1958లో విడుదలైన కబ్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో మళ్లీ విడుదల చేయనున్న హోండా

Written By:

జపాన్ పరిజ్ఞానంతో, ఆసియా దేశాలకు చెందిన కొన్ని విడి భాగాలతో దశాబ్దాల క్రితం హోండా స్కూటర్స్ కొన్ని స్కూటర్లను తయారు చేసేది. 1958లో హోండా విడుదల చేసిన కబ్ అనే స్కూటర్లు అప్పట్లో ఉన్న బిజీ రోడ్ల మీద చక్కర్లుకొట్టేవి.

పెట్రోల్ ఇంజన్ మరియు ఎక్కువ పొగను వెదజల్లుతుందనే కారణం చేత కొంత కాలం తరువాత హోండా కబ్ స్కూటర్‌కు శాస్వతంగా ముగింపు పలికింది. అయితే తమ కబ్ స్కూటర్‌ను మళ్లీ ప్రవేశపెడుతున్నామంటూ హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు సిఇఒ టకహిరొ హచిగో వెల్లడించారు.

కానీ ఈ సారి పెట్రోల్ ఇంజన్‌లో కాకుండా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అభివృద్ది చేస్తున్నాము. కాబట్టి ఇకమీదట మార్కెట్ నుండి తొలగించే అవకాశం ఉండదని మరియు 2018 నాటికి ఉత్పత్తి చేసి విపణిలోకి ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నాడు.

సరిగ్గా రెండేళ్ల క్రితం హోండా ఈ ఇవి కబ్ స్కూటర్‌ను కాన్సెప్ట్ దశలో ప్రదర్శించింది. 2016 లో హచిగో చేసిన ప్రకటన ప్రకారం అప్పట్లోనే దీని ప్రొడక్షన్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టకహిరొ హచిగొ తాజాగ చేసిన ప్రకటన ప్రకారం 2018 నుండి ఎలక్ట్రిక్ స్కూటర్‌ సెగ్మెంట్లోకి విడుదల కానుంది.

హోండా టూ వీలర్స్ మరిన్ని ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ స్కూటర్లను అభివృద్ది చేయనుంది. జపాన్‌లో తపాళా అవసరాల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించనుంది. వీటిని పోస్టాఫీసులోనే ఛార్జింగ్ చేసుకునే విధంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది హోండా. ఖాళీ అయిపోన బ్యాటరీలను తొలగించి వాటి స్థానంలో ఫుల్ ఛార్జ్ ఉన్న వాటినిఉపయోగించే సౌలభ్యం కల్పించనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అభివృద్ది చెందిన మార్కెట్లకు ఎప్పుడు ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల అవసరం ఎంతో ఉంది. కాబట్టి అలాంటి మార్కెట్లలో హోండా ఇవి కబ్ స్కూటర్ బాగా రాణించే అవకాశం ఉంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో పట్టును సాధించేందుకు హోండా మరిన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్లను అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read more on: #హోండా #honda
English summary
Read In Telugu Honda Electric Scooter Scheduled For Production
Please Wait while comments are loading...

Latest Photos