రూ. 22 లక్షల విలువైన బైక్‌ను ఇండియాలోకి విడుదల చేసిన కవాసకి

Written By:

కవాసకి ఇండియా దేశీయంగా దాదాపు రూ. 22 లక్షల విలువైన మోటార్ సైకిల్‍‌ను విడుదల చేసింది. ఇది జడ్ఎక్స్-10ఆర్ మరియు జడ్ఎక్స్-10ఆర్ఆర్ వేరియంట్లలో పూనే షోరూమ్‌లో విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 500 యూనిట్లను మాత్రమే లిమిటెడ్ ఎడిషన్‌గా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

కవాసకి ఈ జడ్ఎక్స్-10ఆర్ఆర్ మోటార్ సైకిల్‌ను 2016 ఇంటర్‌మోట్ మోటార్ సైకిల్ షో వేదిక మీద తొలిసారిగా ప్రదర్శించింది. ఇది వింటర్ ఎడిషన్ మ్యాట్ బ్లాక్ పెయింట్ ఆప్షన్ మరియు సింగల్ సీట్ సాడిల్‌తో అందుబాటులో ఉంది.

కవాసకి జడ్ఎక్స్-10ఆర్ఆర్ మోటార్ సైకిల్‌లో 998సీసీ సామర్థ్యం గల లిక్విడ్‌తో చల్లబడే నాలుగు సిలిండర్ల ఇంజన్ కలదు.

ఇది 200బిహెచ్‌పి పవర్ మరియు 113.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం చేయబడింది.

ఈ మోటార్ సైకిల్‌లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఆరు అక్షాల పరంగా వాహనం యొక్క కదలికల వివరాలను సేకరించే బాష్ సంస్థకు చెందిన ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనట్ కలదు.

అంతే కాకుండా ఇందులో కవాసకి క్విక్ షిప్టర్ సిస్టమ్ కలదు, దీని ద్వారా క్లచ్ వినియోగించకుండానే గేర్‌ షాఫ్ట్ ను పైకి మరియు క్రిందికి ఆప్‌రేట్ చేయవచ్చు.

కవాసకి తమ జడ్ఎక్స్-10ఆర్ఆర్ మోటార్ సైకిల్‌లో మార్చెసిని సెవెన్ స్పోక్ ఫోర్జ్ అల్యూమినియం వీల్స్ అందించింది, వీటికి పిరెల్లీ డియాబ్లో సూపర్ కోర్సా ఎస్‌పి టైర్లను అందివ్వడం జరిగింది.

జపాన్‌లోని కుమంటోలో ఉన్న ఆటో పోలిస్ టెస్ట్ ట్రాక్ యొక్క స్టాండర్డ్ వేరియంట్ కన్నా ఇది రెండు సెకండ్ల అత్యంత వేగవంతమైనదని కవాసకి వెల్లడించింది. కోట పన్నెండు లక్షలు విలువైన డుకాటి 1299 సూపర్ లెగ్గెరా మోటార్ సైకిల్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

 

English summary
Kawasaki ZX-10RR Launched In India; Priced At Rs 21.9 Lakh
Please Wait while comments are loading...

Latest Photos