వేలంలో 10 లక్షలకు అమ్ముడైన జనతా గ్యారేజ్ బైకు

Written By:

ప్రకృతిని కథగా తీసుకుని కొరటాల శివ దర్శకత్వం వహించిన జనతా గ్యారేజ్ సినిమా పెద్ద హిట్ అవ్వడం అందరికీ తెలిసిందే. కథ, కథనం పరంగానే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా మంచి సక్సెస్ సాధించింది. సినిమా గురించి అటుంచితే ఇందులో ఎన్‌టీఆర్ ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకు గుర్తుందా... ఆ బైకును మంగళవారం నాడు జనతా గ్యారేజ్ బృందం వేలం వేసారు.

గ్రీన్ కలర్‌లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైకును రూ. 10 లక్షల రుపాయలకు రాజ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వేలంలో దక్కించుకున్నాడు. గతంలో జనతా గ్యారేజ్ బృందం ఈ బైకుకు వేలం నిర్వహించనున్నట్లు పలుమార్లు వెల్లడించారు.

బైకు అమ్మగా వచ్చిన మొత్తాన్ని బసవతారకం ఛారిటబుల్ ట్రస్టుకు అందించినట్లు సమాచారం. ఈ వేలం క్యార్యక్రమంలో చిత్ర హీరో జూనియర్ ఎన్‌టీఆర్, దర్శకుడు కొరటాల శివ మరియు చిత్రం బృందం నుండి పలువురు పాల్గొన్నారు.

జనతా గ్యారేజ్ సక్సెస్ విశయానికి వస్తే, కొరటాల శివ ఎంచుకున్న కథనం మరియు అతని దర్శకత్వం ప్రధానంగా కలిసొచ్చాయి అని చెప్పవచ్చు. ప్రభాస్ తో మిర్చి గా మొదటి మరియు మహేష్ బాబుతో శ్రీమంతుడు కథతో రెండవ అదే విధంగా ఎన్‌టీఆర్ తో మూడువ చిత్రం జనతా గ్యారేజ్ తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ పొందాడు.

అంతే జనతా గ్యారేజ్ చిత్రంలో మలయాళ విలక్షణ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించడం. సమంత మరియు నిత్య మీనన్ ఇద్దరూ హీరోయిన్లు ఇలా కథలోకి ఎంచుకున్న అన్ని పాత్రలు వాటి స్థాయికి తగ్గట్లుగా న్యాయం చేయడం కూడా కలిసొచ్చింది.

మంగళ వారం(08 మార్చి, 2017) నాడు జనతా గ్యారేజ్ బృందం హైదరాబాద్‌లో నిర్వహించిన వేలం పాటలో రాజ్ కుమార్ రెడ్డి అనే ఎన్‌టిఆర్ అభిమాని ఈ బైకును సొంతం చేసుకున్నాడు.

మొత్తం పది లక్షల రుపాయలను బసవతారకం ఛారిటబుల్ ట్రస్టుకు ఇస్తున్నట్లు ఉన్న చెక్కును జనతా గ్యేరేజ్ బృందానికి అందించాడు.

ఒక చిత్రానికి లేదా ఒక నటుడికి ఉన్న అభిమానంతో తమ వస్తువులకు వేలం నిర్వహించి, వాటి ద్వారా వచ్చిన సొమ్మును విరాళంగా ట్రస్టులకు ఇవ్వడం తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా ఇదే తొలిసారి కావచ్చు.

బైకు విషయానికి వస్తే, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ శ్రేణిలో ఉన్న క్లాసిక్ 500 మోటార్ సైకిల్. ఇందులో 499సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్, డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ గల పెట్రోల్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 5,250ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద గరిష్టంగా 27.20బిహెచ్‌పి పవర్ మరియు 4,000ఆర్‌పిఎమ్ వద్ద 41.30ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

గంటకు 131కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే దీని మైలేజ్ లీటర్‌కు 32 కిలోమీటర్లుగా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ దీని క్లాసిక్ తాన్, క్లాసిక్ బ్లాక్ మరియు క్లాసిక్ సిల్వర్ వంటి రంగుల్లో అందించింది. అయితే జనతా గ్యారేజ్ బృందం దీనిని గ్రీన్ కలర్‌లో రూపొందించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500(స్టాండర్డ్ వేరియంట్) ఆన్ రోడ్ హైదరాబాద్ వేరియంట్ ధర రూ. 1,92,952 లుగా ఉంది.

జనతా గ్యారేజ్ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పుడే చిత్రం పేరుతో మైక్రో వెబ్‌సైట్(janathagarage.com) ప్రారంభించారు. ఈ సైట్లో చిత్రానికి సంభందించిన ఫోటోలతో పాటు వేలం వివరాలను కూడా పొందుపరిచారు...

 

English summary
Janatha Garage Bike Auction
Please Wait while comments are loading...

Latest Photos