భారీ డిస్కౌంట్లు ప్రకటించిన కవాసకి ఇండియా

Written By:

బైక్అడ్వైస్ అనే వెబ్‌సైట్ తెలిపిన వివరాలు మేరకు. ముంబాయ్ లోని అంజెన్ కవాసకి డీలర్ తమ లైనప్‌లో ఉన్న ఇఆర్-6ఎన్ మోటార్ సైకిల్ యొక్క ఆన్ రోడ్ ధర మీద రూ. 93,000 ల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు తెలిసింది.

బైక్అడ్వైస్ అనే వెబ్‌సైట్ తెలిపిన వివరాలు మేరకు. ముంబాయ్ లోని అంజెన్ కవాసకి డీలర్ తమ లైనప్‌లో ఉన్న ఇఆర్-6ఎన్ మోటార్ సైకిల్ యొక్క ఆన్ రోడ్ ధర మీద రూ. 93,000 ల వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిసింది.

కేవలం ముంబాయ్‌లో మాత్రమే కాదు, దేశీయంగా ఉన్న పలు కవాసకి విక్రయ కేంద్రాలను ఈ విశయమై డ్రైవ్‌స్పార్క్ ఆరా తీసింది. అన్ని డీలర్లు కూడా ఇఆర్-6ఎన్ మీది క్యాష్ డిస్కౌంట్లు ప్రకటించినట్లు వ్యక్తమయ్యింది.

భారీ మొత్తంతో డిస్కౌంట్ ప్రకటించడానికి గల కారణం మీద దృష్టి పెడితే, లైనప్‌లో ఉన్న ఈ మోటార్ సైకిళ్లలో బిఎస్-III ఇంజన్‌లు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2017 తర్వాత అన్ని మోటార్ సైకిళ్లలో బిఎస్-IV ఇంజన్ అందివ్వడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో పాత స్టాక్ విక్రయించేందుకు డీలర్లు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.

కవాసకి కూడా గతంలో ఓ ప్రకటన చేసింది. తమ ఇఆర్-6ఎన్ మోటార్ సైకిల్‌ను ప్రపంచ వ్యాప్తంగా జడ్650తో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. స్టాక్ మొత్తాన్ని పూర్తి చేయడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పవచ్చు.

కవాసకి ఇఆర్-6ఎన్ మోటార్ సైకిల్‌లో 649సీసీ సామర్థ్యం గల ఫోర్ స్ట్రోక్ ప్యార్లల్ ట్విన్ సిలిండర్(రెండు సిలిండర్ల) ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 72బిహెచ్‌పి పవర్ మరియు 64ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

కవాసకి ఇఆర్-6ఎన్ మోటార్ సైకిల్ ధర రూ. 5,34,573 లు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉంది. కవాసకి మోటార్ సైకిళ్ల ఫోటోల కోసం.....

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Kawasaki Offering Massive Discounts On ER-6n — The Best Deal of The Year?
Please Wait while comments are loading...

Latest Photos