పర్ఫామెన్స్ మరియు స్పోర్ట్స్ బైకుల మార్కెట్ మా లక్ష్యం: హీరో మోటోకార్ప్

Written By:

భారత దేశపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ భవిష్యత్ మార్కెట్ ప్రణాళికలను వివరించింది. ఇది వరకే ఉన్న తమ ఉత్పత్తులకు మరికొన్ని కొత్త మోడళ్లను చేర్చనున్నట్లు కూడా ప్రకటించింది.

హీరో మోటోకార్ప్ గత కొంత కాలంగా సుమారుగా పది మోడళ్ల వరకు మార్కెట్ నుండి తొలగించింది. వీటి స్థానంలోకి కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. అందులో భాగంగా సెప్టెంబర్ 2017 నాటికి రెండు కొత్త బైకులను విడుదల చేయనుంది.

అయితే ఆ రెండు కొత్త మోటార్ సైకిళ్ల వివరాలను వెల్లడించడానికి హీరో మోటోకార్ప్ నిరాకరించింది. నూతన ఉత్పత్తుల వివరాలు మార్కెట్ వర్గాలకు చేరకుండా గోప్యంగా ఉంచింది. అయితే తమ భవిష్యత్ ప్రణాళికలను మీడియాతో పంచుకోవడం ఇదే తొలిసారి.

హీరో మోటోకార్ప్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ, " ఈ ఏడాది పండుగ సీజన్‌లో సెప్టెంబర్ నాటికి రెండు కొత్త మోటార్ సైకిళ్లను విడుదల చేయనున్నాము మరియు వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన వేదిక మీద 200సీసీ సామర్థ్యం ఉన్న బైకును ఆవిష్కరిస్తామని" వివరించారు.

తాజా ప్రకటన మేరకు, 200సీసీ మోటార్ సైకిల్ ఎక్స్‌స్ట్రీమ్ 200ఎస్ అని తెలుస్తోంది. మిగతా రెండు మోడళ్లలో ఒకటి హెచ్ఎక్స్250ఆర్ మరియు మరొకటి మోటో స్కూటర్.

ఈ మోడళ్లను హీరో మోటోకార్ప్ ఒక్కసారిగా కూడా ఇండియన్ రోడ్ల మీద పరీక్షించలేదు. ఒకానొక సందర్భంలో హీరో ఈ కొత్త మోటార్ సైకిళ్ల మీద పనిచేస్తోందా లేదా అనే సందేహాలకు తావిస్తోంది.

స్ల్పెండర్, ప్యాసన్ లేదా హెచ్ఎఫ్ డీలక్స్ ఆధారంతో కూడా కొత్త బైకులను అభివృద్ది చేసే అవకాశం ఉంది. లేదంటే హంక్ మరియు ఎక్స్‌స్ట్రీమ్ లను బిఎస్-4 వేరియంట్లో విడుదల చేయవచ్చు.

హీరో మోటోకార్ప్ భవిష్యత్ ప్రణాళికలను అధికారికంగా వివరించడంతో, రానున్న కాలంలో హెచ్ఎక్స్250ఆర్, డేర్, జడ్ఐఆర్ మరియు ఎక్స్‌స్ట్రీమ్ 200 ఎస్ వంటి మోటార్ సైకిళ్లు దేశీయంగా విడుదల కానున్నాయి. దేశీయంగా శక్తివంతమైన మోటార్ సైకిళ్ల మార్కెట్లో పోటీ పెరగడంతో, హీరో ఈ సెగ్మెంట్ గురించి తీవ్రంగా ఆలోచించాల్సి ఉంటుంది.

English summary
Read In Telugu To know More Hero MotoCorp Reveals Its India Plans
Please Wait while comments are loading...

Latest Photos