కైనెటిక్ నుండి ఇటాలియన్ ఎస్‌డబ్ల్యూఎమ్ మోటార్ సైకిళ్లు

కైనెటిక్, Kinetic

Written By:

హోండా స్కూటర్లు మరియు మోపెడ్ విభాగం నుండి వేరుపడి ప్రధానమైన విడిభాగాల తయారీ సంస్థగా కైనెటిక్ ఉరకలు వేయనుంది. ఈ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ చైన్ రిటైలింగ్ వ్యాపారంలో మోటోరాయలె బ్రాండ్ పేరుతో అత్యంత శక్తివంతమైన టూ వీలర్ల తయారీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

మోటోరాయలె బ్రాండ్ ప్రస్తుతం ఎమ్‌వి అగస్టా మోటార్ సైకిళ్లను తయారు చేసి, దేశీయంగా విక్రయాలు చేపడుతోంది. మోటోరాయలె బ్రాండ్ ను విస్తరించేందుకు ఇదే గొడుగు క్రిందకు మరో ఇటాలియన్ టూవీలర్ల తయారీ సంస్థ ఎస్‌డబ్ల్యూఎమ్ మోటార్స్ ను చేర్చనుంది.

ఇండియన్ మార్కెట్లోకి మోటోరాయలె విభాగంలోకి విభిన్న బ్రాండ్లను చేర్చి మల్టీ బ్రాండ్ మోటార్ సైకిల్ బ్రాండ్‌గా మార్చే ఆలోచనలో ఉన్నట్లు కెనటిక్ పలు ధపాలు పేర్కొంది.

కైనెటిక్ మోటోరాయల్ చైన్ విధానం క్రింద దేశీయంగా పరిచయం చేయనున్న ఎస్‌డబ్ల్యూఎమ్ మోటార్ సైకిల్స్ విషయానికి వస్తే, 1970 లో పైరో సిరోని మరియు ఫాస్టో వెర్జాని అనే ఇద్దరు వ్యక్తుల చేత ప్రారంభించబడింది.

1970 మరియు 1980 ల కాలంలో ఈ సంస్థ ట్రయల్స్, ఎండ్యురో, మోటోక్రాస్ మరియు ఆఫ్ రోడ్ మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసింది.

2014 లో జరిగిన ఎకిమా మోటార్ షో వాహన ప్రదర్శన వేదిక మీద తమ రీ ఎంట్రీని ఖరారు చేసింది. మార్కెట్లోకి మళ్లీ తమ ఉత్పత్తులతో రానున్నట్లు ఎస్‌డబ్ల్యూఎమ్ మోటార్ సైకిల్స్ సంస్థ తెలిపింది.

2014 ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద ఆరు స్ట్రీట్ మరియు ఆఫ్ రోడ్ బైకులను ప్రదర్శించింది. వీటి ఇంజన్ సామర్థ్యం 300సీసీ నుండి 650సీసీ మధ్య ఉంది.

ప్రస్తుతం కైనెటిక్ దేశీయంగా మోటోరాయలె బ్రాండ్ క్రింద, గ్రాన్ మిలానో మరియు సిల్వర్ వాస్ అనే మోడళ్లను తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఈ రెండు మోటార్ సైకిళ్లు ఎస్‌డబ్ల్యూ మోటార్ సైకిల్ సంస్థ యొక్క క్లాసిక్ ఉత్పత్తులుగా పేరుగాంచాయి.

కేఫె రేసర్ తరహాలో ఉన్నటువంటి వెర్షన్ వీటిలో 445.6సీసీ సామర్థ్యం గల గాలితో మరియు ఆయిల్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 29.54బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుతం కెనటిక్ మోటోరాయలె గొడుగు క్రింద ఇప్పటి వరకు 13,000 సూపర్ బైకుల అమ్మకాలు చేపట్టింది. 2020 నాటికి 20,000 బైకుల అమ్మకాల మైలురాయిని తాకే అవకాశం ఉంది. ఏడాది 140 లక్షల బైకుల అమ్ముడుపోయే ఇండియాలో ఇది చాలా చిన్న సంఖ్యే.

ఎస్‌డబ్ల్యూఎమ్ బైకుల అంతగా నచ్చడం లేదా... అయితే కైనెటిక్ మోటోరాయలె విక్రయిస్తున్న ఎమ్‌వి అగస్టా డ్రాగ్‌స్టర్ బ్లాక్అవుట్ ఫోటోలు వీక్షించండి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Kinetic Might Launch SWM Bikes In India
Please Wait while comments are loading...

Latest Photos