బైక్ ట్యాక్సీ బిజినెస్ మీద కన్నేసిన హీరో మోటోకార్ప్!

Written By:

భారత దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇప్పుడు ఉబర్ సంస్థతో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తోంది. ఈ ఒప్పందానికి చెందిన చర్చలు తొలి దశలో ఉన్నట్లు తెలిసింది. దేశీయ టూ వీలర్ ట్యాక్సీ మార్కెట్‌ను లక్ష్యం చేసుకుని ఈ ఒప్పందం జరగనుంది.

ట్యాక్సీ సర్వీసులందించే ఉబర్‌తో హీరో మోటోకార్ప్ చేతులు కలిపేందుకు తీసుకుంటున్న చర్యలు మరియు చర్చలు ఇంకా మొదటి దశలో ఉన్నట్లు తెలిసింది. రెండు సంస్థలు కూడా భాగస్వామ్యంతో దేశీయ టూ వీలర్ ట్యాక్సీ మార్కెట్లో రాణించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

హీరో మోటోకార్ప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పవన్ ముంజవల్ బైకు ట్యాక్సీ రంగంలో ఇప్పటికే పెద్ద మొత్తంలోపెట్టుబడులు పెట్టారు. ఇక ఉబర్ విషయానికి వస్తే, అమెరికా తర్వాత ఉబర్‌కు ఇండియా రెండవ ముఖ్యమైన దేశం.

హీరో మోటోకార్ప్ మరియు ఉబర్ సంస్థలు అవగాహనతో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంటే ఆ సంస్థల యొక్క వ్యాపారాలు జోరందుకునే అవకాశం ఉంది.

ఈ ఒప్పందానికి సంభందించి ఎకనామిక్ టైమ్స్ వెబ్‌సైట్ ఇ-మెయిల్ ద్వారా ఇరు సంస్థలను సంప్రదిస్తే, ఉబర్ స్పందించలేదు. అయితే హీరో మోటోకార్ప్ స్పందించడానికి నిరాకరించింది. ఈ ఒప్పందం యొక్క వివరాలు వెల్లడైతే డ్రైవ్‌స్పార్త్ తెలుగు అప్‌డేట్ చేస్తుంది.

హీరో మోటోకార్ప్, దేశీయ అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. కమ్యూటర్ బైకుల మార్కెట్లో రారాజుగా వెలుగొందుతోంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Hero MotoCorp Eyeing Alliance With Uber?
Please Wait while comments are loading...

Latest Photos