రెండు తునకలైన కవాసకి నింజా 250ఆర్ స్పోర్ట్స్ బైకు

Written By:

గరిష్ట వేగంతో ప్రయాణించడం లేదా రైడింగ్ చేయడం ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో...అంతే ప్రమాదకరమైనది. మితిమీరిన వేగంతో ర్యాష్ డ్రైవింగ్/రైడింగ్ లకు ఖచ్చితంగా ఒక ప్రమాదం ముగింపు పలుకుతుంది. ఇందుకు తాజా ఉదాహరణ పంజాబ్‌లోని లుథియానాలో చేటుచేసుకున్న ప్రమాదం. 150 కిమీల మితిమీరిన వేగంతో ప్రయాణించిడం ద్వారా నలుగురు యువకులు మరణించారు.

అయితే ఇది మరో ప్రమాదం, దీనికి కూడా మితిమీరిన వేగమే కారణం. అయితే మోటార్ సైకిల్‌. ఈ ప్రమాదం ప్రభావం ఎంతలా ఉందంటే ప్రమాదానంతరం బైకు రెండు ముక్కలైపోయింది.

ఇండోనేషియాలో జరిగిన ఈ ప్రమాదానికి ముందు ఐదు మంది రైడర్లు తమ సుప్రా ఎక్స్125, ఎక్స్-రైడ్, మియా జె, ఎన్-మ్యాక్స్ 155 మరియు నింజా 250 మోటార్ సైకిళ్లతో రైడింగ్ ప్రారంభించారు. అయితే నింజా 250 బైకు రైడర్ అధిక వేగం వద్ద కంట్రోల్ తప్పాడు.

భారీ వేగం వద్ద అదుపు తప్పడంతో ఫ్రంట్ సస్పెనన్షన్ నుజ్జునుజ్జయిపోయింది. దీంతో బైకు నేలను తాకి రెండు తునకలైపోయింది. అయితే ఈ ప్రమాదంలో రైడర్ ప్రాణాలు దగ్గించుకోలేకపోయాడు.

ప్రయాణానంతరం సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలంటే రహదారి హెచ్చరికలను గమనించడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడంతో పాటు వేగాన్ని నియంత్రించుకుంటూ పరిమిత వేగంతో ప్రయాణించడం ఎంతో ముఖ్యం అని చెప్పవచ్చు.

  

English summary
Kawasaki Ninja 250R Split in Half After a Freak Accident; Rider Killed
Please Wait while comments are loading...

Latest Photos