హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్ 750 విడుదల ధర, ఇంజన్ స్పెసిఫికేషన్లు మరియు ఫోటోలు

Written By:

హ్యార్లీ డేవిడ్సన్ విపణిలోకి స్ట్రీట్ రాడ్ 750 మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. మునుపటి స్ట్రీట్ 750 తో పోల్చుకుంటే ఇది అత్యుత్తమ పవర్ మరియు బెటర్ హార్డ్‌వేర్‌ను కలిగి ఉంది. ధర కూడా స్ట్రీట్ 750 కన్నా స్ట్రీట్ రాడ్ 750 ధర రూ. 80,000 లు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం స్ట్రీట్ రాడ్ 750 ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 5.86 లక్షలుగా ఉంది.

సరికొత్త హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్ 750 మోటార్ సైకిల్‌ను యంగ్ అండ్ అర్బన్ రైడర్స్‌ను టార్గెట్ చేస్తూ విడుదల చేసింది. స్ట్రీట్ రాడ్ 750 చూడటానికి స్పోర్టివ్ శైలిలో సమాతరంగా, డ్రాగ్ స్టైల్ హ్యాండిల్ బార్ అందివ్వడం జరిగింది. తద్వారా ఇది అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్‌ను కల్పిస్తుంది.

స్ట్రీట్ రాడ్ 750 బైకును మూడు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, వివిడ్ బ్లాక్, చార్ కోల్ డెనిమ్ మరియు ఆలివ్ గోల్డ్. స్ట్రీట్ 750 తో పోల్చుకుంటే స్ట్రీట్ రాడ్ 750లో రైడర్‌ను భద్రంగా పట్టి ఉంచే ఆకారంలో సీటును అందివ్వడం జరిగింది. మంచి రైడింగ్ వ్యూవ్ కోసం సీటు ఎత్తును 765ఎమ్ఎమ్ వరకు పెంచడం జరిగింది.

సరికొత్త స్ట్రీట్ రాడ్ 750 మోటార్ సైకిల్‌లో 749సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్, సింగల్ ఒహెచ్‌సి, ఎనిమిది వాల్వ్‌లు గల వి-ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది స్ట్రీట్ 750 బైకు కంటే 11 శాతం ఎక్కువ పవర్ మరియు 5 శాతం ఎక్కువ టార్క్ ఉత్పత్తి చేయును.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 8,250ఆర్‌పిఎమ్ వద్ద గరిష్ట టార్క్ అదే విధంగా 4,000ఆర్‌పిఎమ్ వద్ద 62ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. స్ట్రీట్ 750తో పోల్చుకుంటే స్ట్రీట్ రాడ్ 750లో కూడా ఒకే విధమైన బోర్ మరియు స్ట్రోక్ కలదు అయినప్పటికీ నూతన బైకు ఐదు కిలోలు ఎక్కువ బరువుగా ఉంది.

సరికొత్త హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ రోడ్ 750లో అత్యాధునిక 43ఎమ్ఎమ్ అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ కలదు. వెనుక వైపున 117ఎమ్ఎమ్ ట్రావెల్ గల ట్విన్ షాక్ అబ్జార్వర్లను అందివ్వడం జరిగింది.

ఎక్కువ షాక్స్‌ను(అదుపులు) గ్రహించే విధంగా ఇందులో పొడవైన స్వింగ్ ఆర్మ్ కలదు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 205ఎమ్ఎమ్‌గా ఉంది. ముందు మరియు మరియు వెనుక వైపున 17-అంగుళాల సరికొత్త అల్లాయ్ వీల్స్ కలవు.

ముందు వైపున చక్రానికి 120/70 మరియు వెనుక వైపు చక్రానికి 160/60 ఎమ్ఆర్ఎఫ్ టైర్లను అందించారు. బ్రేకింగ్ కోసం రెండు చక్రాలకు 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులున్నాయి, అందులో ముందు దానికి స్పోర్టింగ్ డ్యూయల్-పిస్టన్ కాలిపర్స్ కలవు. అయితే స్ట్రీట్ రాడ్ 750 లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా ఇవ్వడం జరిగింది.

హ్యార్లీ డేవిడ్సన్ లైనప్‌లో స్ట్రీట్ 750 విక్రయాలు ప్రారంభించినప్పటి నుండి మొత్తం అమ్మకాల్లో 60 శాతం అమ్మకాలు సాధించింది. ప్రతి నెల కూడా సగటున 180 నుండి 200 యూనిట్ల మధ్య స్ట్రీట్ 750 అమ్మకాలు జరుగుతున్నాయి. క్రూయిజర్ ఇప్పుడు కంపెనీ యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్.

2017 స్ట్రీట్ రాడ్ 750 అమ్మకాల పరంగా మంచి ఫలితాలను కనబరిచే అవకాశం ఉంది. కొత్త ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ డిజైన్ మరియు ఎక్కువ పనితీరు కనబరిచే ఇంజన్ వంటి వాటిని ఇందులో అందించింది. దీనికి తోడు ధర కూడా రూ. 80,000 వరకు పెంచింది.

2017 స్ట్రీట్ రాడ్ 750 యొక్క బుకింగ్స్ దేశవ్యాప్తంగా ఉన్న హ్యార్లీ డేవిడ్సన్ డీలర్ల వద్ద మార్చి 15, 2017 నుండి ప్రారంభమయ్యాయి. అయితే వీటి టెస్ట్ రైడ్స్ ఏప్రిల్ 21, 2017 నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు.

మరిన్ని హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్ 750 ఫోటోలను వీక్షించేందుకు క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Harley-Davidson Street Rod 750 Launched In India; Launch Price + Photo Gallery
Please Wait while comments are loading...

Latest Photos