2017 పల్సర్ 220 లో నూతన అప్‌డేట్స్

దేశీయ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ పల్సర్ 220 మోడల్‍‌‌కు కొన్ని కొత్త అప్‌డేట్స్ నిర్వహించింది. ఇంజన్ మరియు బాడీ పరంగా ఈ అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి.

By Anil

బజాజ్ ఆటో 2017 ఎడాదితో తమ లైనప్‌లో ఉన్న దాదాపు అన్ని మోడళ్లను బిఎస్-IV ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్‌తో అప్‌డేట్ చేసింది. అయితే 2017 పల్సర్ 220 మోడల్ బైకులో మరో సారి అప్‌డేట్స్ నిర్వహించింది.

బజాజ్ పల్సర్ 220

2017 పల్సర్ 220 మోడల్ లభించే రెడ్ మరియు బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్ మీద నూతనంగా తెలుపు రంగులో ఉన్న గ్రాఫిక్స్ అందించింది మరియు ఇంజన్‌లో స్వల్ప మార్పులు చేసి మునుపు ఉత్పత్తి చేసే పవర్‌ ను కాస్త తగ్గించింది.

బజాజ్ పల్సర్ 220

బజాజ్ లైనప్‌లో పల్సర్ 220 మోడల్ చాలా కాలంగా ఉంది. అయినప్పటికీ ఆశించిన మేర ఫలితాలను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు, చేర్పలతో దీనికి అప్‌‌డేట్స్ నిర్వహించి అమ్మకాలను పెంచుకునే ప్రయత్నం చేసింది.

బజాజ్ పల్సర్ 220

పల్సర్ 220 లో తాజా ఇంజన్ అప్‌డేట్స్ ప్రకారం, 0.12 బిహెచ్‌పి పవర్ మరియు 0.57ఎన్ఎమ్ టార్క్‌ను తగ్గిచడం జరిగింది. అంటే ప్రస్తుతం ఈ మోడల్ గరిష్టంగా 20.963బిహెచ్‌పి పవర్ మరియు 18.55ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బజాజ్ పల్సర్ 220

పవర్ మరియు టార్క్ పరంగా జరిగిన మార్పులు మినహాయిస్తే, మెకానికల్‌గా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. మార్కెట్లో ఇదొక్కటే కాదు, బిఎస్-IV ఇంజన్‌తో వచ్చిన యూనికార్న్ 150 మరియు సిబి హార్నెట్ 160ఆర్ మోడళ్లలో కూడా పవర్ మరియు టార్క్‌‌ను కుదించడం జరిగింది.

బజాజ్ పల్సర్ 220

సాంకేతికంగా 2017 బజాజ్ పల్సర్ 220 బైకులో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే 220సీసీ సామర్థ్యం ఉన్న ఆయిల్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

బజాజ్ పల్సర్ 220

2017 బజాజ్ పల్సర్ 220 బైకులో ఇరు వైపులా డిస్క్ బ్రేకులు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ కలవు. మరియు ఎగ్జాస్ట్ పైపు మీద బ్లాక్ క్యానిస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది.

బజాజ్ పల్సర్ 220

హైదరాబాద్ లో స్టాండర్ వేరియంట్ బజాజ్ పల్సర్ 220 ఆన్ రోడ్ ధర రూ. 1,05,996 లుగా ఉంది. (వివిధ షోరూమ్ లతో పోల్చుకుంటే ధరలలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది).

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Read In Telugu 2017 Bajaj Pulsar 220 Gets New Updates
Story first published: Friday, May 26, 2017, 13:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X