Just In
- 11 hrs ago 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 13 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 14 hrs ago కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 16 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ మోటార్ సైకిల్లో నూతన ఫ్యూయల్ ఇంజక్టడ్ సిస్టమ్ అందించి, బిఎస్-IV ఇంజన్ అప్‌గ్రేడ్స్‌తో విపణిలోకి విడుదల చేసింది. హిమాలయన్ ఎఫ్ఐ గురించి మరిన్ని వివరాలు...
దేశీయ
దిగ్గజ
క్లాసిక్
బైకు
తయారీ
సంస్థ
రాయల్
ఎన్ఫీల్డ్
తమ
అడ్వెంచర్
మోటార్
సైకిల్
హిమాలయన్‌లో
భారత్
స్టేజ్
4
ఉద్గార
నియమాలను
పాటించే
ఇంజన్
మరియు
కార్బోరేటర్
స్థానంలో
ఫ్యూయల్
ఇంజెక్టడ్
సిస్టమ్
అందించి
హిమాలయన్
ఎఫ్ఐ
మోడల్‌గా
విపణిలోకి
విడుదల
చేసింది.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ ఎక్స్-షోరూమ్ ధర వివరాలు
- హైదరాబాద్ లో ధర రూ. 1,62,572 లు
- బెంగళూరులో ధర రూ. 1,63,000 లు
- చెన్నైలో ధర రూ. 1,63,156 లు
- ఢిల్లీలో ధర రూ. 1,60,500 లు
- కలకత్తాలో ధర రూ. 1,65,771 లు
- ముంబాయ్ లో ధర రూ. 1,70,000 లు
- త్రివేండ్రంలో ధర రూ. 1,61,341 లు
హిమాలయన్ ఎఫ్ఐ (ఫ్యూయల్ ఇంజెక్టడ్) మోడల్ మీద దేశవ్యాప్తంగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్లు బుకింగ్స్ ఆహ్వానిస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ బైకును రూ. 5,000 ల బుకింగ్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు.
సరికొత్త హిమాలయన్ స్పోర్ట్స్ ఎఫ్ఐ లో 411సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టడ్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 24.5బిహెచ్పి పవర్ మరియు 32ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.
అడ్వెంచర్ మోటార్ సైకిలోని శక్తివంతమైన ఫ్యూయల్ ఇంజెక్టడ్ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గల గేర్‌బాక్స్ కలదు.
ఫ్యూయల్ ఇంజక్టర్ను పరిచయం చేయడాన్ని మినహాయిస్తే, మెకానికల్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
ఫ్యూయల్ ఇంజక్టర్ అంటే ఏమిటి ?
ఇంజన్‌లోకి ఇంధనాన్ని రెండు పద్దతుల్లో పంపిస్తారు.
కార్బోరేటర్: ఇందులో వాతావరణంలోని గాలిని సేకరించి పెట్రోల్‌తో కలిపి, నిర్ణయించిన నిష్పత్తిలో ఈ గాలి మరియు పెట్రోల్ మిశ్రమాన్ని ఇంజన్ లోనికి పంపిస్తారు.
ఫ్యూయల్ ఇంజక్టర్: ఇందులో ముందుగానే గాలితో పెట్రోల్ కలపకుండా, కేవలం గాలిని మాత్రమే ఇంజన్‌లోకి పంపించి తరువాత ఇంజక్టర్ ద్వారా ముందుగా నిర్ణయించిన మోతాదులో పెట్రోల్‌ను ఇంజక్ట్ చేస్తారు.