డ్యూక్ 200 తో పాటు డ్యూక్ 250 మరియు 390 లను విడుదల చేసిన కెటిఎమ్

ఆస్ట్రియన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కెటిఎమ్ ఇండియా విభాగం, దేశీయంగా మూడు మోటార్ సైకిళ్లను విడుదల చేసింది. 2017 డ్యూక్ 200 మరియు 390 తో పాటు కొత్తగా డ్యూక్ 250 బైకును పరిచయం చేసింది

By Anil

కెటిఎమ్ ఇండియా ఇది వరకే ఉన్న డ్యూక్ 200 మోటార్‍‌ సైకిల్‌కు అప్‌గ్రేడ్స్ నిర్వహించి 2017 కెటిఎమ్ డ్యూక్ 200 గా విడుదల చేసింది. అనేక మార్పులు చేర్పులతో దేశీయ విక్రయ కేంద్రాలకు చేరిన దీని ధరను కూడా సవరించింది. దీనితో పాటు కెటిఎమ్ డ్యూక్ 390 మరియు నూతన మోడల్ డ్యూక్ 250 బైకులను విడుదల చేసింది.

కెటిఎమ్ డ్యూక్ 200

ఎక్ట్సీరియర్ మీద కాస్మొటిక్ మార్పులకు గురైన నూతన కెటిఎమ్ డ్యూక్ 200 వేరియంట్ ధర రూ. 1.43 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.

కెటిఎమ్ డ్యూక్ 200

డ్యూక్ 200 మోడల్ చాలా కాలంగా దేశీయ మార్కెట్లో కొనసాగుతూ వస్తోంది. కెటిఎమ్‌కు మంచి విక్రయాలు సాధించిపెడుతున్న వాటిలో డ్యూక్ 200 మోడల్ ఒకటి. ఈ అప్‌గ్రేడెడ్ మోడల్ నందు ఊహించి ఫీచర్లను అందివ్వడం కెటిఎమ్ విఫలం చెందింది.

డ్యూక్ 200 సాంకేతిక వివరాలు

డ్యూక్ 200 సాంకేతిక వివరాలు

సాంకేతికంగా 2017 డ్యూక్ 200 వేరియంట్లో 200సీసీ సామర్థ్యం ఉన్న లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. నూతన ఉద్గార నియమాలను పాటించే ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేయడం జరిగింది.

కెటిఎమ్ డ్యూక్ 200

అధునాతన 200సీసీ ఇంజన్ గరిష్టంగా 25బిహెచ్‌పి పవర్ మరియు 19ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

కెటిఎమ్ డ్యూక్ 200

ఇందులో రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ముందు వైపున ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స, వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ మరియు నూతన డిజైన్‌లో ఉన్న హెడ్ ల్యాంప్ కలదు.

కెటిఎమ్ డ్యూక్ 200 పోటీదారులు

కెటిఎమ్ డ్యూక్ 200 పోటీదారులు

ప్రస్తుతం విపణిలో ఉన్న టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200, బజాజ్ ఎన్ఎస్ 200 మరియు 200సీసీ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

కెటిఎమ్ డ్యూక్ 200

నేడు (23/02/2017) కెటిఎమ్ ఇండియా 2017 డ్యూక్ 200 తో పాటు మరో రెండు మోటార్ సైకిళ్లను కూడా విడుదల చేసింది.

  • కెటిఎమ్ డ్యూక్ 2017 డ్యూక్ 390 విడుదల వివరాలు.....
  • కెటిఎమ్ డ్యూక్ 250 విడుదల వివరాలు....

Most Read Articles

English summary
2017 KTM Duke 200 Launched In India; Priced At Rs 1.43 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X