ప్రపంచపు బెస్ట్ సెల్లింగ్ బైకుగా హీరో స్ల్పెండర్

ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ అమ్మకాలు జరిపే బెస్ట్ బైకుల్లో హీరో వారి స్ల్పెండర్ మొదటి స్థానంలో నిలిచింది.

By Anil

భారతదేశపు ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరోమోటోకార్ప్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మోటార్ సైకిల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. మూడవ త్రైమాసికంలో ఏకంగా 5,91,017 యూనిట్ల స్ల్పెండర్ బైకులు అమ్ముడుపోయాయి. దీంతో వరల్డ్ బెస్ట్ సెల్లింగ్ బైకుల్లో ఇది మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

 హీరో స్ల్పెండర్

వరుసగా మొదటి మరియు రెండవ త్రైమాసికంలో హోండా యాక్టివా స్కూటర్ మొదటి స్థానంలో ఉండేది. అయితే మూడవ త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ కమ్యూటర్ బైకు స్ల్పెండర్ యాక్టివా ను ఓవర్‌టేక్ చేసింది.

 హీరో స్ల్పెండర్

గణాంకాల ప్రకారం హీరో మొత్తం 5,91,017 యూనిట్ల స్ల్పెండర్ బైకులను విక్రయించగా, హోండా గరిష్టంగా 5,69,972 యూనిట్ల ఆక్టివా స్కూటర్లను విక్రయించింది. అయితే గత ఏడాది చివరిలో నోట్ల రద్దు ప్రభావం కారణంగా యాక్టివా 4.3 శాతం మరియు స్ల్పెండర్ 9.4 శాతం అమ్మకాల్లో వృద్దిని కోల్పోయాయి.

 హీరో స్ల్పెండర్

హీరో మోటోకార్ప్ మార్కెటింగ్ మరియు కస్టమర్ కేర్ అదే విధంగా సేల్స్ హెడ్ అశోక్ బాసిన్ మాట్లాడుతూ, నోట్ల రద్దు కారణంగా, డబ్బు తక్కువగా అందుబాటులో ఉండేది. ఇది దేశ ఆర్థిక రంగంపై ప్రభావం పడిన కారణంగా అమ్మకాల్లో వృద్దిని కోల్పోవడం జరిగిందని పేర్కొన్నాడు.

 హీరో స్ల్పెండర్

హీరో స్ల్పెండర్ విశయానికి వస్తే, ఇందులో 97.20సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 8.20బిహెచ్‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

 హీరో స్ల్పెండర్

హీరో మోటోకార్ప్ వారి కథనం మేరకు ఇది లీటర్‌కు 90 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. వేరియంట్ల వారీగా హీరో స్ల్పెండర్ ధరలు రూ. 53,443 లు నుండి 57,470 ల మధ్య ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

 హీరో స్ల్పెండర్

ఖరీదైన హెలికాఫ్టర్, 120 లగ్జరీ కార్లను కలిగిన గుట్కా, పాన్ మసాలా బిజినెస్‌ మేన్

ఓ సాధారణ వ్యక్తిగా వచ్చి గుట్కా బిజినెస్, ప్రారంభించి ఇప్పడు వేల కోట్లకు అధిపతి అయ్యాడు. అత్యంత ఖరీదైన 120 లగ్జరీ కార్లను మరియు హెలికాఫ్టర్‌ను కలిగి ఉన్నాడు. గుట్కా తినే ప్రతి వ్యక్తి చదవాల్సిన కథనం.

 హీరో స్ల్పెండర్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ దేశీయంగా జి310ఆర్ మోటార్ సైకిల్‌ను ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకుల సెగ్మెంట్లోకి విడుదల చేయనుంది. బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ మోటార్ సైకిల్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.....

Most Read Articles

English summary
World’s Largest Selling Two-Wheeler Revealed — The Icon Is Still Splendid As Always
Story first published: Thursday, March 2, 2017, 10:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X