ఇంపల్స్ బైకును మార్కెట్ నుండి తొలగించిన హీరో మోటోకార్ప్

Written By:

భారత దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ విపణిలోని అమ్మకాల నుండి ఇంపల్స్ మోటార్ సైకిల్‌ను తొలగించింది. విక్రయ కేంద్రాల నుండి మాత్రమే కాకుండా హీరీ మోటోకార్ప్ అధికారిక వెబ్‌సైట్ నుండి శాశ్వతంగా కనమరుగు చేసింది.

హీరో మోటోకార్ప్ మొదటి సారిగా 2010లో లండన్‌లో జరిగిన ఓ వాహన ప్రదర్శన వేదిక మీద ఇంపల్స్‌ను ఆవిష్కరించింది. తరువాత 2011లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

తొలి నాళ్లలో మంచి ఫలితాలనిచ్చినప్పటీకీ, రానురాను డిమాండ్ తగ్గిపోవడంతో కొన్ని తాత్కాలికంగా ప్రొడక్షన్ కూడా నిలిపివేసింది.

అయితే చివరికి ఎలాంటి ముందస్తు సూచనలు చేయకుండా తమ అధికారిక వెబ్‌సైట్ నుండి తొలగించింది. భారతీయ తయారీదారుని నుండి వచ్చిన మొట్టమొదటి డ్యూయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్ ఇంపల్స్ కావడం ఆశ్చర్యకరం.

సాంకేతికంగా హీరో ఇంపల్స్ మోటార్ సైకిల్‌లో 149.2సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే 13బిహెచ్‌పి పవర్ మరియు 13.4ఎన్ఎమ్ టార్క్ వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

బ్రెజిల్ విపణిలో ఉన్న హోండా ఎన్ఎక్స్ఆర్ బ్రోస్ ఆధారంగా దీనిని హీరో మోటోకార్ప్ ఇంపల్స్ ‌ను డిజైన్ చేసింది. ఆఫ్ రోడింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇందులో ముందు వైపున లాంగ్ ట్రావెల్ ఉన్న ఫ్రంట్ ఫోర్క్స్, ముందు వైపున డిస్క్ వెనుక వైపున డ్రమ్ బ్రేక్ కలదు.

డిజైన్ పరంగా హీరో ఇంపల్స్ మంచి మార్కులనే పొందినప్పటికీ, ఇందులో అందించిన ఇంజన్ దీని సౌకర్యానికి ఇమడకపోవడంతో పెద్దగా సక్సెస్ కాలేదని తెలిసింది.

అయితే కొంత మంది డీలర్లు కరిజ్మాలోని 223సీసీ ఇంజన్‌తో ఈ డ్యూయల్ స్పోర్ట్ ఇంపల్స్ మోటార్ సైకిల్‌ విక్రయాలు చేపట్టడానికి సిద్దమయ్యారు. అయితే సాంకేతిక అంశాలను దృష్టిలో ఉంచుకుని హీరో మోటోకార్ప్ ఇందుకు వ్యతిరేకించింది.

ఇతరులు ఎక్కువగా చదువుతున్న కథనాలు

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకు ఫోటోలను వీక్షించండి....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Also Read In Telugu: Hero Impulse Discontinued In India; Removed From Company Website
Please Wait while comments are loading...

Latest Photos