futuristic Carbon Body; Worth INR 76,000
Please Wait while comments are loading...

Latest Photos