రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ పుట్టిస్తున్న కస్టమైజ్డ్ హోండా యూనికార్న్

Written By:

కస్టమైజ్డ్ మోటార్ సైకిళ్ల సంస్థ కోస్తా మోటార్ సైకిల్ కంపెనీ బైకుల మోడిఫికేషన్లో ఓ కొత్త అడుగు వేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తులకు గుబులు పుట్టించే విధంగా హోండా సిబి యూనికార్న్ 150 మోటార్ సైకిల్‌ను మోడిఫై చేసింది. ఇంత చక్కగా మోడిఫికేషన్స్ నిర్వహించిన ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌కు చెందినది.

కోస్తా మోటార్ సైకిల్ కంపెనీ ఈ న్యూమరో యునో బైకును చక్కగా క్లాసిక్ కేఫ్ రేసర్ శైలిలో తీర్చిదింది. ప్రాక్టికల్‌గా, చాలా సింపుల్‌గా దీనిని మోడిఫై చేసారు. అయితే ఇందులో దాదాపు అన్ని ఆధునిక పరికరాలనే వినియోగించారు.

ఇందులోని ఇంధన ట్యాంకు పై భాగం మీద మెటాలిక్ వైన్ రెడ్ అనే కలర్‌తో ఫినిషింగ్ చేయడం జరిగింది. న్యూమరో యునో బైకులో చిన్న పరిమాణంలో ఉన్న సీటును అందివ్వడం జరిగింది.

బిఎమ్‌సి ఎయిర్ ఫిల్టర్ మరియు ఎగ్జాస్ట్ పైపును ఇంజన్ ప్రారంభం నుండి వాయువులను వెదజల్లే భాగం వరకు పూర్తిగా మేడిఫై చేయడం జరిగింది. తద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ విషయంలో ఎలాంటి నిరాశ అవసరం లేదు.

న్యూమరో యునో బైకును ఎక్ట్సీరియర్ పరంగా మోడిఫై చేసినప్పటికీ సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇందులోని అదే శక్తివంతమైన 149.10సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

ఇది గరిష్టంగా 13.14బిహెచ్‌పి పవర్ మరియు 12.84ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. గరిష్టంగా 101కిలోమీటర్ల వేగంతో దూసుకెల్లే ఇది లీటర్‌కు 60కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

న్యూమరో యునో బైకును వ్యక్తిగత ఆసక్తి ఆధారంగా నిర్మించినట్లు తెలిసింది. రాయల్ ఎన్పీల్డ్ శ్రేణిలో ఉన్న కేఫ్ రేసర్‌కు దీని శైలి గట్టిగా పోటీపడుతుంది.

ఇది మీకు అంతగా నచ్చలేదా... అయితే ట్రయంప్ మోటార్ సైకిల్స్‌కు చెందిన ట్రయంప్ స్ట్రీప్ కప్ మోటార్ సైకిల్‌ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.....

 

English summary
This Custom Unicorn Is A Cafe Racer That Will Bother Enfields
Please Wait while comments are loading...

Latest Photos