రూ. 12.90 లక్షల ధర గల ఆఫ్రికా ట్విన్ బుకింగ్స్ ప్రారంభించిన హోండా

Written By:

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బైకు రానే వచ్చింది - హోండా టూ వీలర్స్ తమ అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఆఫ్రికా ట్విన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హోండా టూ వీలర్ డీలర్లు ఆఫ్రికా ట్విన్‌పై బుకింగ్స్ ఆహ్వానిస్తున్నారు.

మేకిన్ ఇండియా ప్రేరణతో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ దేశీయంగా తయారు చేసిన ఈ ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ ధరను రూ. 12.90 లక్షలుగా నిర్ణయించింది.

హోండా సిఆర్ఎఫ్1000ఎల్ అనే పేరుతో పిలువబడే ఈ ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లో సాంకేతికంగా 1000సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. హోండా దేశీయంగా తయారు చేస్తున్న మొదటి 1000సీసీ బైకు కూడా ఇదే.

డిసిటి అనే ఒకే ఒక్క వేరియంట్‌తో మాత్రమే దీనిని అందుబాటులో ఉంచింది. కేవలం మొదటి 50 మందికి మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు హోండా టూ వీలర్ల విభాగం పేర్కొంది. తొలుత బుక్ చేసుకున్న 50 మంది ఔత్సాహికులు దీని విడుదల వేదిక మీద కలుసుకోనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న 22 నగరాల్లో ఉన్న 22 హోండా డీలర్ల వద్ద ఆఫ్రికా ట్విన్ అందుబాటులో ఉంది. అడ్వెంచర్ రైడింగ్స్ కోసం రూపొందించిన దీనిని విక్టరీ రెడ్ అనే సింగల్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే సెలక్ట్ చేసుకోగలరు.

హోండా ఆఫ్రికా ట్విన్ సిఆర్ఎఫ్1000ఎల్ లో శక్తివంతమైన 998సీసీ సామర్థ్యం ఉన్న లిక్విడ్‌ కూలింగ్ సిస్టమ్ గల ప్యార్లల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ఇంజన్ ఉత్పత్తి చేసే 93బిహెచ్‌పి పవర్ మరియు 98ఎన్ఎమ్ గరిష్ట టార్క్ వెనుక చక్రానికి సరఫరా చేయును.

డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ అనగా ? - ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తరహాలోనే ఉంటుంది, కానీ తానంతట తానుగా గేర్లను మార్చదు, ఈ తరహా గేర్‌బాక్స్‌లలో హ్యాండిల్ వద్ద ప్లస్ మరియు మైనస్ అనే రెండు బటన్‌లు ఉంటాయి. వీటిలో ప్లస్ బటన్ నొక్కితే గేరు పెంచుకోవడం, మైనస్ నొక్కితే గేరును తగ్గించుకోవడం చేయవచ్చు.

ఉపయోగం - అడ్వెంచర్ మోటార్ సైకిళ్లలో రైడింగ్ చాలా కష్టంగా ఉంటుంది. గేర్ల మార్పిడి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాళ్లతో గేర్‌బాక్స్‌ను ఆపరేట్ చేయకుండా సులభంగా మీటనొక్కితే గేర్లు మార్పిడి జరిగే వ్యవస్థ ఇది. ఇందులో క్లచ్ ప్రెస్ చేయాల్సిన అవసరం ఏ మాత్రం ఉండదు.

హోండా ఆఫ్రికా ట్విన్ ఆడ్వెంచర్‌ బైకులో ముందువైపున లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ గల ఫ్రంట్ ఫోర్క్స్ ఉన్నాయి. మరియు అడ్వెంచర్స్‌కు అత్యంత అనువైన బాడీ డిజైన్ దీని ప్రత్యేకత.

కేవలం అవసరం ఉన్నపుడు మాత్రమే ఉపయోగించుకునే వీలుగల యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు హోండా సెలక్టబుల్ టార్క్ కంట్రోల్ వంటి అతి ప్రధానమైన ఫీచర్లు ఉన్నాయి.

Read more on: #హోండా #honda
English summary
Read In Telugu Honda Africa Twin Price, Bookings And More Details
Please Wait while comments are loading...

Latest Photos