డుకాటి మల్టీస్ట్రాడా 950 విడుదల: ధర, ఇంజన్ మరియు ప్రత్యేకతలు...

Posted by:

అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో డుకాటి వారి మల్టీస్ట్రాడా శ్రేణిలో ఈ మల్టీస్ట్రాడా 950 ఎంట్రీ లెవల్ బైకును తొలుత ఇటలీలో జరిగిన 2016 EICMA మోటార్ సైకిల్ షో వేదిక మీద ప్రదర్శించింది. దీని ధర రూ. 12.60 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు డుకాటి ప్రకటించింది.

ఇంజన్, పవర్ మరియు టార్క్ వివరాలు

సాంకేతికంగా మల్టీస్ట్రాడా 950 అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లో 937సీసీ సామర్థ్యం ఉన్న ఎల్‌-ట్విన్ ఇంజన్ కలదు. 9,000ఆర్‌పిఎమ్ వద్ద 111.4బిహెచ్‌పి పవర్ మరియు 7,750ఆర్‌పిఎమ్ వద్ద 96.2ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

గేర్‌బాక్స్ మరియు డ్రైవింగ్ మోడ్స్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. మరియు ఇందులో నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, స్పోర్ట్, టూరింగ్, అర్బన్ మరియు ఎండ్యురో.

ఫీచర్లు

డుకాటి మల్టీస్ట్రాడా 950 మోటార్ సైకిల్ నందు ట్యుబులర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఛాసిస్ కలదు. ముందు వైపున పూర్తి స్థాయిలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న కెవైబి 48ఎమ్ఎమ్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున పూర్తిగా అడ్జెస్ట్ చేసుకునే సౌకర్యం ఉన్న శాచ్స్ మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

బ్రేకులు

ఫ్రంట్ వీల్ మీద 320ఎమ్ఎమ్ చుట్టుకొలత ఉన్న బ్రెంబో డిస్క్ బ్రేక్ కలదు, 4-పిస్టన్ మోనోబ్లాక్ కాలిపర్స్ ద్వారా బ్రేక్ పవర్ డిస్క్ మీద ప్రయోగించబడుతుంది. అదే విధంగా వెనుక వైపున 2-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్స్ ద్వారా బ్రేక్ పవర్ 265ఎమ్ఎమ్ చుట్టుకొలత ఉన్న బ్రెంబో డిస్క్‌కు అందుతుంది. మల్టీస్ట్రాడా 950 బైకులో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ స్టాండర్డ్‌గా అందివ్వడం జరిగింది.

టైర్లు మరియు చక్రాలు

మల్టీస్ట్రాడా శ్రేణిలోని ఎంట్రీలెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ మల్టీస్ట్రాడా 950లో ముందువైపున 19-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ చక్రాలకు పిరెల్లీ స్కార్పియన్ ట్రయల్ II 120/70 ఆర్19 టైరు కలదు. మరియు వెనుక వైపున 17-అంగుళాల చక్రానికి పిరెల్లీ స్కార్పియన్ ట్రయల్II 170/60 ఆర్17 టైర్ కలదు.

డిజైన్

డిజైన్ విషయానికి వస్తే, మల్టీస్ట్రాడా శ్రేణిలో ఉన్న 1200 బైకు నుండి సేకరించిన డిజైన్ లక్షణాలను ఇందులో అందివ్వడం జరిగింది. మరియు అడ్వెంచర్స్ కోసం గ్రౌండ్ నుండి ఎత్తులో ఉన్న ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు స్వింగ్ఆర్మ్ కలదు.

మల్టీస్ట్రాడా 950లో స్పీడ్, ఆర్‌పిఎమ్, రైడింగ్ మరియు ప్రయాణించిన మొత్తం దూరం వంటి వివరాలను తెలిపే సరికొత్త ఎల్‌సిడి ఇంస్ట్రుమెంటల్ ప్యానల్ ఇందులో అందివ్వడం జరిగింది.

పోటీ

ఈ డుకాటి మల్టీస్ట్రాడా 950 అడ్వెంచర్ మోటార్ సైకిల్ ప్రస్తుతం విపణిలో ఉన్న ట్రియంప్ టైగర్ 800 మరియు అప్రిలియా డోర్సోడ్యురో 900 లకు గట్టి పోటీనిస్తుంది.

English summary
Read In Telugu Ducati Multistrada 950 Launched In India; Priced At Rs 12.60 Lakh
Please Wait while comments are loading...

Latest Photos