డుకాటి మోంస్టర్ 797 విడుదల: ధర, ఇంజన్, ఫోటోలు మరియు ఇతర వివరాలు...

Written By:

డుకాటి ఇండియా మోటార్ సైకిళ్ల విభాగంలోని మోంస్టర్ రేంజ్‌లో అతి చిన్న మోటార్ సైకిల్‌గా మోంస్టర్ 797 ను విపణిలోకి విడుదల చేసింది. ఇటలీలోని మిలాన్‌లో గత ఏడాది జరిగిన EICMA మోటార్ సైకిల్ షో ప్రదర్శన వేదిక మీద డుకాటి ఈ మోంస్టర్ 797 ను తొలిసారిగా ఆవిష్కరించింది.

ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

సాంకేతికంగా డుకాటి ఈ మోంస్టర్ 797 మోటార్ సైకిల్‌లో 803సీసీ సామర్థ్యం ఉన్న ఎల్-ట్విన్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 8,250ఆర్‌పిఎమ్ వద్ద 74బిహెచ్‌పి పవర్ మరియు 5,750ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 68.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీనికి 6-స్పీడ్ మ్యన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

ఫీచర్లు

డుకాటి మెంస్టర్ 797 లో ట్విన్ స్పార్ స్వింగ్ ఆర్మ్ అనుసంధానం గల సింగల్ పీస్ ట్యూబులర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ కలదు. సస్పెన్షన్ కోసం ముందువైపున 43ఎమ్ఎమ్ కయాబా అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ప్రిలోడెడ్ అడ్జెస్ట్ చేసుకునే సౌలభ్యం ఉన్న శాచ్స్ మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

బ్రేకులు

ఫ్రంట్ వీల్ మీద 4-పిస్టన్ మోనోబ్లాక్ కాలిపర్స్‌తో 320ఎమ్ఎమ్ చుట్టుకొలత ఉన్న బ్రెంబో డిస్క్ బ్రేక్ అదే విధంగా రియర్ వీల్ మీద సింగల్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్ గల245ఎమ్ఎమ్ చుట్టుకొలత ఉన్న బ్రెంబో డిస్క్ బ్రేక్ కలదు. మోంస్టర్ 797 లోని ఇరు చక్రాలకు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

వీల్స్ అండ్ టైర్స్

డుకాటి మోంస్టర్ 797 లో ఇరు వైపులా ఉన్న 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు పిరెల్లీ డియాబ్లో రోస్సొII టైర్లు 20/70 ZR17 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి.

డిజైన్

డుకాటి మోంస్టర్ శ్రేణిలో ఉన్న టాప్ వెర్షన్ మోటార్ సైకిల్ డిజైన్ తరహాలోనే ఉంది. మోంస్టర్ 821 నుండి సేకరించిన ఎల్‌సిడి ఇంస్ట్రుమెంట్ ప్యానల్ కలదు. మూడు విభిన్న రంగులైన రెడ్, స్టార్ వైట్ సిల్క్ మరియు స్టేల్త్ బ్లాక్ రంగుల్లో ఎంచుకునే అవకాశం ఉన్న ఇందులో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

పోటీ

డుకాటి మోంస్టర్ 797 మోటార్ సైకిల్ ప్రస్తుతం విపణిలో ఉన్న ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ మరియు అప్రిలియా షివర్ 900 లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Ducati Monster 797 Launched In India; Priced At Rs Rs. 7.77 Lakh
Please Wait while comments are loading...

Latest Photos