2017 డియో స్కూటర్ స్కూటర్ విడుదల: ధర రూ. 49,132 లు

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ దేశీయ మార్కెట్లోకి 2017 డియో స్కూటర్ విడుదల చేసింది. సరికొత్త డియో గురించి మరిన్ని విడుదల వివరాలు నేటి కథనంలో తెలుసుకుందాం రండి...

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ హోండా టూ వీలర్స్ ఇండియా విభాగం, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్(HMSI) విపణిలోకి 2017 డియో స్కూటర్‌ను రూ. 49,132 ల ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది.

ఏప్రిల్ 1, 2017 లోపు అన్ని టూ వీలర్లను కూడా బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌తో మాత్రమే విక్రయించాలనే నియమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా హోండా తమ డియోలో బిఎస్-IV ఇంజన్‌ను అందించి విడుదల చేసింది.

2017 డియో స్కూటర్‌లో డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ వంటి ఫీచర్లను హోండా పరిచయం చేసింది.

సరికొత్త 2017 హోండా డియో స్కూటర్‌ను కస్టమర్లు ఐదు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి,

  • పర్ల్ స్పోర్ట్స్ యెల్లో,
  • వైబ్రంట్ ఆరేంజ్,
  • స్పోర్ట్స్ రెడ్,
  • మట్టీ ఆక్సిస్ గ్రే మెటాలిక్ మరియు
  • క్యాండీ జాజ్ బ్లూ వంటి రంగులు.

సరికొత్త 2017 డియో స్కూటర్‌లో 109.19సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ బిఎస్-IV ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.91ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలదు.

ఈ స్కూటర్ మొత్తం బరువు 103కిలోలుగా ఉంది, ఇందులోని అదనపు ప్రధానమైన ఫీచర్లు కాంబి బ్రేక్ సిస్టమ్, ట్యూబ్ లెస్ టైర్లు మరియు 5.3 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు.

యువ కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని విభిన్న కలర్ ఆప్షన్‌లలో 2017 డియో స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యమహా రేజడ్ఆర్ స్కూటర్‌కు బలమైన పోటీనివ్వనుంది. ముందు వైపు ఉండే బాడీ మౌంటెడ్ హెడ్ ల్యాంప్ డిజైన్ రెండింటిలో ఒకేలా ఉంటుంది.

WHAT OTHERS ARE READING

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Also Read In Telugu - Honda Launches The 2017 Dio With BS-IV Engine In India — Priced At Rs 49,132
Please Wait while comments are loading...

Latest Photos

LIKE US ON FACEBOOK