బిఎస్-IV ఎలక్ట్రా 350 ని విడుదల చేసిన రాయల్ ఎన్ఫీల్డ్

Written By:

దేశవ్యాప్తంగా విక్రయించే అన్ని మోటార్ సైకిళ్లలో కూడా బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ను కలిగి ఉండటం తప్పనిసరి చేసింది. ఈ అంశాన్ని రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తుల్లో గమిస్తే, కేవలం ఎలక్ట్రా మోటార్ సైకిల్ మాత్రమే ప్రభుత్వం నిభందనలకు అనుగుణంగా ఉండే ఇంజన్‌తో అందుబాటులో ఉంది. మిగతా వేరియంట్లను అప్‌డేట్ చేసే పనిలో రాయల్ ఎన్పీల్డ్ నిమగ్నమయ్యింది.

రాయల్ ఎన్ఫీల్జ్ ఎలక్ట్రా 350 బిఎస్-IV బైక్ గురించి మరిన్ని నేటి కథనంలో తెలుసుకుందాం రండి....

చెన్నైకి చెందిన ప్రముక క్లాసిక్ స్టైల్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు తమ లైనప్‌లో ఉన్న అన్ని మోటార్ సైకిళ్లలో కూడా బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఫీచర్‌ను జోడింపు చేపట్టింది.

ఈ ప్రముఖ వార్తా కథనం తెలిపిన వివరాలు మేరకు, రాయల్ ఎన్ఫీల్డ్ తమ శ్రేణిలోని అన్ని ఉత్పత్తుల యొక్క అప్‌డేట్స్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కొన్ని రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయ కేంద్రాల వద్ద అప్‌డేటెడ్ ఎలక్ట్రా 350 బైకులను గుర్తించినట్లు పేర్కొంది.

కేవలం ఎలక్ట్రా 350 మోటార్ సైకిల్ మాత్రమే ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్‌తో విక్రయ కేంద్రాలలో అందుబాటులో ఉంది, మిగతా అన్ని వేరియంట్లను మరో వారం లేదా రెండు వారాల్లోపు విక్రయ కేంద్రాలకు చేర్చనున్నట్లు సమాచారం.

అప్‌డేట్స్‌కు నోచుకునే అన్ని వేరియంట్ల యొక్క ధరలను పెంచనున్నట్లు తెలిసింది. నూతన ధరలు ఆ యా మోడళ్ల యొక్క అధికారిక విడుదల వేదిక మీద వెల్లడి కానున్నాయి.

అప్‌డేటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా 350 మోటార్ సైకిల్ విషయానికి వస్తే, ఇందులో 246సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే ట్విన్ స్పార్క్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఈ శక్తివంతమైన ఇంజన్ 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం చేయబడింది.

శక్తివంతమైన ఇంజన్ ఉన్నప్పుడు బైకు వేగాన్ని నియంత్రించడానికి అంతే శక్తివంతమైన బ్రేకులు అవసరం, అందుకోసం దీనికి ముందు వైపున డ్యూయల్ పిస్టన్ కాలిపర్ గల 280ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 153ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

ఇదే ఇంజన్ శ్రేణిలో మిగతా బైకులతో పోల్చితే దీని బరువు సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. ఎలక్ట్రా 350 లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ట్విన్ గ్యాస్ ఛార్జ్‌డ్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి.

భద్రత పరంగా భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్ ఇందులో అందివ్వడం జరిగింది. 13-లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు గల ఈ బైకు మొత్తం బరువు 187కిలోలుగా ఉంది.

కొలతల పరంగా రాయల్ ఎన్పీల్డ్ ఎలక్ట్రా 350 పొడవు - 2,140ఎమ్ఎమ్, వెడల్పు - 810ఎమ్ఎమ్, ఎత్తు - 1,120ఎమ్ఎమ్, వీల్ బేస్ - 1,370ఎమ్ఎమ్ గా ఉంది. దీని ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో అనలాగ్ స్పీడో మీటర్ మరియు ఫ్యూయల్ గేజ్ కలదు.

 

English summary
Royal Enfield Launches Electra 350 With BSIV Compliant Engine And AHO
Please Wait while comments are loading...

Latest Photos