Just In
- 19 min ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 1 hr ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 3 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 4 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
Don't Miss
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- News సీట్ల మార్పులో బీజేపీ కొత్త ట్విస్ట్- చంద్రబాబు నిర్ణయం ఏంటి..!!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Sports రోహిత్‌పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Movies ‘సీరియల్స్‌లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
2017 యూనికార్న్ 150 ఫేస్‌లిఫ్ట్‌ను సిద్దం చేస్తున్న హోండా
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ యూనికార్న్ 150 బైకును ఫేస్‌లిఫ్ట్ రూపంలో అభివృద్ది చేస్తోంది. కొత్త డిజైన్‌తో రానున్న యూనికార్న్ 150 ఫేస్‌లిఫ్ట్ పేటెంట్ ఫోటోలు ఇంటర్నెట్లో లీకయ్యాయి.
ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోని 150సీసీ సెగ్మెంట్లో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంస్థకు మంచి విజయం సాధించిపెట్టిన మోడల్ యూనికార్న్ 150. ఇప్పుడు ఈ 150సీసీ మోటార్ సైకిల్‌కు అప్‌డేట్స్ నిర్వహించి ఫేస్‌లిఫ్ట్ రూపంలో విపణిలోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
గతంలో ఓ సారి యూనికార్న్ 150 బైకును మార్కెట్ నుండి తొలగించింది. అయితే ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో మళ్లీ లాంచ్ చేసింది. అయితే ఈ యూనికార్న్ 150 బైకును ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయనున్న దీని తాలూకు పేటెంట్ పొందిన ఫోటోలు లీకయ్యాయి.
హెడ్ లైట్ స్ట్రక్చర్‌కు సంభందించిన విడుదలైన ఫోటో ప్రకారం ఫేస్‌లిఫ్ట్ యూనికార్న్ 150 మరింత అగ్రెసివ్ మరియు షార్ప్ డిజైన్ లక్షణాలను కలిగి ఉంది.
అప్‌డేటెడ్ యూనికార్న్ 150లో పొడగించబడిన ఫ్యూయల్ ట్యాంక్ కలదు. తద్వారా ఇది స్పోర్టివ్ లక్షణాలకు చేరువయ్యింది. మరియు వెనుక వైపున రెండుగా విడిపోయిన గ్రాబ్ రెయిల్స్ అందించనున్నారు(వెనుక వైపున చేతులతో పట్టుకునే వాటిని గ్రాబ్ రెయిల్స్ అంటారు).
లీకయిన ఫోటోల ప్రకారం ఫేస్‌లిఫ్ట్ యూనికార్న్ 150 డ్రమ్ బ్రేకులతో రానుంది. అయితే దీనిని కనీసం ఆప్షనల్‌గా అయినా డిస్క్ బ్రేక్ వేరియంట్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
ఇంజన్‌పరంగా చూస్తే ఫేస్‌లిఫ్ట్ యూనికార్న్ 150లో అదే 149సీసీ సామర్థ్యం సింగల్ సిలిండర్ ఇంజన్‌ను కొనసాగించనున్నారు. ఇది గరిష్టంగా 13బిహెచ్‌పి పవర్ మరియు 12.8ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది.
2017 యూనికార్న్ 150 ఈ ఏడాది చివరికి మార్కెట్లోకి విడుదల కానుంది. రూ. 70,000 ల ధర శ్రేణిలో రానున్న ఇది బజాజ్ పల్సర్ 150 మరియు హీరో ఎక్ట్స్రీమ్ స్పోర్ట్స్ బైకులకు గట్టిపోటీనివ్వనుంది.