పార్క్ చేసి ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకు ఎలా కాలిపోయిందో చూడండి!

పార్కింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన బైకులో మంటలు చెలరేగి, అక్కడికక్కడే కాలి బూడిదైపోయింది. పైరింజన్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

By Anil

పార్కింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకులో మంటలు చెలరేగి, అక్కడికక్కడే కాలి బూడిదైపోయింది. పైరింజన్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

కాలిబూడిదైపోయిన నిలిపి ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకు

యువత అధికంగా ఎంచుకుంటున్న మోటార్ సైకిళ్లలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు అధికంగానే ఉన్నాయి. ధర భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటి విభిన్నమైన డిజైన్, ఇంజన్, మరియు పనితీరు వంటివి కొనుగోలుదారులను భారీగా ఆకట్టుకుంటున్నాయి రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు.

కాలిబూడిదైపోయిన నిలిపి ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకు

కానీ తరచూ ఊహించిన లోపాలు ఎన్ఫీల్డ్ బైకుల్లో బయటపడుతున్నాయి. ఛాసిస్‌లో చీలికలు, ఇంజన్‌లో సాంకేతిక లోపం వంటి అనేక లోపాలు రాయల్ ఎన్పీల్డ్ బైకుల్లో వెలుగు చూడటం జరుగుతోంది. అందులో ఒకటి ఉన్నట్లుండి బైకులు కాలిపోవడం. దీనికి ఉదాహరణగా చెప్పుకునే సంఘటన గౌహతిలో చోటు చేసుకుంది.

కాలిబూడిదైపోయిన నిలిపి ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకు

గౌహతికి చెందిన సమిత్ మంత్రి అనే వ్యక్తి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులో ఇంటికి వచ్చి, సెల్లార్‌లో పార్క్ చేసి ఇంట్లోకెళ్లాడు. అయితే బైకు మంటల్లో కాలిపోతోందని సమాచారం రావడంతో క్రిందకు వచ్చిన సుమిత్ ఆశ్చర్యపోయాడు.

కాలిబూడిదైపోయిన నిలిపి ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకు

కేవలం మూడు నెలల క్రితమే ఈ బైకును కొనుగోలు చేసాను, ఇప్పుడు కూడా కేవలం నాలుగు కిలోమీటర్ల బైకును నడిపిన అనంతరం పార్కింగ్ చేసాను. నిలిపి ఉంచిన బైకు మంటల్లో కాలిపోవడం ఏమిటని వివరించాడు.

కాలిబూడిదైపోయిన నిలిపి ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకు

నిలిపి ఉంచిన బైకులో మంటలు చెలరేగటం ఏమిటని సుమిత్ రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్‌ను సంప్రదించగా, పార్కింగ్ చేసినపుడు జరిగి ఉండదు, "మీరు బైకు నడుపుతున్నుపుడు మాత్రమే మంటలు చెలరేగి ఉండవచ్చని" చెప్పారని తెలిపాడు.

కాలిబూడిదైపోయిన నిలిపి ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకు

ఇవే మంటలు నేను బైక్ రైడింగ్ చేస్తున్నపుడు జరిగి ఉంటే ఖచ్చితంగా నేను కూడా మంటల్లో కాలిపోయోవాన్ని, లేదా తీవ్ర గాయాలకు జరిగేవని చెప్పుకొచ్చాడు. ఎలా జరిగిందో అని ఆరా తీయకుండా ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ విషయం తెలియజేయమని షోరూమ్ వారు సలహా ఇచ్చినట్లు సుమిత్ వాపోయాడు.

కాలిబూడిదైపోయిన నిలిపి ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకు

తాను ఎంతగానో ఇష్టపడి కొనుగోలు చేసిన బైకు కాలిపోవడంతో దీని గురించి తయారీదారులతో మాట్లాడాలా... లేదా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో చర్చించాలా.. అనే అయోమయంలో సుమిత్ ఉన్నాడు. ఇదే ప్రమాదం ప్రయాణిస్తున్నపుడు జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అని, తన క్షేమం దృష్ట్యా ఇక మీదట బైక్ నడపొద్దని అతని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లలో సాంకేతిత లోపాలు తలెత్తడం ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే చాలా మంది వివియోగదారులు రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తుల నాణ్యత పరంగా తీవ్ర అసంతృప్పితో ఉన్నారు. శక్తివంతమైన ఇంజన్, విభిన్న డిజైన్ అంశాలతో మార్కెట్లో మంచి విలువను సంపాదించుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు తీవ్ర అపవాదాన్ని మూటగట్టుకుంటోంది.

కాలిబూడిదైపోయిన నిలిపి ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకు

పార్క్ చేసి ఉంచిన బైకు కాలిపోవడం పట్ల రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది తయారీ లోపమైనా కాకపోయినా. కంపెనీ లేదంటే డీలర్ ఈ సమస్య గురించి ఆరా తీయడం ఉత్తమం. అయితే ఎలక్ట్రికల్ పరమైన సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu Parked Royal Enfield Classic 350 goes Up In Flames
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X